పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు పెద్దలు.. కానీ కరోనా పుణ్యమా అని ఏ హంగామా లేకుండానే సాదాసీదాగా పెళ్ళి తంతును ముగించేస్తున్న వార్తలను ఈ లాక్ డౌన్ నేపధ్యంలో చదువుతూనే వున్నాం. కానీ ఇదంతా సామాన్యులకే కానీ సినిమా తారల పెళ్ళంటే ఆ అట్టహాసం.. ఆ వైభోగమే వేరంటారేమో.. నిజమే.. కానీ ఇందుకు భిన్నంగా గతేడాది ప్రేమ వివాహం చేసుకున్న మన టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి తన వివాహం ఎలా జరిందో కొన్ని ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వివరాలేంటో మీరే చదవండి..

సినీతారలు ఎక్కువగా ప్రేమించి పెళ్ళిచేసుకోవడానికే మక్కువ చూపిస్తారనడానికి తాజాగా గతేడాది ఓ ఇంటికి ఇల్లాలైన ప్రముఖ నటి ప్రియమణి నే ఉదాహరణగా చెప్పవచ్చు. కొంత కాలంగా తను గాఢంగా ప్రేమించిన ప్రియుడు ముస్తఫా‌రాజ్‌ తో చాలా సాదాసీదాగా రిజిస్ర్టార్ ఆఫీసులో వీరి పెళ్ళి జరిగింది. అందుకు కారణమేమిటని ఆరా తీస్తే.. తామిద్దరూ విభిన్న మతాలకు చెందిన వాళ్లమ‌ని, అందుకే సంప్రదాయబద్ధంగా కాకుండా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నామ‌ని సినీన‌టి ప్రియ‌మ‌ణియే స్వయంగా తెలిపింది. ఈ పెళ్లికి ఆమె కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

బెంగ‌ళూరులో ఈ జంట ఏర్పాటు చేసిన రిసిప్షన్ కార్యక్రమానికి టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ నుంచి ప్రముఖ నటీ నటులు హాజ‌రయ్యారని తెలియజేస్తూ.. తమ వివాహ వేడుకకు సంబంధించిన సంగీత్‌, మెహందీ ఫంక్షన్‌లో తీసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడా ఫోటోలు వైరలవుతున్నాయి. ప్రియమణి రెడ్ కలర్ దుస్తుల్లో మెరిసిపోయింది. అలా రిసెప్షన్ జరిగిన 2 రోజుల తర్వాత వెంటనే మళ్ళీ షూటింగ్‌కి హాజరైపోయిందట.అదంతా బాగానే వుంది కానీ., ఇక అసలు విషయానికొస్తే పెళ్ళికి ముందూ.. పెళ్ళికి తర్వాత.. నటిగా ప్రియమణిలో పెద్ద మార్పు ఏమీ కనబడలేదు.

పెళ్ళయిన తర్వాత తెలుగులో ‘ఢీ 10’ డాన్స్ రియాలిటీ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ప్రియమణి ఇప్పుడు ఓ బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నానని ఫ్యాన్స్ కు షాకిచ్చింది. ఇంతకీ ఆ బ్రేక్ ఎందుకంటే ఆమె తల్లి కాబోతున్నారని అసలు సంగతి చెప్పేసరికి ఫ్యాన్స్ ఆనందపడ్డారు. ఇదే విషయంపై సోషల్ మీడియాలో ప్రియమణి చేసిన పోస్ట్ కూడా వైరలైంది. అదండీ అసలు సంగతి.. సినీతారలు పెళ్ళిళ్ళు భలే చిత్రంగా జరుగుతాయి కదూ..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here