• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

సిల్క్ స్మిత చనిపోయిన రాత్రి ఏం జరిగింది? అసలు కథ ఇదే..!

17 July 2020

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

13 September 2026

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026
ADVERTISEMENT

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

2 July 2026

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

2 July 2026

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

1 July 2026

ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు’.. గుణశేఖర్ కామెంట్స్ వైరల్

1 July 2026

‘ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను’..కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి..

1 July 2026

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్?.. పోలీసులపై మాధురి ఆరోపణలు.. అసలు ఏం జరిగింది?

30 June 2026

‘నాగబంధం’ కోసం ప్రాణాలకు తెగించిన విరాట్ కర్ణ.. ఆస్పత్రి పాలైన హీరో..

30 June 2026

‘కామ్‌గా ఉన్న వాడిని నిద్ర లేపారు’.. ప్రభుత్వంపై అమర్‌నాథ్ ఫైర్

30 June 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Saturday, September 19, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

సిల్క్ స్మిత చనిపోయిన రాత్రి ఏం జరిగింది? అసలు కథ ఇదే..!

by Lavanya Suresh
17 July 2020
in Featured, Movie News
0
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

వెండితెరమీద తారాజువ్వలా ఎదిగి… కోట్లాది మంది భారతీయ సినీ ప్రేక్షకుల మనసుల్లో అగ్నిజ్వాలలు రగిలించి… చిన్న పిల్ల కాలువలా తన జీవితాన్ని మొదలుపెట్టి… పెద్ద నదిలా మారి ఎన్నో మలుపులు తిరిగి… మరెన్నో అవమానాలకు చేదు అనుభవాలకు బాధితురాలై… సినిమా రంగపు పాకుడు రాళ్ళపైకి ఎక్కే క్రమంలో అవకాశాల కోసం చేసిన అభ్యర్ధనలను తమకు సద్వినియోగం గా మలుచుకున్న పురుష కామాంధుల దాష్టీకానికి గురై… అన్నిటినీ జయించి సినీ సాగరంలో చేరి ఒక మండుతున్న కాగడాగా తనని తాను మార్చుకుని వెండితెరపై ధగధగా మెరిసి సినీ పరిశ్రమని ఒక్క చేత్తో శాసించే స్థాయికి ఎదిగి… అసిస్టెంట్ గా తన దరి చేరిన వ్యక్తి తనని నమ్మించి మోసం చేస్తున్నాడని తెలియక… అతడు తన చుట్టూ ఒక కంచుకోట నిర్మిస్తున్నాడు అన్న వాస్తవం గ్రహించలేక… చిట్టచివరికిఅది తెలుసుకున్నాక ఒంటి స్తంభం పై ఒంటరినైపోయానన్న నిజాన్ని దిగమింగుకోలేక అన్నీ ఉండి ఏమీ లేని దానిలా ఆమె ఆర్థిక సమస్యలను, వ్యక్తిగత సమస్యలను ఎదుర్కోలేక… తాను సుడిగుండం లో ఒక పడవలో చిక్కుకుపోయానని తెలుసుకొని బలవన్మరణానికి పాల్పడింది సిల్క్ స్మిత. అసలు ఆమె ను నమ్మించి మోసం చేసింది ఎవరు? ఆమె ఎందుకు చనిపోవాలి వచ్చింది? ఏదో మారుమూల గ్రామంలో జన్మించి భారతదేశ సినీ రంగాన్ని స్టార్ హీరోల కంటే సమర్థవంతంగా శాసించింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1960 డిసెంబర్ 2 శ్రీరామ్ మూర్తి నరసమ్మ దంపతులకు నెల్లూరు జిల్లాలో ఒక పేద కుటుంబంలో విజయలక్ష్మి అలియాస్ సిల్క్ స్మిత జన్మించింది. విజయలక్ష్మి కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో ఆమె కేవలం నాలుగో తరగతి వరకే చదువుకొని తర్వాత చదువులకి శాశ్వతంగా దూరం అయ్యింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు లో తన పెద్దమ్మ అన్నపూర్ణమ్మ ఒంటరిగా ఉండడంతో సిల్క్ స్మిత ని దత్తత తీసుకుంది. అయితే పదేళ్ల వయసులోనే సినిమాలపై మిక్కిలి ఇష్టం పెంచుకుంది విజయలక్ష్మి. ఎన్నో సినిమాలను చూసి చివరిగా సినిమాల్లో నటించాలని నిశ్చయించుకొని ఆ విషయాన్ని తన పెద్దమ్మకు చెప్పింది. ఆవిడ కూడా విజయలక్ష్మి కోరికను కాదనలేకపోయింది. కానీ ఎవరిని కలవాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. 1978 సంవత్సరంలో అన్నపూర్ణమ్మ వద్దకు ఒక తెలిసిన ఆయన వచ్చి గుంటూరు జిల్లాలో ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది. విజయలక్ష్మి తీసుకొని వెళ్ళు అక్కడ ఏమైనా వ్యాసాలు దొరుకుతాయేమో అని చెప్పగా… ఆమె విజయలక్ష్మిని తీసుకొని తాడికొండ కి వెళ్ళింది. అప్పటికి విజయలక్ష్మి వయసు 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ సినిమా పేరు భూదేవి కాగా… ఆ సినిమా దర్శకుడు సుగంబాబు వద్దకు వెళ్లి అయ్యా ఈ అమ్మాయి పేరు విజయమాల( స్టైలిష్ గా పేరు ఉండాలని అప్పటికప్పుడు అన్నపూర్ణమ్మ విజయలక్ష్మి పేరు మార్చి చెప్పింది) నాకు కూతురు వంటిది. ఏదైనా చిన్న పాత్ర ఇవ్వండి అని అన్నపూర్ణమ్మ అడిగింది. దీంతో ఆ దర్శకుడు ఆమెను తదేకంగా చూసి ఇదేంటి ఈ అమ్మాయి ఇంత నల్లగా బొద్దుగా కళాహీనంగా ఉంది ఈమె అసలు ఆర్టిస్ట్ ఎలా అవుతుంది అని మనసులో అనుకొని మరి నటనలో ఏమైనా అనుభవం ఉందా అని అడిగితే ఏమీ లేదండి అని చెప్పారు. దీంతో బాగా ఆశ్చర్యపోయిన దర్శకుడు సుగంబాబు నటన అనుభవం లేదు అంటున్నారు మరి మా సినిమాలో ఎలా పెట్టుకోవాలి అని ప్రశ్నించే సర్లే ఒక మూడు రోజులు ఆగి రండి నేను ఏదైనా చిన్న పాత్ర ఉంటే చెప్తాను అని చెప్పి పంపించి వేశాడు.

