Tollywood celebrities : పేదవాడైనా, ధనికుడైనా కష్టపడేది కుటుంబం కోసం. అందునా పిల్లల కోసం కష్టపడుతారు. వారి పిలల్లు వారి కన్నా మంచి స్థాయిలో ఉండాలని భావిస్తారు. అయితే అదే కన్న బిడ్డ వారి కళ్ళముందే జీవితాన్ని ముగిస్తే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. సామాన్యులనే కాదు సెలబ్రిటీలకూ కడుపుకోత మిగిల్చి వెళ్లిపోయిన వారి కన్న బిడ్డల వల్ల ఇప్పటికీ బాధపడుతున్నవారు ఉన్నారు.

ఎన్టీఆర్ నుండి కృష్ణ దాకా బిడ్డల్ని కోల్పోయిన వారు…
నందమూరి తారక రామారావు టాలీవుడ్ కి యుగ పురుషుడు. తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టిన ఆయనకు ఏడుగురు మగసంతానం. అందులో పెద్దవాడు రామ కృష్ణ చాలా చిన్న వయసులోనే మరణించారు. ఈ మరణం రామారావు గారిని బాగా కృంగదీసింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు రమేష్ బాబు కూడా ఈ మధ్యనే అనారోగ్యంతో మరణించారు. వృద్దాప్యంలో ఉన్న కృష్ణ, ఇందిర దంపతులకు రమేష్ బాబు మరణం తీరని లోటు. ఇక సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్ రావు అంటే తెలియని వారు ఉండరు. అటు విలన్ గా ఇటు కమెడియన్ గా, అటు సహాయం నటుడుగా చెరగని ముద్ర వేసిన కోటా గారి కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించారు.

చిన్న వయసులో ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకు మరణం కోటా శ్రీనివాస రావు ను బాగా కృంగ దీసింది. ఇక ఆయన సహచర నటుడు బాబు మోహన్ తనయుడు పవన్ కూడా అలానే రోడ్డు ప్రమాదంలో మరణించడం యాద్రుచికం. కానీ పవన్ మరణం బాబు మోహన్ ని డిప్రెషన్ లోకి నెట్టింది. ఇక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా చిన్నవయసులోనే తన కొడుకును కోల్పోయారు. ఇక డాన్స్ మాస్టర్, నటుడు, డైరెక్టర్ అయిన ఇండియన్ మైకేల్ జక్సన్ ప్రభుదేవా కూడా తన కొడుకును కోల్పోయారు. చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలను వల్ల ప్రభుదేవా కొడుకు మరణించాడు. రామారావు గారి తనయుడు హరికృష్ణ తన పెద్ద కుమారుడు జానకి రామ్ ను కూడా యాక్సిడెంట్ లో కోల్పోయారు. ఆ తరువాత కొంతకాలానికి హరికృష్ణ గారు కూడా ఆక్సిడెంటంలోనే మరణించారు.



























