జక్కన్నపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన మిల్కీబ్యూటీ !! రాజమౌళి నుంచి ఫోన్ వస్తే…

0
196

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఇప్పటి వరకూ డైరెక్ట్ చేసిన ప్రతీ సినిమాలోనూ కధానాయికకి కథలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. తన తొలి సినిమా “స్టూడెంట్ నెం.1” నుంచి ఈమధ్య వచ్చిన బాహుబలి వరకు ప్రతీ సినిమాలోనూ కధానాయికను అద్భుతంగా చూపిస్తూ.. ఆ పాత్రకి ఓ ప్రత్యేకతనిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. “మగధీర” సినిమాలో మిత్రవిందగా నటించిన కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. “ఛత్రపతి” లో శ్రియ, “విక్రమార్కుడు” లో అనుష్క ఇలా జక్కన్న సినిమాలలో నటించిన ప్రతీ హీరోయిన్ స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకున్నారు.

ఇక అసలు విషయానికొస్తే.. “బాహుబలి చిత్రం పార్ట్ 1” లో నటించిన టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా బాగా పాపులరవ్వడమే కాకుండా ఈ సినిమా తమన్నా కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. బాహుబలి చిత్రం అందాల తార అనుష్కకి ఎంతటి గుర్తింపును తీసుకొచ్చిందో.. తమన్నాకి కూడా అంతే క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మరో పాన్ ఇండియా చిత్రం “సైరా” లోను నటించిందంటే “బాహుబలి” ఎఫెక్ట్ తమన్నాకి ఎంత బాగా పని చేసిందో చెప్పుకోవచ్చు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా.. ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ.. దర్శక ధీరుడు రాజమౌళి కోసం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. జక్కన్నపై తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకీ రాజమౌళిపై తమన్నా చేసిన కామెంట్స్ సారాంశం ఏమిటంటే.. “డైరెక్టర్ రాజమౌళి గారు ఒకసారి తన సినిమాలో నటించారు కదా అని మరో చిత్రంలో వాళ్ళ క్యారెక్టర్ సూటైనా.. కాకపోయినా మళ్ళీ పిలిచి హీరో, హీరోయిన్స్ కు ఛాన్స్ ఇవ్వరని, ఆయన రాసుకున్న పాత్రకి ఎవరైతే సరిగ్గా సూటవుతారనుకుంటారో వాళ్ళను మాత్రమే పిలిచి మరీ ఛాన్స్ ఇస్తారని.. అలా ఎవరికైతే రాజమౌళి గారి నుంచి కాల్ వస్తుందో వాళ్ళకే ఆ పాత్ర రాసి పెట్టి ఉంటుంది” అని మొత్తానికి జక్కన్న గొప్పతనం గురించి చెప్పేసింది. ప్రస్తుతం తమన్నా గోపీచంద్ హీరోగా నటిస్తున్న “సీటీమార్” చిత్రంలో నటిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here