పెళ్ళి వేడుకలో రానా దగ్గుబాటి భార్య మిహికా వేసుకున్న డ్రెస్ ఖరీదెంతో తెలుసా.?!

0
427

టాలీవుడ్ భల్లాలదేవగా ఇంతకాలం పిలువబడిన రానా ఎట్టకేలకు ఓ ఇంటి వాడయ్యాడు. రానా ప్రేమించిన మిహికాతో జరిగిన పెళ్లి వేడుక రామా నాయుడు స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగింది. కోవిడ్ ఎఫెక్ట్ మూలంగా ఎక్కువమంది అతిధులనూ ఈ పెళ్లికి ఆహ్వానించలేదు రానా. ఈ విషయంలో సురేష్ బాబు కూడా చాలా బాధ పడుతున్నట్లు తెలియ జేసింది. కరోనా లాక్ డౌన్ పరిస్థితులు చక్కబడిన తర్వాత మరింత గ్రాండ్ గా అదిరిపోయే వేడుక చేయాలని చూస్తున్నారు దగ్గుబాటి కుటుంబ సభ్యులు. ఇదిలావుండగా రానాను వరించిన మిహికా బజాజ్ ఎవరు.? ఎక్కడ ఉంటారు.? ఏం చేస్తుంటారు.? అనే సందేహాలు రానా ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచసాగాయి. తన అభిమాన హీరోను పెళ్లి చేసుకున్న మిహికాపై ఆ మాత్రం క్యూరియాసిటీ లేకపోతే ఎలా.? ఇక రానా ఫ్యాన్స్ సందేహాలన్నిటినీ పటాపంచలు చేస్తూ.. తన ప్రేయసి మిహికాకు సంబంధించిన వివరాలను రానా గతంలోనే సోషల్ మీడియాలో తెలియ జేశాడు. ఆ వివరాలు ఇప్పుడు మీకోసం..

హైదరాబాద్‌కు చెందిన మిహిక ముంబైలోని రచనా సంసాద్‌ లో ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లొమా పూర్తి చేసింది. లండన్‌లోని చెల్సియా యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్ & డిజైన్‌‌ లో M.A పూర్తి చేసింది. ఆమె డ్యూ డ్రాప్ స్టూడియో అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని, Pixie Dust అనే ఓ బ్లాగ్ ను కూడా నడుపుతుంది. మిహిక తల్లి బంటీ బజాజ్ వివరాల్లోకి వెళ్తే.. జ్యువెలరీ డిజైనర్. Krsala అనే బ్రాండ్‌ ను స్థాపించారు. ఆమె జవహర్‌ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీలో చదువుకున్నారు. మిహికా సోదరుడు సమర్ధ్ తన తల్లికి సంబంధించిన జ్యువెలరీ ప్రొడక్షన్ చూసుకుంటూ వుంటాడు. అదండి సంగతి.. ఇక అసలు విషయానికి వస్తే.. లేటెస్ట్ గా రానాతో జరిగిన మిహికా పెళ్ళి వేడుకలో మిహికా వేసుకున్న డ్రెస్ ఖరీదెంత వుంటుందోనన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

పెళ్ళి వేడుకలో మిహికా ధరించిన డ్రెస్స్ ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేస్తుంది. పెళ్లిలో ఈమె వేసుకున్న డ్రెస్సే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చూడటానికి సాధారణ డ్రెస్ లాగే కనిపించినా కూడా ఇందులో చాలా ప్రత్యేకతలున్నాయని తెలిసింది. ఓ డిజైనర్ ఈ డ్రెస్ కోసం ఏకంగా 1000 గంటలు కష్టపడిందట. ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా ఆ లెహంగాను డిజైన్ చేసింది. బంగారపు రంగుతో పాటు క్రీమ్ కలర్ ను మిక్స్ చేస్తూ తయారు చేసిన ఆ డిజైనరీ డ్రెస్ కోసం 1000 గంటలు శ్రమించాల్సి వచ్చిందని స్వయంగా అనామికాయే తెలియజేయడం విశేషం. పై నుంచి కింద వరకు పూర్తిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. ఈ ఒక్క డ్రెస్ కోసం మిహీకా దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు రూమర్స్ కూడా వినబడుతున్నాయి. అందుకేనేమో.. సోషల్ మీడియాలో ఈ డ్రెస్ బాగా వైరలవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here