తెలుగు తెరపై అక్క, వదిన, అమ్మ పాత్రలలో పోటీ పడేవారి జాబితాలో సురేఖావాణి తప్పకుండా కనిపిస్తుంది. ఈ తరహా కుటుంబ పాత్రలు ఆమెకి మంచి పేరునే తెచ్చి పెట్టాయి. అలాంటి సురేఖా వాణి ఈ మధ్య వెండితెరపై చాలా తక్కువగా కనిపిస్తోంది. కానీ వెండి తెరపై వేసే పాత్రలకు అపోజిట్ గా సోషల్ మీడియాలో మాత్రం సురేఖావాణి చాలా హాట్ గా కనిపిస్తూ.. యాక్టివ్ గా ఉంటుంది.

ఈమధ్య కాలంలో తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ రంభోలా చేస్తోంది. తెరపైన చీరకట్టులో కనిపిస్తూ సాంప్రదాయంగా కనిపించే సురేఖవాణి సోషల్ మీడియాలో మాత్రం బికీనీ వేసుకుని స్విమ్మింగ్ ఫూల్ లో దిగి తన అందాలను ప్రదర్శించింది. ఆ ఫోటోలన్నీ లేటెస్ట్ గా వైరల్ అవుతున్నాయి. రకరకాల డ్రెస్సులతో యూత్ ను ఆకర్షించేలా ఆమె వేస్తున్న డ్రస్సులు.. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలను చూసిన ప్రేక్షకులు షాకవుతున్నారు.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె చేస్తున్న పాత్రలన్నీ స్టార్ హీరోల సినిమాలే కావడంతో ఆమెకు బాగానే కలిసి వచ్చిందని చెప్పవచ్చు. కరోనా లాక్ డౌన్ టైంలో ఆమె కాస్త ఖాళీగా వున్నప్పుడు ఇలా ఫోటో సూట్ లకు ఫోజులిచ్చి సోషల్ మీడియాలో తన అందాలను ప్రదర్శిస్తుండటంతో ప్రస్తుతం సురేఖావాణీ టాపిక్ సంచలనం సృష్టిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here