సినీరంగంలో అడుగు పెట్టాలంటే ఎవరొకరు తెలిసిన వాళ్ళు ఉంటేనే ఛాన్స్ ఇస్తుంటారు. అందరు అలా కాకపోయినా స్వయం కృషితో కష్టపడి పైకొచ్చిన వాళ్ళు చాల మందే ఉన్నారు. చాలా మంది వారి కుటుంబాన్ని పరిచయం చేస్తారు. మనకు తెలియని కొంతమంది సినీ ప్రముఖులకు, ఇతర సెలెబ్రెటీలతో సంబంధాన్ని కలిగి ఉంటారు. కొందరు ఎంత సపోర్ట్ వున్న సక్సెస్ కాలేక చతికలబడిన వాళ్ళు కూడా వున్నారు. కొందరు నటులు ఈ సినిమా ప్రపంచంలో సక్సెస్ అవుతారు కానీ వాళ్ళ ఎంట్రీ వెనుక వారికి సంబందించిన ఎవరో ఒక సినీ తారలు వున్నారని చాలా మందికి తెలియదు. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య మనకి అందరకీ తెలిసిన నటుడే కానీ అతని అత్త లతాశ్రీ మీకు తెలిసుండకపోవచ్చు ఆమె ఒకప్పుడు బిజీ యాక్టర్ తెలుగులో తను చాలా సినిమాలలో నటించింది.

లతాశ్రీ కి సొంత అన్న కొడుకే ఈ నాగశౌర్య. ప్రత్యేక పరిచయం అవసరంలేని మంచి నటి లతాశ్రీ. పాత్రలో ఉన్నపుడు పక్కింటి పరిచయస్తురాలిగా అనిపించే లతాశ్రీ విజయవాడకు చెందిన ముల్పూరి మాధవరావు, సువర్ణలత కుమార్తె. తొలిసారిగా తమ్మారెడ్డి భరద్వాజ రూపొందించిన ‘మన్మథ సామ్రాజ్యం’ చిత్రంలో కథానాయికగా నటించారు. తరువాత టెన్త్ పాస్ అవ్వడంతో, ఇంటర్మీడియట్ విజయవాడలో చదువుతున్న టైం. నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఓసారి విజయవాడ వచ్చినపుడు.. తాను రూపొందిస్తున్న పోలీస్ భార్య చిత్రంలో నటించమని అవకాశమిచ్చారు. అది హిట్టవ్వడంతో లతాశ్రీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు..లతాశ్రీ అసలు పేరు ‘పద్మలత’ .. సినిమాల్లోకి వచ్చాక ‘లతాశ్రీ’ అని మార్చుకుంటే కలిసొస్తుందని ఒక సిద్ధాంతి చెబితే అలా మార్చుకున్నారు. ఓవైపు ఇంటర్ చదువు, మరోవైపు షూటింగ్‌లు. చివరికి అధ్యాపకులు ఇచ్చిన అమూల్యమైన సలహాతో సినిమా అవకాశాలవైపే ప్రయాణించారు లతాశ్రీ.

అలా మొదలైన ప్రయాణం యమలీల, నెంబర్ వన్, ఆ ఒక్కటీ అడక్కు లాంటి సంచలన చిత్రాలల్లో నటించి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 80 కిపైగా చిత్రాల్లో నటించిన ఈ సీనియర్ నటి 1999 తరువాత ఒకరకంగా పీక్ స్టేజ్‌లో ఉన్నపుడే జిమ్ ట్రైనర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని తెరమరుగైంది.. తెలుగుతోపాటు కన్నడంలో కథానాయికగా శశికుమార్, సాయికుమార్, కాశీనాథ్, కన్నడ ప్రభాకర్ వంటి వారితో నటించారు లతాశ్రీ. ముఖ్యంగా లతాశ్రీకి యమలీలలోని ‘హిమక్రీముల సుందరి’ పాత్ర అద్భుతమైన గుర్తింపు తెచ్చింది. ఇవివి సత్యనారాయణ, ఎస్ వికృష్ణారెడ్డిల దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాల్లో ‘జెండా ఎత్తేద్దామా’ అన్న టైపులో ఏదోక మ్యానరిజమ్‌తో శ్రీలత కోసం సరికొత్త పాత్రలను దర్శకులు ఆవిష్కరించారు. 2007లో ఈవీవీ సత్యనారాయణ ‘అత్తిలి సత్తిబాబు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది లతాశ్రీ.