అయితే అన్నపూర్ణమ్మ ఇంటికి వెళ్ళిపోకుండా అక్కడే మూడు రోజుల పాటు ఉండి ప్రతిరోజు అక్కడికి వెళ్లి షూటింగ్ చూసేది. వాళ్లని చూసిన దర్శకుడు వీలుంటే ప్రతిరోజు వస్తున్నారని జాలిపడి విజయలక్ష్మి ని దగ్గరికి పిలిచి ఏమమ్మా నువ్వు నటిమణి అవ్వాలి అనుకుంటున్నావా అని కాసేపు ముచ్చట పెట్టారు. ఆ సమయంలోనే ఆమె కళ్ళల్లో మత్తెక్కించే ఏదో మెరుపుని చూసిన సుగం బాబు ఏమే గొప్ప నటిమణి అవుతుందని తన మనసులో తను అనుకున్నాడు. ఆ తర్వాత సినిమా లో లేని పాత్రని కేవలం విజయలక్ష్మి కోసమే సృష్టించి నాలుగు రోజుల పాటు ఎలా నటించాలో ఆమెకు చాలా చక్కగా వివరించి నాలుగు రోజుల పాటు ఆమెకు సంబంధించిన షూటింగ్ జరిపి పూర్తిచేసి మీ అమ్మాయి పాత్రకి షూటింగ్ జరపడం పూర్తయింది. ఇంకా మీ అమ్మాయిని సినిమాల్లో నటించే చేయాలనుకుంటే మద్రాసు వచ్చినప్పుడు మమ్మల్ని కలవండి అని చెప్పాడు. తదనంతరం అన్నపూర్ణమ్మ విజయలక్ష్మి ని తీసుకుని మద్రాసు వెళ్లి సీనియర్ నటీమణి ఛాయాదేవి ఇంట్లో అద్దెకి తినే ఈ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించసాగారు. కానీ విజయలక్ష్మి చామనచాయ రంగు ఉండడంతో అంతా ఆకర్షణీయంగా ఉండకపోవడంతో ఆమెకు అవకాశాలు వెంటనే రాలేదు. దీంతో బతుకు జీవనం సాగించేందుకు ఛాయాదేవి కి అసిస్టెంట్ అవతారమెత్తింది విజయలక్ష్మి. ఈ క్రమంలోనే డైరెక్టర్ మల్లికార్జున వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన త్రిపురనేని వరప్రసాద్ మా సినిమాలో రెండు పాత్రలు వేయడానికి ఇద్దరు యువతులు కావాలి మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే తెలియజేయండి అని చెప్పారు. దీంతో ఛాయాదేవి విజయలక్ష్మి అతని వద్దకు పంపించారు. ఈ సినిమా పేరు ఆడదంటే అలుసా కాగా… ఈ సినిమా చిత్రీకరణ నిమిత్తం విజయలక్ష్మిని తిరుపతి తీసుకెళ్లి అక్కడ ఆమెకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చాలా మర్యాదగా చూసుకున్నాడు. అందుకే త్రిపురనేని వరప్రసాద్ అంటే విజయలక్ష్మికి చివరి వరకు ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నాయి.

