Connect with us

Featured

టాలీవుడ్ శృంగార తార ‘సిల్క్ స్మిత’‌ ఈ లోకాన్ని వీడి 24 ఏళ్లు !!

Published

on

ఆమె పేరు చెప్పగానే శృంగార ప్రియుల గుండెలు బరువెక్కుతాయి. కన్నీటితో కళ్లు తడిసిపోతాయి. ఆమె అందం… అభినయం… నృత్య భంగిమలను మించిన వ్యక్తిగత జీవితమే ప్రేక్షకుల మదిలో ఓ చెరగని ముద్ర వేసాయి. సినీ గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రేత్యక ముద్ర వేసుకోవడంతో విజయం సాధించినా … తన పేరులోని విజయాన్ని మాత్రం నిజ జీవితంలో చూడలేకపోయింది. తళుకుబెళుకులు రంగుల ప్రపంచంలో అమాయకమైన చిర్నవ్వులను మిగిల్చి తనని తాను అంతం చేసుకుని మరెన్నటికీ తిరిగిరాలేని దూర తీరాలకు తరలిపోయింది. సినీమాయలోకపు పాకుడురాళ్ల అంచున నిల్చుని నిలదొక్కుకోలేక అగాధంలోకి జారిపోయి ప్రాణాలను కోల్పోయింది.

తెరపై కనిపించేదంతా అబద్దమని… తన చావు మాత్రమే నిజమనే సంకేతాన్నిచ్చి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. అందుకే… ఆమె పేరు చెప్పగానే అశృగంగ…ఆవేదన తప్ప ఆమె మిగిల్చిన అభినయ ఆనందం చాలామందికి కనబడదు. ఆమె ఈ లోకాన్ని వీడి ఇరవై నాలుగేళ్లవుతున్నా నేటికీ సిల్క్ పేరు చెబితే చాలు టాలీవుడ్ ప్రేక్షకుల మాది ఉరకలేస్తుంటుంది. వెండి తెర‌పై హీరోయిన్‌ గా వెలిగిపోవాలని కలలుగన్న విజయలక్ష్మి వడ్లపాటి అలియాస్‌ సిల్క్‌ స్మిత టాలీవుడ్ లో ఐటంగర్ల్‌గా సెటిలైంది. సిల్క్‌ స్మిత 1960 డిసెంబర్ 2న రామల్లు, సరసమ్మ దంపతులకు ఏలూరులో జన్మించింది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా పదేళ్ల వయసులో నాలుగో తరగతితో విద్యకు స్వస్తి చెప్పిన ఆమె రూపం ఎంతోమంది దృష్టిని యిట్టె ఆకర్షించేది. దాంతో, ఆమె చాలా ఇబ్బంది పడేది. చాలా చిన్న వయస్సులోనే స్మితకు పెళ్లి చేసేశారు ఆమె తల్లిదండ్రులు. సిల్క్ భర్త, అత్తామావయ్యలు ఆమెను వేధింపులకు గురి చేస్తుండటంతో ఇంటి నుంచి స్మిత పారిపోయి టచ్ అప్ ఆర్టిస్ట్ గా స్మిత తన కెరీర్ ను మొదలుపెట్టింది.

ఆ తర్వాత చిన్న క్యారెక్టర్ రోల్స్ తో సినీ రంగంలో బ్రేక్ సంపాదించుకుంది. ఆ తరువాత ఏవీఎం స్టూడియో సమీపంలో ఫ్లోర్ మిల్ డైరెక్టర్ గా పనిచేసే విను చక్రవర్తి స్మితలోని ప్రతిభను గుర్తించి అతను ఆమె పేరుని ‘స్మిత’గా మార్చారు. అతని సంరక్షణలోనే స్మిత ఉండేది. అతని భార్య స్మితకు ఇంగ్లీష్ నేర్పించింది. అలాగే స్మిత డాన్స్ నేర్చుకోవడానికి కూడా ఏర్పాటు చేశారు. అయితే తరువాత, తన సెక్స్ అప్పీల్ కారణంగా నైట్ క్లబ్బుల్లో, రెస్టారంట్లలో డాన్స్ చేసే వాంపు పాత్రలతో ఎక్కువగా నటించారు. ఆ విధంగా చిత్ర రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత ఏమాత్రం మోమాటం లేకుండా నర్తించి, నటించి, ఒళ్ళు దాచుకోకుండా కనిపించి… నిర్మాతలకు కాసుల వర్షం కురిపించేందుకు తనవంతుగా కృషి చేసింది. చారడేసి కళ్ళు పలికించే శృంగార నైషధాలు ఎన్నో? లిపి స్టిక్ రాసుకున్న పెదాల్లో పరుచుకున్న మంచు తుఫానులు ఇంకెన్నో? ఆకట్టుకునే శరీర సౌష్టవం… నడిచినా నర్తించినట్లనిపించే సోయగం… ముద్దు ముద్దు మాటలు…కత్తిలాంటి పాటలు… ఆమెకే సొంతం. ఆమె మనసు ఎంత సున్నితంగా ఉంటుందో… స్క్రీన్ నేమ్ కూడా అంత సున్నితమే. స్మిత… సదా మందస్మిత.

