తోబుట్టువుల అనుబంధానికి, ఆప్యాయతలకు కొలమానాలుండవు. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి.. అనే అనుబంధాలతో చిన్నప్పట్నుంచీ పెన వేసుకున్న బంధం జీవితాంతం ఉంటుంది.

అల్లరి చేసి అమ్మను విసిగించడం, నాన్నకు అమ్మ మీద చాడీలు చెప్పడం, కలిసి బడికి వెళ్లడం, ఆటలు, పండుగలు, సరదాలతో తెలియకుండానే జీవితంలో ఎదిగిపోతారు. సినిమాల్లో కూడా ఈ తరహా సన్నివేశాలు, భావోద్వేగ అంశాలు కలబోసుకున్న కథలెన్నో తెరకెక్కాయి. అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల బంధాన్ని తెలుగు సినిమాల్లో మన రచయితలు, దర్శకులు ఎంతో అందంగా చూపించారు. తెలుగు సినీ నటులు తమ తోబుట్టువులతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి – విజయ – మాధవి

మెగా చెల్లెళ్లకు తమ అన్నయ్య చిరంజీవి రక్ష ఎప్పుడూ ఉంటుందనే భరోసా. ప్రతీ రాఖీ 
పండుగకు మెగాస్టార్ చిరంజీవి చెల్లెళ్లు మాధవి, విజయ దుర్గ ఆయనకు రాఖీలు కడుతుంటారు. సంప్రదాయం ప్రకారం చిరంజీవి నుదుటిన తిలకం దిద్ది, హారతి ఇస్తారు. ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తనకు రాఖీలు కట్టిన ముద్దుల చెల్లెళ్లకు చిరంజీవి బహుమతులు ఇస్తుంటారు. అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని తెలియజేస్తూ ఈమధ్యనే ఒక వీడియో తీసిన చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను చూసిన మెగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

సుష్మిత – రామ్ చరణ్ – శ్రీజా

రామ్ చరణ్ సోదరి సుస్మితా కూడా నిర్మాణ రంగంలో తన లక్‌ ను పరీక్షించుకుంటోంది. ఈమె 
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఓల్డ్ స్టూడెంట్‌. సుస్మిత తాను ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుకున్న చదువు తన తండ్రి నటించిన సినిమాలకు బాగానే ఉపయోగపడేలా చేస్తుంది. ఇక రామ్ చరణ్ 2వ సోదరి శ్రీజ భవిష్యత్తు కోసం రామ్ చరణ్ తేజ త్యాగానికి సిద్ధపడ్డాడు. భర్త శిరీష్ భరద్వాజ్‌ తో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడిన శ్రీజకు అండగా నిలబడ్డాడు.

వరుణ్ తేజ్ – నిహారికా

వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురిగా నిహారిక దాదాపు అందరికీ సుపరిచితురాలే. ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌తో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక సినీ రంగంలో నిలదొక్కుకోలేక పోయింది. వరుసగా చేసిన 3 చిత్రాలు ప్రేక్షకులను 
మెప్పించలేకపోయాయి. అయినా సరేనంటూ తన సినిమా హిట్టు ఫ్లాఫులతో సంబంధం లేకుండా సినీ రంగంలోనే ఉండాలని నిర్ణయించుకుంది. అందుకోసం నటిగా కాస్త విరామం ఇచ్చి నిర్మాతగా అవతారమెత్తింది. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా కొన్ని షార్ట్‌ ఫిలింస్‌, వెబ్‌ సిరీస్‌లను నిర్మిస్తోంది.

ప్రిన్స్ మహేష్ బాబు – మంజుల

ఎంత సూపర్ స్టారైనా నాకు తమ్ముడే అంటుంది మంజుల ఘట్టమనేని. వీళ్ళిద్దరి మధ్య బంధం ఎప్పుడూ ఫైటింగ్ లతో ఫన్నీగా వుంటుంది. మంజుల ‘నాని’, ‘పోకిరి’ వంటి సినిమాలను కూడా నిర్మించింది. ఘట్టమనేని మంజుల అన్న రమేశ్ బాబు, తమ్ముడు మహేశ్ తో ఉన్న ఫొటోలను ఈమధ్యనే షేర్ చేశారు. ‘అనుబంధాలు, ఆప్యాయతలు, అల్లరి చేస్తూ మధ్య పెరిగాం..’ అంటూ జ్ఞాపకాలను పంచుకున్నారు. ప్రేమ, అనురాగాన్ని పంచుకోండి అంటూ గౌతమ్, సితార పిక్ ను మహేశ్ పోస్ట్ చేశారు.

టాలీవుడ్ కింగ్ నాగార్జున – నాగ సుశీల

టాలీవుడ్ కింగ్ నాగార్జున సోదరి నాగ సుశీలకు మాత్రం నాగ్ అందరికంటే చిన్నవాడు, గారాల తమ్ముడు, అల్లరి పిల్లాడు కాబట్టి చిన్నప్పటి నుంచి నాగార్జునను చినబాబు అని పిలుస్తుంటుంది. నాగ్ కి బ్యాక్ సపోర్ట్ గా అమె అన్నపూర్ణ స్టూడియోస్ మరియు ఇతర బిజినెస్ లో చాలా సపోర్టివ్ గా ఉంటారు సోదరి సుశీలా గారు.

