స్నేహం ఓ అద్భుతమైన బంధం. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదేమో.! కన్నవారితో, కట్టుకున్నవారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం మిత్రత్వం గొప్పదనం. కష్టసుఖాల్లో అండగా ఉండేవారు.. నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన మిత్రులు. స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. సృష్టిలో నా అనేవారు, బంధువులు లేని వారైన ఉంటారేమే గాని స్నేహితులు లేని వారుండరు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అందరితో కలివిడిగా ఉంటూ తోటి హీరోలతో చాలా స్నేహంగా ఉంటాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సమ ఉజ్జీలు అయిన మహేష్ బాబు ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో చాలా స్నేహంగా ఉంటూ ఏమాత్రం జలసీ ఫీల్ లేకుండా చరణ్ వారితో కలిసి పోతూ ఉంటాడు. వారికి కూడా ఎలాంటి ఫీల్ లేకుండా చరణ్ తో కలిసి పోతారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చరణ్ లు కలిసి సినిమా చేస్తున్న విషయం కూడా తెల్సిందే. ఇక చరణ్ కు ఇండస్ట్రీలో మరో ఆప్త మిత్రుడు శర్వానంద్. హీరో కాకముందు నుండి కూడా చరణ్ శర్వాలు క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి తెగ ఎంజాయ్ చేసేవారు. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తాజాగా తన మిత్రుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో దిగిన ఫోటోలను తన ట్విట్టర్ లో షేర్ చేసారు. ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాల్లో బాగా వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్, శర్వానంద్ మంచి స్నేహితులు. ఇప్పుడు ఈ స్నేహం కాస్తా బంధుత్వంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని టాలీవుడ్ టాక్. శర్వానంద్ కి పెళ్లి కుదిరిందని, వధువు రామ్ చరణ్ భార్య ఉపాసన దగ్గరి బంధువేనని.. త్వరలోనే.. శర్వానంద్ నిశ్చితార్థం కూడా జరగబోతోందని రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. లీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో శర్వా ఒకడు. కరోనా లాక్ డౌన్ టైంలోనే టాలీవుడ్ హీరోల మనసు పెళ్లిళ్లపై మల్లి వరుసగా పెళ్లి భాజాలు మ్రోగుతున్నాయి. లేటెస్ట్ గా శర్వా కూడా పెళ్లికి రెడీ అయ్యాడని తెలుస్తోంది. గత కొంతకాలంగా శర్వా ఓ అమ్మాయిని ఇష్టపడుతున్నాడట. ఇప్పుడు ఇరు కుటుంబాలూ ఈ పెళ్లికి ఓకే అన్నారని తెలుస్తోంది.

ఉపాసన కూడా శర్వాకి మంచి ఫ్రెండే. ఇప్పుడు ఉపాసన కి వరుసకు చెల్లెలు అయిన అమ్మాయినే… శర్వా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. మరి ఈ రూమర్ నిజమో, కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. ఇక రామ్ చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా చిత్ర నిర్మాణం వాయిదా పడింది.



