స్మితకు విశేషణంగా సిల్క్…వెరసి సిల్క్ స్మిత. స్మిత సినిమాలో ఉందంటే చాలు…థియేటర్లలో యువ ప్రేక్షకుల జోరే వేరు. టికెట్స్ తెగిపోవడం… తెరచిన కొద్దిసేపట్లోనే బ్లాక్ లో అమ్ముడవడం…అప్పట్లో ఆనవాయితీగా కనపడే దృశ్యం. సైలెన్స్…స్టార్ట్ కెమెరా… యాక్షన్ ల మధ్య వెలుగు జిలుగులు ప్రపంచంలో శృంగార రసారాజ్ఞిగా సిల్క్ స్మిత వెండితెరపై స్వర్ణ యుగాన్ని అనుభవించింది. అలనాటి అగ్ర హీరోలతో ఆడి పాడింది. తన హొయలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ప్రేక్షకులందరి ప్రేయసిగా మారిన వెండితెర సుందరి స్మిత. సిల్క్ స్మిత ప్రధానంగా దక్షిణ భారత సినిమాలలో నటించింది. మొదట్లో సహాయ నటిగా నటించి.. 1979వ ఏడాదిలో ‘వండి చక్రం’ అనే తమిళ సినిమాలో ‘సిల్క్’ అనే పాత్రతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే, ఆ తరువాత ఆ తరహా పాత్రలే ఎక్కువగా సిల్క్ స్మితకు వచ్చాయి. 1980లలో అత్యంత డిమాండ్ ఉన్న శృంగార నటిగా గుర్తింపు పొందింది. డాన్స్ నంబర్స్ తో, బోల్డ్ పెరఫార్మన్సెస్ తో దక్షిణ సినిమా పరిశ్రమలో ఎక్కువ ఫాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ‘అమరం’ అనే తమిళ సినిమాలో, ‘హళ్లి మెష్ త్రు’ అనే కన్నడ సినిమాలలో స్మిత ఐటెం సాంగ్స్ బాక్సాఫీసుని షేక్ చేసేశాయి.

కొంతమంది విమర్శకులు, జర్నలిస్టులు స్మితని ‘సాఫ్ట్ పోర్న్’ స్టార్ గా వర్ణించారు. స్మిత కేవలం డాన్సర్ పాత్రలను మాత్రమే కాదు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కూడా పోషించి తన నటనతో కూడా ఎక్కువ ప్రేక్షాదరణను పొందింది. నాన్ సెక్సువల్ పాత్రల్లో కూడా ప్రేక్షకులని, విమర్శకులని ఇంప్రెస్ చేసింది స్మిత. ఇండియన్ అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్మిత నటించిన ‘లయనం’ అనే మలయాళ సినిమా మంచి క్రేజ్ ని సంపాదించుకొంది. ఎన్నో భాషల్లోకి డబ్ అయ్యింది ఈ చిత్రం. మలయాళంలో విడుదలైన 10 సంవత్సరాల తరువాత హిందీలో ‘రేష్మా కి జవానీ’ అనే పేరుతో తెరకెక్కించారు. బాలీవుడ్ లో ఈ చిత్రం కూడా ఎక్కువ ప్రేక్షాదరణను పొందింది. బాలుమహేంద్ర దర్శకత్వం వహించిన ‘వసంత కోకిల’ సినిమా స్మిత కెరీర్ లో అత్యంత గౌరవనీయమైన చిత్రంగా నిలిచింది. ఇందులో శ్రీదేవి, కమల్ హాసన్ వంటి అగ్ర నటీనటులతో స్మిత స్క్రీన్ నటించింది. సీతాకొక చిలుక, అభిమన్యుడు తదితర చిత్రాల్లో స్మిత అభినయం ఉన్న పాత్రల్లో మెరిసింది. తన హస్కీ వాయిస్ తో ప్రేక్షకులను అలరించింది. సిల్క్ స్మితకు చాలా తక్కువ మందే ఫ్రెండ్స్ ఉండేవారు. తాను ఎక్కువగా మాట్లాడేది కాదు. అలాగే ఎవరితోనూ అంత తొందరగా స్నేహం చేసేది కాదు. స్మిత ఉన్నది ఉన్నట్లు చెప్పేవారని ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ టాక్ ఉంది. అలాగే స్మితకు కోపం కూడా తొందరగా వస్తుందని కూడా ఓ రూమర్ అప్పట్లో ప్రాచుర్యంలో ఉండేది. వృత్తి పట్ల నిబద్దత, సమయ పాలన, డెడికేషన్ …ఇవీ స్మిత విజయ రహస్యాలు. తను ఆలస్యంగా ఎప్పుడూ షూటింగ్ కి వచ్చేది కాదు. వృత్తి పట్ల ఎంతో బాధ్యతగా ఉండేది. అలాగే స్మిత ఎంతో పట్టుదలతో అనుకొన్న పనిని పూర్తి చేసేది.

