‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షోతో తెలుగు టీవీ యాంకరింగ్ కు గ్లామర్ తెచ్చిన అందాల తార అనసూయ. తన గ్లామర్ తో జబర్దస్త్ షో ని మరో లెవెల్ కి తీసుకువెళ్లారామె. ఇక అక్కడ నుంచి బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకువెళ్ళిపోతున్నారు అనసూయ. జబర్దస్త్ సక్సెస్ తర్వాత ఆమె సినిమాల వైపు కూడా వెండితెరపై కూడా తన నటనా కౌశల్యాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టారు. అయినా, బుల్లితెరను విడిచి పెట్టలేదు. అక్కడ ఫుల్ టైం చేస్తూ వెండితెర మీద అడపాదడపా మంచి పాత్రలతో మెరుస్తూ వస్తున్నారు. ఈమధ్య ఆమె నటించిన ‘రంగస్థలం’, ‘క్షణం’ చిత్రాలలోని పాత్రలకెంతో మంచి పేరు వచ్చింది.

ముఖ్యంగా మెగా హీరో రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటించిన ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్తగా ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు అనసూయ. అలాగే లేటెస్ట్ గా “కథనం” అనే చిత్రంలో లీడ్ రోల్ లో నటించారు. ఈ సినిమా కధ మొత్తం ఆమె చుట్టూనే నడుస్తుంది. సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా.. అనసూయ మాత్రం నటిగా వంద మెట్లెక్కినట్టయింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె టీవీల్లోనూ 3 షో లలో కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా అనసూయ ఈటీవీలో ప్రసారమౌతున్న ‘ఆలీతో సరదగా’ షోలో అతిథిగా పాల్గొన్నారు. ఈ షోలో భాగంగా అనసూయ భరద్వాజ్ తన సినిమా కెరీర్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు.

అప్పట్లో ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి సంబంధించిన వివాదంపై స్పందిస్తూ.. “పవర్ స్టార్ పవర్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా సరిక్రొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఇంత వరకు ఏ చిత్రం సాధించని రికార్డులను ‘అత్తారింటికి దారేది’ చిత్రం సొంతం చేసుకుంది. ఒకవైపు ఈ సినిమా భారీ కలెక్షన్ల వైపు దూసుకుపోతున్న టైంలో.. పవన్ కళ్యాణ్ పై బుల్లితెర హాట్ యాంకర్ సంచలనమైన కామెంట్స్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయకపోవడం నాకెంతో సంతోషంగా వుంది’ అంటూ షేర్ చేసి సంచలనం సృష్టించారు. అప్పటివరకు అనసూయ బుల్లితెరపై తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకుల కంటి మీద కునుకు లేకుండ చేయడంతో బుల్లితెర ప్రేక్షకులంతా ఒక్కసారిగా ఆమె ఫ్యాన్స్ గా మారిపోయారు. ఆ అభిమానం ఎక్కడి వరకు వెళ్లిందంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించేంతస్థాయి వరకు ఆమె ఎదిగిపోయింది. దాంతో అప్పట్లో సోషల్ మీడియాలో అనుసూయకు పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందనే రూమర్స్ షికార్లు చేశాయి.

అయితే అలాంటి రూమర్స్ పై అనసూయ కూడా స్పందించటం జరిగింది. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం అనసూయను అడగటం, ఆమె నో చెప్పటం జరిగింది. అంటే సినిమాల్లో ఐటమ్ క్యారెక్టర్ల చెయ్యను గానీ, హీరోయిన్ గా అయితేనే చేస్తానని అనసూయ చెప్పినట్లు అప్పట్లో రూమర్స్ పుట్టుకొచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం హాట్ యాంకర్ అనసూయ తాను ఈ సినిమాలో ఎందుకు నటించలేదో, ఆ కారణాలను వివరిస్తూ.. మనస్ఫూర్తిగా ‘అత్తారింటికి దారేది’ చిత్రం వివాదంపై క్లారిటీ ఇచ్చింది. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలోని ఐటమ్ సాంగ్ కోసం తనను సంప్రదించిన మాట వాస్తవమేనని… కానీ అప్పటికీ తను రెండోసారి 6 నెలలు గర్భవతినని. దీంతో పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రం సాంగ్ లో నటించే ఛాన్స్ మిస్సయ్యానని, ఆ తర్వాత ఆ చిత్రం రిలీజైన క్రొత్తలో ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ లో నటించలేక పోయినందుకు ఎంతో సంతోషంగా ఉందని కామెంట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురై ఎన్నో ఇబ్బందులు పడినట్లుగా ఈ సందర్భంగా అనసూయ తెలియజేసింది. ప్రస్తుతం అనసూయ బన్నీ- సుకుమార్ డైరెక్షన్ లో రాబోతున్న తాజా చిత్రంలో విలన్ గా నటిస్తోందని తాజా సమాచారం. ‘రంగస్థలం’ చిత్రంతో మంచి నటిగా అనసూయను ఒక రేంజిలో పరిచయం చేసిన సుకుమార్ ఇప్పుడు ఆమెను మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రంలో విలన్ గా వెండితెరపై చూపించబోతుండడం విశేషం.



