ఆ తర్వాత విజయలక్ష్మి తాయారమ్మ బంగారమ్మ సినిమా లో చిన్న పాత్రలో నటించింది. కొన్ని రోజుల తర్వాత తమిళ ప్రముఖ రచయిత విను చక్రవర్తి కంట్లో విజయలక్ష్మి పడగా ఆమెను పిలిపించుకొని తాను రాసిన వండి చక్రం అనే సినిమాలో సిల్క్ పాత్రలో నటించేందుకు ఒక అమ్మాయి కావాలని ఆ పాత్రలో నువ్వు సరిగ్గా సరిపోతాయని ఎన్నికలలో ఆకర్షణ ఉందని చెప్పి ఆమెని తన సినిమాల్లో నటింపజేశాడు. ఆ తర్వాత మలయాళ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది. అయితే ఆ సినిమా డైరెక్టర్ ఆంటోనీ ఈస్టమన్ విజయలక్ష్మికి స్మిత అనే పేరు పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె నటించిన బండి చక్రం సినిమా విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ముఖ్యంగా సిల్క్ పాత్ర ప్రేక్షకులను బాగా మెప్పించింది. దాంతో విజయలక్ష్మి పేరు కాస్తా సిల్క్ స్మితగా మారిపోయింది. ఇక అప్పటినుండి సిల్క్ స్మితగా వెండితెరపై శృంగారభరితమైన పాత్రలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. అప్పట్లో బడా స్టార్ హీరోల కంటే ముందే అత్యంత పాపులారిటీ ఉందంటే అతిశయోక్తి కాదు. ఆమె దొరికిన యాపిల్ పండును 25 వేల రూపాయలకు వేలం వేసి కొండ అంటే ఆమె క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో సినిమాల్లో శృంగారభరితమైన పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సిల్క్ స్మిత 36 ఏళ్లకే ఆత్మహత్య చేసుకొని యావత్ సినీ ప్రపంచానికి తీరని లోటు మిగిల్చింది.

ఇది కూడా చదవండి :

‘నాగబంధం’ కోసం ప్రాణాలకు తెగించిన విరాట్ కర్ణ.. ఆస్పత్రి పాలైన హీరో..

