తమ ఫ్యాన్స్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీరే..!!

0
437

ప్రేమ ఒక మధుర భావన.. అది ఎవరి మధ్య, ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో చెప్పలేని అద్భుతమైన స్పందన. ధనికా, పేదా భేధం లేకుండా కొందరి మధ్య  ప్రేమ పుడుతుంటుంది.

ఈ ప్రేమకి సినీ ప్రముఖులు కూడా అతీతులు కారు.. కానీ,. అలాంటి అరుదైన ప్రేమకథలు.. తమ ఫ్యాన్స్ నే పెళ్లి చేసుకున్న నటీ, నటుల గురించి ఇప్పుడు మీరు చదివి తెలుసుకుంటే ప్రేమలోని గమ్మత్తేమిటో చెప్పగలుగుతారు. మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ కాదు.. మేడిన్  మూవీ లాండ్ అని ఈతరం సినీ తారలను చూస్తే అర్ధం చేసుకోవచ్చు. సామాన్య జనాలకు, వీళ్లకు తేడా ఏమిటంటే.. వాళ్లు చూపులు కలిసిన తర్వాత పెళ్లి పీఠలెక్కుతారు. కానీ వీళ్లు మాత్రం మనసులు కలిసాకా పెళ్ళి చేసుకుంటున్నారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ జంటల జీవితానుభవాల పుటలను ఒక్కసారి తిరగేస్తే..

సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌, లతల ప్రేమకథ కొంత మందికి మాత్రమే తెలుసు.. 1980లో తలైవా ప్రముఖ కథానాయకుడిగా రాణిస్తున్న టైంలో లత ఎథిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్ధినిగా ఉన్నప్పుడు ఆయన్ను కలిశారు. అప్పుడు రజనీ ‘గోల్‌మాల్‌’ కు రీమేక్‌గా తీస్తున్న ‘తిల్లు ముల్లు’ సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు. సినీ జర్నలిస్ట్ లత.. రజనీని ఇంటర్వ్యూ చేయడానికి షూటింగ్ స్పాట్ కు వెళ్లారు. ఆ సందర్భంలో రజనీకాంత్ తన అభిరుచులు, అభిప్రాయాలను ఆమెతో పంచుకున్నారు. అనుకోకుండా ఇద్దరి ఆలోచనలు, ఇష్టాలు ఒక్కటయ్యాయి. ఇద్దరు ప్రేమలో పడ్డారు. జర్నలిస్ట్ లతను ఇష్టపడ్డ తర్వాత రజనీ ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. వారు సమ్మతించడంతో 26 ఫిబ్రవరి 1981న తిరుపతిలో ఇద్దరి పెళ్లి జరిగింది.

అలనాటి బాలీవుడ్ బ్యూటీ క్వీన్ డింపుల్ కపాడియా వయసు కేవలం 16 సంవత్సరాలున్న టైంలో ‘బాబీ’ చిత్రం విడుదల కాకముందు, డింపుల్ అప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాను అనుకోకుండా కలవడం జరిగింది. ఆమె అందానికి మంత్రముగ్దుడైన రాజేష్ ఖన్నా ఒక రోజు డింపుల్‌ ను సముద్ర తీరానికి తీసుకెళ్లి అకస్మాత్తుగా డింపుల్ ముందు పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చాడు. అప్పటికే ఆమె రాజేష్ ఖన్నాతో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉండడం చేత ఇంకేం ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకుంది. కానీ రాజేష్ ఖన్నా డింపుల్ కంటే 15 సంవత్సరాలు పెద్దవాడు అయినప్పటికీ అవేం పట్టిచుకోకుండా పెళ్లికి ఇద్దరూ సిద్దమైయ్యారు. ఇద్దరి పెళ్ళి ఆ సమయంలో సంచలనమైంది. పెళ్ళి తర్వాత, రాజేష్ ఖన్నా సినిమాలు చేయవద్దని డింపుల్ కి షరతులు విధించాడు, కాని డింపుల్ మాత్రం తన నటనని కొనసాగించాలనుకుంది. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలై డింపుల్ రాజేష్ ఖన్నాను విడిచి బయటికొచ్చేసింది. కొంత కాలానికి రాజేశ్ కన్నా సినిమాల నుండి రిటైరై పోయారు. డింపుల్ కు ఒక కూతురు పుట్టింది. ఆ అమ్మాయే నేటి బాలీవుడ్ హీరోయిన్ ట్వింకిల్ కన్నా. బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ భార్య.

బాలీవుడ్ స్టార్స్ హేమామాలిని, ధర్మేంద్రల కుమార్తె ఇషా డియోల్ పెళ్ళి ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. తన ప్రియుడు, వ్యాపార వేత్త భరత్ తక్తానీని ఇషా పెళ్లాడింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. వీళ్ళిద్దరి పెళ్ళికి ముందే ఈషా డియోల్ కి భరత్ పెద్ద ఫ్యాన్..

తమిళ స్టార్ హీరో విజయ్ ని ఒక సినిమా షూటింగ్లో కలిసింది సంగీత. విజయ్ అన్నా, అతని యాక్టింగ్ అన్నా పిచ్చి వ్యామోహం.. చచ్చేంత అభిమానం అని సంగీత విజయ్ ని కలిసిన సందర్భంగా ఉద్వేగంగా చెప్పడంతో, విజయ్ తన ఆటోగ్రాఫ్ తో పాటు ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. అంతే.. ఆ పరిచయం కాస్త ఆ తర్వాత ఫోన్ కాల్స్, ఛాటింగ్స్ వరకు వెళ్లింది. తర్వాత ఇంకేముంది.. సంగీతని తన ఇంటికి ఇన్వైట్ చేసి, ఇంట్లో వాళ్లకి పరిచయం చేశాడు విజయ్. పెద్దల అంగీకారంతో ఇద్దరు ఒక్కటయ్యారు.

సఖి, యువ , అమృత ఇలా ఎన్నో చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన నటుడు మాధవన్. తన భార్య సరితా బిజ్రేని మొట్ట మొదటిసారిగా కమ్యునికేషన్ స్కిల్స్ క్లాస్ లో కలుసుకున్నారు. నటుడు కాకముందు మాధవన్ కమ్యునికేషన్ స్కిల్స్క్ కు సంబంధించిన క్లాసెస్ ను చెప్పేవాడు. అక్కడ స్టూడెంట్ గా ఉన్న సరితా బిజ్రేకి మాధవన్ క్లాస్ అంటే ఒక ప్రత్యేక ఆసక్తిని కనపర్చేది. మాధవన్ టీచింగ్ స్కిల్స్ పట్ల ఎట్రాక్ట్ అయిన సరితా.. ఆ తర్వాత మాధవన్ తో ప్రేమలో పడింది. మాధవన్ కూడా సరితా ను ఇష్టపడటంతో ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here