అయితే లతా శ్రీ ప్రస్తుతం టాలీవుడ్ కి దూరంగానే ఉన్నా.. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఇంజనీరింగ్ చేస్తుండగా.. రెండో కొడుకు బీటెక్ చేస్తున్నాడు.మరి టాలీవుడ్ లో ఇంత మంచి గుర్తింపును ఈమెను మన టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యఅత్తని చెప్పుకోవడానికి ఎందుకు ఇష్టపడడు.? అనే విషయాన్ని ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో లతాశ్రీ దగ్గర ప్రస్తావించగా.. “తనకు ఇండస్ట్రీలో ఎవరూ లేరని చెప్పడంతో పాటు ఎప్పుడూ కూడా తన మేనత్త లతా శ్రీ పేరును నాగశౌర్య కాని.. అతని తండ్రి కాని ప్రస్తావించకపోవడంతో లతా శ్రీ హర్ట్ అయ్యారు. అయితే తనకు ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉందని.. తనంటే ఇష్టంలేని వారి పేర్లు చెప్పుకుని బతకడం తనకు అవసరం లేదంటున్నారు లతాశ్రీ. చాలామంది నా అన్నయ్య కాని, మేనల్లుడు నాగశౌర్యని కాని.. ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా అంటే లేరని అంటున్నారు.. కాని నాకు నా అన్నయ్య ఉండి లేడని చెప్పలేను. ఉన్నాడంటే ఉన్నాడనే అంటా.. వాళ్ల గురించి నేను ఇంతకన్నా చెప్పాలని అనుకోవడం లేదు’ అని అంటోంది లతా శ్రీ.

అయితే నా పేరు చెప్పుకోవడానికి వాళ్లిష్టపడరు.. అలాంటప్పుడు నా మేనల్లుడు నాగశౌర్య పేరుకాని.. నా అన్నయ్య పేరుకాని చెప్పుకోవాలని నేననుకోవడం లేదు.. కాని నా తోడపుట్టినోడు కాబట్టి నీతో పాటు ఎవరైనా ఉన్నారా అంటే మా అన్నయ్య ఉన్నాడని చెప్తున్నానంతే.. వాళ్లు అది కూడా చెప్పుకోలేకపోతున్నారు. అసలు నాగ సూర్య టాలీవుడ్ లోకి ఎలా వచ్చాడో అందరికీ తెలుసు. గతంలో ఆ ఫ్యామిలీతో చిన్న చిన్నఅభిప్రాయబేధాలు వచ్చాయి. అందుకే అప్పటి నుండి దూరంగా ఉంటున్నాను. నా అన్నయ్య మీద నాకు ఇష్టం ఉంటుంది. అన్నయ్య మనోడే.. మేనల్లుడు మనోడే.. కాని వదిన మనది కాదు కదా.. ఖచ్చితంగా అల్లుడు అంటే ఏ అత్తకు అయినా ఇష్టం ఉంటుంది. అతని సినిమాలు కూడా చూస్తా. అమ్మతో కలిసి చూసేదాన్ని. ఈ మధ్య కాలంలో చూడలేదు కాని.. ‘ఊహలు గుసగుసలాడే చూశాను” అంటూ తన మనోవేదనను వ్యక్త పరుస్తూ భావోద్వేగానికి గురయ్యారు సీనియర్ నటి లతా శ్రీ. టాలీవుడ్ లో ఒక్కొక్క సక్సెస్ మెట్టును ఎక్కాలని ప్రయత్నించే హీరోలలో నాగశౌర్య ఒకరు. సొంత బ్యానర్‌లోనే తమ అభిరుచికి తగిన సినిమాలను తెరకెక్కిస్తూ విజయాలను సొంతం చేసుకొంటూ ముందుకెళ్తున్నాడు ఈ కుర్ర హీరో.



























