బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోన్న డ్రగ్స్ కేసు టాలీవుడ్ లోను ప్రకంపనలు రేపుతోంది…డ్రగ్స్ మత్తులో టాలీవుడ్ తూగుతోంది. నటులు, నటీమణులు, నిర్మాతలు, దర్శకులు, సహాయనటులు.. ఇలా ఒకరేమిటి.. 24 ఫ్రేముల అన్ని విభాగాలను మాదకద్రవ్యాలు ఏలుతున్నాయి. ఏ జూనియర్ అర్టిస్టులో కాదు.. విశేషంగా ప్రజల ఆదరణ పొంది.. బ్లాక్‌బస్టర్ రికార్డుల కిక్కెక్కించిన ప్రముఖులే ఈ ఉచ్చులో బిగుసుకుపోవటం టాలీవుడ్‌ను ఒక్కసారిగా కుదిపేసింది.

ఎక్కడైతే రెండేళ్ల కేసు మళ్లీ తెరపైకి వస్తుందో అన్న టెన్షన్ లో ఉండగా ఈ నేపధ్యంలో ప్రముఖ టాలీవుడ్ సినీ నటి, బీజేపీ లీడర్ మాధవిలత టాలీవుడ్ డ్రగ్స్ కల్చర్ ని గుర్తు చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రయుఖులు సినిమా పార్టీల్లో డ్రగ్స్ వాడుతారని, అసలు డ్రగ్స్ లేకుండా ఏ సినిమా పార్టీ జరగదని సంచలనమైన కామెంట్స్ చేసింది. బాలీవుడ్ లో ఉన్నట్లే టాలీవుడ్ లోనూ డ్రగ్స్ కల్చర్ ఉందని దీనిపై నార్కోటిక్స్ డిపార్ట్ మెంట్ తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టాలని అభ్యర్ధించింది. అంతేకాకుండా కరోనా లాక్ డౌన్ తర్వాత ప్రస్తుతం తానున్న పరిస్థితుల్లో డ్రగ్స్ పై తాను ఓపెన్ గా మాట్లాడినందుకు భయంగా ఉందని, డ్రగ్స్ వాడే వాళ్ళ వివరాలు తెలిసినా సరే కొందరు అధికారులు చూసీ చూడనట్లు ఉంటారని, ఒకవేళ పట్టుకున్న ప్రభుత్వాలు వదిలేస్తాయన్న ధీమాతో అధికారలు ధైర్యం చెయ్యరని మాధవిలత స్ట్రాంగ్ గా చెబుతూ.. సోషల్ మీడియాల్లో తన ఫీలింగ్స్ ను షేర్ చెయ్యడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here