చెప్పాలని ఉంది సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా స్విట్జర్లాండ్ వెళ్ళిన వి.వి వినాయక్ ను ఎగ్జిక్యూట్ ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జి.. అక్కడే స్టూడెంట్ నెంబర్ వన్ షూటింగ్ లో ఉన్న జూనియర్ ఎన్.టి.ఆర్ తో పరిచయం చేయించాడు. ఆ పరిచయం లో నల్లమలుపు బుజ్జి వివరిస్తూ.. అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా కాలం వి.వి.వినాయక్ పని చేశారు. ఇప్పుడు ఒక సినిమాకి దర్శకత్వం చేద్దాం అనుకుంటున్నాడు. ఆ సినిమా కథ మీరు వింటారా అని జూనియర్ ఎన్టీఆర్ ని అడగగా అప్పుడు అతను హైదరాబాద్ వెళ్ళిన తరవాత ప్రశాంతంగా విందాం అని చెప్పడంతో ఇక ఎవరి షూటింగ్ కి వారు వెళ్ళిపోయారు.

జూనియర్ ఎన్టీఆర్ కు ఇష్టం లేకపోయినా కూడా నల్లమలుపు బుజ్జి ని రమ్మని ఫోన్ చేయడంతో వి.వి. వినాయక్ ని తీసుకుని ఎన్టీఆర్ ని కలవడానికి వెళ్లారు. అక్కడ వి.వి. వినాయక్ తాను రాసుకున్న ఓ అందమైన “శ్రీ” అనే ప్రేమ కథను చెప్పి.. ఇది నువ్వే కావాలి సినిమాని మించి హిట్టవుతుందని చెప్పడంతో బుజ్జి జోక్యం చేసుకొని నువ్వే కావాలి లాంటి సినిమా కాదు బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు లాంటి మాస్ కథ కావాలి అనడంతో తిరిగి వెళ్ళిన వి.వి.వినాయక్ దాదాపు 58 సీన్ లతో రాసుకున్న రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ కథ జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించాడు.

అందులో ముఖ్యంగా చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బాంబులు విసరడం, విలన్ ఇంటి ఆవరణలో సుమోలను గాలిలో పేల్చడం.. ఈ రెండు సీన్లు కూడా ఎన్టీఆర్ ని విపరీతంగా ఆకర్షించాయి.

మంచి కథ కుదరడంతో బెల్లంకొండ సురేష్ నిర్మాతగా కొడాలి నాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఆదికేశవ రెడ్డి పాత్రలో ఆది అనే సినిమా 2002 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూనూగు మీసాల నూత్న యవ్వనమున వెండితెరపై సముద్ర కెరటం లా దూసుకు వచ్చి నిశ్శబ్దం గా నలుదిక్కుల జూనియర్ ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారు.



