సెలబ్రిటీ లో ఒంటరిగా ఫీల్ అయినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రేమ ఆప్యాయతలకు నోచుకోనప్పుడు కాస్త ప్రేమ ఆప్యాయత చూపించిన వారికి గుడ్డిగా నమ్ముతారు. సిల్క్ స్మిత కూడా విజయనగరానికి చెందిన డాక్టర్ గా చెప్పుకునే ఒక పెళ్లి అయిన రాధాకృష్ణ అనే ఒక వ్యక్తి స్మిత సెక్రటరీగా, మేనేజర్ గా ఆమె జీవితంలో అడుగుపెట్టి ఆమెకు ఎక్కడికైనా ప్రేమ ఆప్యాయత చూపించి గుడ్డిగా నమ్మించాడు. తనకు అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు అన్న విషయం తెలిసిన స్మిత అతడిని అతడి కుటుంబాన్ని మొత్తం తన ఇంట్లోకి తెచ్చుకొని మరీ గౌరవం ఇచ్చింది. ఒంటరితనాన్ని దూరం చేసిన అతడిని స్మిత బాగా నమ్మింది. ఆమె ఆర్థిక లావాదేవీలు, షూటింగ్ షెడ్యూల్ డేట్స్ మొత్తం అతడే చూసుకునే వాడు. స్మిత అతడిని గుడ్డిగా నమ్మడం తో తాను తన స్వప్రయోజనాల కోసం ఆమె చుట్టూ కంచుకోట కడుతూ డబ్బులు మొత్తం దోచుకున్నాడు. అలాగే సిల్క్ స్మిత కదలికలపై అధికారం చెలాయించే స్థాయికి చేరుకున్నాడు.

1990 సంవత్సరంలో సినిమా రంగంలో కొత్త మార్పులు రాగా హీరోయిన్లే ఐటమ్ సాంగ్లు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో సిల్క్ స్మిత కి అవకాశాలు సన్నగిల్లి పోయాయి. ఆ సమయంలో సిల్క్ స్మిత నిర్మాణ రంగంలో అరంగేట్రం చేసి రెండు సినిమాలు తీసి బాగా నష్టపోయింది. మరోవైపు తన మేనేజర్ రాధాకృష్ణ ఆమెని వేధించడం బెదిరించడం నువ్వు బయటికి వెళితే నీ జీవితం కుక్కలు చించిన విస్తరిలా మారుతుంది అని హెచ్చరించడం, ఆమె క్యారెక్టర్ ని అపహేళన చేయడం ప్రారంభించాడు.. దీంతో స్మిత మానసికంగా బాగా కృంగిపోయింది కానీ అతనితో తెగతెంపులు చేసుకోలేకపోయింది. ఒకవేళ అతడిని విడిచి పెట్టి ఉంటే ఇప్పటికీ సిల్క్ స్మిత బ్రతికి ఉండేవారేమో. 1993వ సంవత్సరంలో సిల్క్ స్మిత కి మరొకసారి అవకాశాలు రావడం పెరిగిపోయాయి. బావ బామ్మర్ది సినిమాలో నటించిన సిల్క్ స్మిత బావల సయ్య పాటలు అద్భుతంగా డాన్స్ చేసిన ప్రేక్షకుల మనసులను చూరగొన్నది. మరోవైపు సిల్క్ స్మిత మేనేజర్ ఆమె ఆస్తులన్నీ కాజేసి… ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపో అని బయటకి గెంటి వేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సిల్క్ స్మిత ఫ్యాన్ కి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
Lavanya Suresh

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Related Posts

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

1 July 2026

ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు’.. గుణశేఖర్ కామెంట్స్ వైరల్

1 July 2026

‘ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను’..కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి..

1 July 2026

‘నాగబంధం’ కోసం ప్రాణాలకు తెగించిన విరాట్ కర్ణ.. ఆస్పత్రి పాలైన హీరో..

30 June 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

13 September 2026

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk