హైదరాబాద్‌లో పుట్టిన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ముంబయ్‌లో పెరిగి అక్కడే సెటిలైంది. ‘మున్నా మైఖేల్’ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నిధి.. నాగచైతన్య హీరోగా నటించిన ’సవ్యసాచి’ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమై.. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’ చిత్రంతో మంచి మార్కులు కొట్టేసింది. నిధి అగర్వాల్ ఇటీవలే విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో తన సినీ కెరీర్‌లో మొదటి సక్సెస్‌ను అందుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్‌బాబు మేనల్లుడు హీరోగా పరిచయం కాబోతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ఆఫర్లు వస్తున్నా సరే.. ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న ఈ అమ్మడు ఇక అవకాశాల కోసం గ్లామర్ షో చేయాలని గ్రహించి గ్లామర్ డోస్ ను పెంచేసి.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసేలా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటున్న ఈ భామ తాజాగా తన చిన్ననాటి సంగతులతో పాటు పర్సనల్ లైఫ్ లో ఎదురైన లవ్, బ్రేకప్, క్రష్ మొదలైన విషయాలను మీడియాతో పంచుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నటిగా తనను వెండితెరపై చూసినప్పుడు తన పేరెంట్స్ ఎంతో సంతోష పడ్డారని, చిన్నతనంలో తాను చాలా అల్లరి పిల్లనని, చాలా అంటే చాలా అల్లరి పనులు చేశానని చెబుతూ.. అందుకు ఉదాహరణగా బాల్యంలో జరిగిన ఓ సంఘటనను తెలియజేసింది.

స్కూల్లో మార్కులకు సంబంధించిన ప్రోగ్రస్ రిపోర్ట్ లో తల్లి సంతకాన్ని తానే పెట్టినట్టు, తల్లి సంతకాన్ని కాపీ కొట్టడం తనకి ఎప్పటికీ గుర్తుండిపోతుందని, చిన్నప్పుడు పరీక్షల్లో మార్క్స్ తక్కువగా వస్తే .. ప్రోగ్రస్ కార్డ్ తీసుకుని తన తండ్రి దగ్గరికి వెళ్లడానికి భయమేసేదని, పోనీ అమ్మకు చూపించినా తిట్లు తప్పవు కాబట్టి ఆమె సంతకాన్ని తానే పెట్టేసేదాన్నని, తన తండ్రి సంతకం కాపీ చేయడం చాలా కష్టమని.. తన మదర్ సంతకమైతే చాలా ఈజీ అని, కొన్నాళ్లకు ఈ ఫోర్జరీ సంతకం విషయం తన తల్లికి తెలిసి గట్టిగానే మందలించిందని తెలియజేసింది. ఇక తన లైఫ్ లో ఎదురైన ప్రేమ అనుభవాలను గురించి చెబుతూ.. చిన్నప్పుడు స్కూల్లో 4వ తరగతి చదివేటప్పుడే..తొలిసారిగా ఒక అబ్బాయితో ప్రేమలో పడిందట నిధి. అలా ఊహ తెలియని వయస్సులోనే ప్రేమ అనుభూతి పొందిన ఈ అందాల తార తన ప్రేమను ఎంతో కాలం నిలుపుకోలేకపోయిందట. ఆ తర్వాత కాలేజ్ చదివే రోజుల్లో మరొక అబ్బాయితో డేటింగ్ కి వెళ్లినట్లు చెప్పుకొచ్చింది ఈ భామ. ఆ అబ్బాయి లవ్ ప్రపోజల్ ఇప్పటికీ మరచిపోలేనని చెబుతోంది. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం ప్రేమలో ఉందా లేదా.? అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక తన సెలబ్రిటీ క్రష్ గురించి చెబుతూ… బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ అంటే పిచ్చి అని వెల్లడించింది ఇస్మార్ట్ నటి నిధి అగర్వాల్.



























