సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ ఉందట మోడ్రన్ మదర్ రోల్స్ చేసే ఆర్టిస్ట్ సురేఖా వాణి కి. ఏది ఏమైనా ఏజ్ బార్ లో కూడా పర్ఫెక్ట్ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగా పెంచుకుంటోంది. ఇక గత కొద్దిరోజులుగా సురేఖా వాణి రెండో పెళ్లి గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే రూమర్లు కాస్త మరీ ఎక్కువ అవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి అవన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టిపారేశారు సురేఖా వాణి.

మరోవైపు సోషల్ మీడియాలో తమ పెంపుడు కుక్కతో సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రితలు చేసే చేష్టలు వైరల్ అవుతుంటాయి. దానికి క్రిష్ బండారు అని పేరు కూడా పెట్టుకుంది. ఆ మధ్య తమ పెట్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయడంతో తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది. తాజాగా తన పెంపుడు కుక్కతో సుప్రిత ఆడుకుంటుంటే సురేఖా వాణి సెటైర్ వేసారు. కింద మీద పడుకుని, పెట్‌తో ముద్దు ముచ్చట్లు ఆడుతూ ఉన్న సుప్రితపై కామెంట్ చేశారు సురేఖ వాణీ. ‘ఏంటో ఈ పిచ్చి చేష్టలు’ అంటూ కూతురి అల్లరిపై సురేఖా వాణి సెటైర్ వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here