సురేఖావాణీ.. ఈ పేరు వినగానే ఎవరికైనా తెలుగు తెరపై ఆమె నటించిన అక్క .. వదిన .. అమ్మ పాత్రలే గుర్తుకొస్తాయి. ఈ తరహా పాత్రలలో ప్రేక్షకులను మెప్పించడంలో ఆమెకి మంచి గుర్తింపు వుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖావాణి టాలీవుడ్ లో చాలా పాపులర్. కుటుంబ నేపధ్యమున్న పాత్రలకు కు పెట్టింది పేరుగా ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతోంది.

సురేఖ వాణి సినిమాల్లో గ్లామర్ డోస్ లేని పాత్రలతో, చక్కటి అభినయంతో ఆఫర్స్ అందుకుంటోంది. చాలా సినిమాల్లో పిన్ని పాత్రలో, ఆంటీ పాత్రలో నటిస్తోంది. అయితే ఆమె వెండితెరపై వేసే పాత్రలకు, రియల్ లైఫ్ లోని తన హాట్ హాట్ ఫొటోలతో ఈమధ్య సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న సందడికి అస్సలు సంబంధమే లేనట్లుంది. వెండితెరపై చీరకట్టులో తెలుగు సాంప్రదాయం ఉట్టి పడేలా అచ్చతెలుగు ఆడపడుచులా కనిపించే సురేఖావాణీ.. సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో నెటిజన్లందరికీ కనువిందు చేస్తుంది. ఈ మధ్యనే బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తన అందాలను ప్రదర్శించింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో బాగానే వైరలయ్యింది. వెండితెరపై ఆమెను కుటుంబ పాత్రల్లో చూసిన ఫ్యామిలి ప్రేక్షకులు మాత్రం ఈ ఫొటోను చూసి షాక్ అవుతున్నారు.

ఇప్పటికే పెళ్లీడుకొచ్చిన కూతురు ఉన్న సురేఖా వాణిని ఇలా చూడటం చాలా మందికి ఆశ్చర్యంగానే ఉంది. అయితే ఆమె గ్లామర్ లుక్స్ పై కొంతమంది నెగెటివ్ కామెంట్స్ ను కూడా షేర్ చేశారు. భర్త చనిపోయిన 4రోజులకే సురేఖావాణీ ఆనందంగా సినిమా షూటింగ్ లలో పాల్గొందన్న రూమర్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఇదిలా వుండగా.. సురేఖావాణి కూతురు సుప్రీత త్వరలోనే సినిమాల్లో నటిస్తున్నట్లు, ఓ యంగ్ హీరో చిత్రంలో సుప్రీత హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందనే గాసిప్స్ మీడియా చెవిన పడ్డాయి. వీటన్నిటిపై స్పందించిన సురేఖావాణి తన కూతురి లైఫ్ గురించి, అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఒక క్లారిటీ ఇచ్చింది.

“”నా పక్కన ఒక మగాడు కనిపిస్తే చాలు.. అతడు నా బాయ్ ఫ్రెండ్ అంటూ కథలు అల్లేస్తున్నారు. అక్కడున్నది కజిన్, బ్రదర్, తండ్రి ఎవరూ ఉన్నా తెలుసుకోకుండా మాట్లాడేవాళ్ళు ఎక్కువై పోయారు. ముక్కూ, మొహం తెలియనివాళ్ళతో కూడా నాతో లింక్ పెట్టేస్తూ గాసిప్స్ క్రియేట్ చేసేస్తున్నారు. ఇలాంటి రూమర్స్ వలన నేనెంత మానశిక క్షోభ అనుభవిస్తున్నానో నాకు తెలుసు. నా భర్త సురేష్ తేజ చనిపోవడం నేనిప్పటికీ కోలుకోలేని షాక్. ఆయన చనిపోయిన తర్వాత ఆ బాధను దిగమింగుతూనే నా కూతురుతో సరదాగా గడుపుతున్నాను. నా లైఫ్ నా ఇష్టం. నాకు నచ్చినట్టుగా బతకడమే నాకిష్టం.

నేను.. నా కూతురు సరదాగా సినిమాలకి .. షికార్లకు వెళ్తుంటాము. మా అమ్మ నన్ను స్వేఛ్ఛా భావాలతో పెంచింది. అలాగే నా కూతురిని నేను పెంచుతూ వచ్చాను. మా జీవితాలను ఎవరూ ప్రశ్నించే ఛాన్స్ నేనివ్వను. ఈమధ్య నా కూతురు సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని అందరూ అడుగుతున్నారు. తనకి నటనపై ఆసక్తి వుంటే.. సినిమాల్లోకి వెళ్లాలనే ఉత్సాహం వుంటే.. నేను మాత్రం అడ్డు చెప్పను” అంటూ తన మనసులోని మాటను స్పష్టంగా తెలియజేసింది. ఇక సురేఖావాణి కూతురు తన కెరీర్ ను ఏవిధంగా ప్లాన్ చేసుకుంటుందో.. తల్లి అడుగుజాడల్లోనే నడుస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.!



























