రవిబాబు డైరక్షన్ లో ఆమధ్య విడుదలైన అవును సినిమా అందరికీ గుర్తుండేవుంటుంది. ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించిన నటి పూర్ణకు సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారని తాజా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో తనను నలుగురు ఆకతాయిలు వేధిస్తున్నారంటూ నటి పూర్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సందర్భంగా కేంద్రం విధించిన లాక్ డౌన్‌ కారణంగా గత మూడు నెలల నుండి హీరోయిన్ పూర్ణ ఆమె స్వస్థలం కేరళలోనే ఉంటూ.. అక్కడే కొన్ని మలయాళ సినిమాలలో నటించేందుకు అంగీకరించింది.

ఇదిలావుండగా అయితే ఈమధ్యనే నలుగురు వ్యక్తుల నుంచి సోషల్ మీడియాలో ఆమెకు వేధింపులు ఎక్కువ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనకు రాంగ్ కాల్స్‌ చేయడంతో పాటు డబ్బు కూడా ఇవ్వాలని ఆ వ్యక్తులు తనని బెదిరిస్తున్నట్టుగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్ణ కంప్లైంట్ ను నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా నిందితులు బెంగళురు వాళ్ళేనని తేలింది. దాంతో వెంటనే బెంగళూరు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఆ నలుగురు నిందితులను బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ నలుగురు ఆకతాయిలు శరత్‌, అష్రఫ్‌, రఫీజ్, రమేష్‌గా గుర్తించారు. వీళ్ళు గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. 

నటి పూర్ణ అసలు పేరు కామ్నా కాసిమ్‌. ఆమె పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కేరళలోనే. 2007లో శ్రీహరి హీరోగా నటించిన శ్రీ మహాలక్ష్మీ చిత్రం ద్వారా పూర్ణ టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత అల్లరి నరేష్‌తో కలిసి సీమ టపాకాయ్ చిత్రంలో నటించి అందర్నీ అలరించింది. 2012లో వచ్చిన అవును సినిమాతో పూర్ణ బాగా పాపులరైంది. దెయ్యాల సినిమాల్లో నటించాలంటే పూర్ణయే కరెక్ట్ హీరోయిన్ అనేంతగా ఆమె ప్రేక్షకుల మనసులలో మంచి గుర్తింపు ను సంపాదించుకుంది. అవును2, రాజు గారి గది 2లో కూడా నటించిన పూర్ణ అప్పుడప్పుడు ఢీ షోలకూ కూడా వ్యాఖ్యతగా హాజరవుతుంటుంది. అన్నట్టు మన కేరళ కుట్టి పూర్ణ కూడా త్వరలో పెళ్ళికి సిద్ధమోతుంది. ఆ వివరాలను కూడా వీలైనంత తొందరలోనే తెలియజేస్తానంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here