హీరో సుమంత్ – సుప్రియ యర్లగడ్డ

సుప్రియ యార్లగడ్డ మరెవరో కాదు.. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర రావుకు మనవరాలు, నాగార్జున మేనకోడలు, హీరో సుమంత్‌ కు స్వయాన సోదరి. సుప్రియ- అడవి శేష్ వివాహానికి ఇరు కుటుంబాల అంగీకారం తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుమంత్, సుప్రియల సంబంధం గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. కానీ వీళ్ళిద్దరూ కల్సినప్పుడల్లా తమ సినిమాల గురించి, ఫ్యామిలీ రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటూ వుంటారు.

టాలీవుడ్ లెజెండ్ బాలకృష్ణ – పురందేశ్వరి – భువనేశ్వరి – లోకేశ్వరి

టాలీవుడ్ లెజండ్ బాలయ్య బాబుకి సోదరి భువనేశ్వరితో మంచి అనుబంధమే వుంది. అందుకే పెద్దమ్మాయి బ్రాహ్మణిని భువనేశ్వరి ఇంటికి కోడలిగా పంపించారు. మరో సోదరి పురందేశ్వరితో పొలిటికల్ గా విభేధాలున్నప్పటికీ వ్యక్తిగతంగా ఆమెంటే బాలకృష్ణకు చాలా గౌరవం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – కీర్తన

బయటివాళ్ళకు జూనియర్ ఎన్టీఆర్ సోదరి కీర్తన గురించి ఎక్కువగా తెలియకపోయినా వీళ్ళిద్దరి బంధం చాలా గొప్పది. చాలా సరదాగా వుంటారు.

నందమూరి కళ్యాణ్ రామ్ – సుహాసిని

వీళ్ళిద్దరూ కూడా తారక్ మరియు అతని సోదరి కీర్తనలాగే ఎక్కువగా బయట కనిపించారు. కానీ వీళ్ళిద్దరూ ప్రతీ చిన్న విషయాన్నీ షేర్ చేసుకుంటారు.

యంగ్ హీరో నితిన్ -నికితా రెడ్డి

నితిన్ ఆమధ్య వరుస ఫ్లాప్స్ లతో సతమతమౌతున్న టైంలో తమ సొంత బ్యానర్ లో ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే.. లాంటి హిట్ మూవీస్ ను ఇచ్చిన సోదరి నికితా రెడ్డి నితిన్ ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే వుంటుంది. ఇంతకన్నా సపోర్టివ్ సోదరి ఇంకెవరుంటారు చెప్పండి. ఈమధ్య నితిన్ కూడా తన సోదరితో రాఖీ కట్టించుకున్న ఫోటో నెట్టిట్లో వైరల్ గా మారింది. నితిన్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 5 రోజుల పాటు కొనసాగిన ఆ పెళ్లి వేడుకలో నితిన్ సోదరి నిఖితా రెడ్డి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తన తమ్ముడు అంటే నిఖితకు చాలా ఇష్టం. ఇక ఇప్పుడు రాఖీ పండగ సందర్భంగా ఇద్దరు కూడా ఇలా స్పెషల్ మూమెంట్ తో సోషల్ మీడియాలో నెటిజన్స్ ని ఎట్రాక్ట్ చేశారు.

నేచురల్ స్టార్ నాని – దీప్తి

నాని సోద‌రి దీప్తి గంటా U.S లో సెటిలైంది. ఈమధ్యనే ఇండియా వచ్చినపుడు నాని రిక్వెస్ట్ మేరకూ అన‌గ‌న‌గా ఒక నాన్న అనే పేరుతో ఆమె ఓ షార్ట్ ఫిల్మ్ తీశారు.

హీరో ముంచు విష్ణు-లక్ష్మి-మనోజ్

ఈమధ్య జరిగిన రక్షా బంధన్ వేడుకలలో మంచు విష్ణు అక్క లక్ష్మీ ప్రసన్నతో ఉన్న అనుబంధాన్ని చిన్నప్పటి ఫొటోతో గుర్తు చేసుకున్నాడు. ”మామూలుగానే లక్ష్మి మా నుంచి గిప్ట్ లు డిమాండ్ చేస్తుంది. ఇక రాఖీ పండుగకైతే చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ రాఖీ కట్టి రూ.3 లక్షలు డిమాండ్ వసూలు చేసింది. దాంతో ఆమె తనక్కాల్సినవి కొనుక్కుంది. ఒకవేళ మనోజ్ ఆ టైంలో వేరే ప్రాంతంలో ఉంటే, అతని కోటా కూడా నా నుంచే వసూలు చేస్తుంది. చిన్నప్పుడు భయపెట్టింది. ఇప్పటికీ భయపెడుతూనే ఉంది.’ అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చాడు. సినిమాలు, టాక్‌షోలు, విద్యాసంస్థలని ముగ్గురు కలిసి చూసుకుంటూ వుంటారు. సినిమాలు మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సపోర్టివ్ గా ఉంటారు ముగ్గురు.

హీరో ఆది – జ్యోతిర్మయి

డైలాగ్ కింగ్ సాయి కుమార్ కొడుకు హీరో ఆది తన అక్క జ్యోతిర్మయికి రాఖీ సందర్భంగా ఈసారి కారు ప్రజెంట్ చేయబోతున్నాడు. సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈసారి తన సోదరి దగ్గరకు బెంగళూరు వెళ్లలేక పోతున్నానని, అలాగే ఆమె కూడా కుటుంబంతోను, డాక్టర్ కావడంతో తన వృత్తిలోను బిజీగా ఉన్నందున కలవలేకపోయినట్లు తెలిపారు. ఐతే జ్యోతిర్మయి తనకు రాఖీ పంపిందని, ఈసారి ఆమెను కలిసినప్పుడు కారును గిప్ట్ గా ఇవ్వనున్నట్లు తెలియజేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here