ఈ కారణంగానే చదువుని మధ్యలోనే ఆపేసినప్పటికీ, ఇంగ్లీష్ భాషపై పట్టు సంపాదించుకోగలిగింది. ఇంగ్లీష్ భాషలో ఎంతో అనర్గళంగా మాట్లాడేది. ఫ్రెండ్స్, ఫాన్స్ స్మితది చిన్న పిల్లల మనస్తత్వమని, అలాగే స్మిత మృదు స్వభావి అని చెప్పుకునేవారు. 17 సంవత్సరాల తన సుదీర్ఘ సినిమా కెరీర్ లో, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో మొత్తం 450 సినిమాలకు పైగా నటించైనా సిల్క్ స్మిత సెప్టెంబర్ 23న చెన్నైలోని తన అపార్ట్మెంట్ లో ఆత్మహత్య చేసుకుంది. 1996, సెప్టెంబర్ 23న తన స్నేహితురాలు, ప్రముఖ డాన్సర్ అయిన అనురాధతో తనను ఇబ్బంది పెడుతోన్న అంశం గురించి చర్చించడానికి ఆమెను కలవాలనుకుంది. కానీ, అప్పుడు అనురాధ తన పిల్లల్ని స్కూల్ కి పంపించే పనిలో బిజీగా ఉన్న కారణంగా, స్కూల్ లో తన పిల్లల్ని దిగబెట్టిన తరువాత తనని కలవడానికి వస్తానని అనురాధ స్మితతో తెలియజేసింది. అయితే అదే రోజు కొన్ని గంటల తరువాత చెన్నైలోని తన ఇంట్లో చనిపోయి ఉంది స్మిత. ఈ విషయం ఆమెఫాన్స్ ని ఎంతో కలవరపెట్టింది. ఇప్పటికీ స్మిత మరణం వెనుక ఉన్న కారణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.

కొంతమంది, సినిమా నిర్మాణంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి నష్టపోయినందుకు స్మిత ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తారు. మరికొంతమంది స్మిత ప్రేమించి విఫలమైన కారణంగా సూసైడ్ చేసుకున్నారని అనుకుంటున్నారు. ఏదేమైనా తెలుగులో స్మిత నటించిన సినిమాలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తున్నాయి. ‘సీతాకొక చిలుక’, ‘యమకింకరుడు’, ‘ఖైదీ’, ‘గూఢచారి నెంబర్ 1’, ‘రోషగాడు’, ‘ఛాలెంజ్’, ‘రుస్తూం’, ‘హీరో’, ‘అగ్నిగుండం’, ‘చట్టంతో పోరాటం’, ‘శ్రీ దత్త దర్శనం’, ‘దొంగ’, ‘రాక్షసుడు’, ‘కిరాతకుడు’, ‘ఖైదీ నెంబర్ 786’, ‘గీతాంజలి’, ‘బామ్మా మాట బంగారు బాట’, ‘ఆదిత్య 369’, ‘చైతన్య’, ‘అంతం’, ‘బావ బావమరిది’, ‘కుంతి పుత్రుడు’, ‘గోవిందా గోవిందా’, ‘రక్షణ’, ‘ముఠామేస్త్రి’, ‘పల్నాటి పౌరుషం’, ‘చిలకపచ్చ కాపురం’, ‘మా ఆవిడ కలెక్టర్’ వంటి ఎన్నో సినిమాలలో నటించారు. స్మిత మరణించి ఇరవై నాలుగేళ్లవుతున్నా… ఆమె మిగిల్చిన కదిలే బొమ్మలు సజీవంగానే ఉంటాయి. సినిమా ప్రపంచంలో స్మిత మరపురాని, మరచిపోలేని శృంగార తారక. ఆ తారక ప్రేక్షకుల గుండెల్లో తళుక్కుమంటూనే ఉంటుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!