నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్టులు… అందాలతో ఊరిస్తున్న బిగ్ బ్యూటీస్ !!

0
486

మనం కొద్ది రోజుల క్రితం చైల్డ్ ఆర్టిస్ట్ గా చూసిన కొందరు అబ్బాయిలు అమ్మాయిలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఇక వారు ఎవరో ఒకసారి చూద్దామా…

ఇప్పుడు మొదటిగా చెప్పుకునేది శ్రీయ శర్మ..

ఈ అమ్మాయి 1997 సంవత్సరంలో జన్మించింది. అయితే ఈవిడ 2005 సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీలోని జై చిరంజీవ సినిమాలో బాలనటిగా నటించింది. మొత్తానికి ఈవిడ 15 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.అంతే కాదు ఆ తర్వాత 2014వ సంవత్సరంలో ఈ అమ్మాయి గాయకుడు అనే సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

ఇక మరో అమ్మాయి శ్రావ్య. 2002 సంవత్సరం వచ్చిన సందడే సందడి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ అమ్మాయి, 2004 సంవత్సరంలో వచ్చిన ఆర్య సినిమా లో కూడా బాలనటిగా నటించింది. ఇక ఆ తర్వాత 2014వ సంవత్సరంలో వచ్చిన ” లవ్ యూ బంగారం” సినిమా ద్వారా హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటి వరకు ఈ అమ్మాయి హీరోయిన్ గా ఏడు సినిమాల్లో నటించింది.

అలాగే మరో చైల్డ్ ఆర్టిస్ట్ నటి శ్రీదివ్య. ఈవిడ కేవలం మూడు సంవత్సరాలు ఉన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలో నటించడం జరిగింది. 2010 సంవత్సరం నుంచి ఇప్పటివరకు పది సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ లిస్టులో మరో చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని. బాల రామాయణం సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినిమా కెరీర్ ని మొదలు పెట్టారు. అయితే 2004 సంవత్సరం వరకు 15 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఈవిడ. ఇక 2007 సంవత్సరం నుంచి సవాల్ సినిమా ద్వారా హీరోయిన్ గా మారిపోయింది.

ఇక 2001 సినిమాలో విడుదలైన డాడీ సినిమాలో నటించిన అనుష్క మల్హోత్రా. ప్రస్తుతం బాలీవుడ్లో ఒక మోడల్ గా పనిచేస్తోంది. కాకపోతే ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీ కొట్టడానికి సరైన సమయం కోసం వేచి చూస్తోంది.

ఇక ఇదే లిస్ట్ లో దేవుళ్ళు సినిమాలో నటించిన అమ్మాయి నిత్య శెట్టి. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తూనే మరోవైపు హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తోంది. అయితే 2016 సంవత్సరంలో ఒక్క సినిమా కూడా చేసేసింది ఈవిడ. తమిళ, తెలుగు సినిమాల్లో కలిసి ఈవిడ ఏకంగా ఆరు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఇప్పటి వరకు.

మనం చిన్నప్పుడు చూసిన అమ్మోరు సినిమాలో దేవత గా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా…? ప్రస్తుతం ఫ్రాచువేటెడ్ ఉమెన్ గా పేరుపొందిన నటి దీప్తి సునైనా నే. అయితే ఆవిడకు అప్పట్లో తర్వాత పెద్దగా అవకాశం రాకపోవడంతో కేవలం డబ్బింగ్ ఆర్టిస్ట్, కొన్ని సైడ్ ఆర్టిస్ట్గానే పని చేయడం జరిగింది. ప్రస్తుతం ఈవిడ అమెరికాలో తన వివాహ జీవితాన్ని గడుపుతూ కొత్త గా వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

ఈ లిస్టులో మరో హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. 2002 నుంచి 2006 సంవత్సరం వరకు బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగింది. ఇక 2008 సంవత్సరం లో కొత్త బంగారు లోకం సినిమా ద్వారా హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటివరకు ఈవిడ అనేక భాషల్లో 13 సినిమాల్లో హీరోయిన్గా నటించింది.

ఇక మరో చైల్డ్ ఆర్టిస్ట్ దివ్య నగేష్. ఇక ఈ అమ్మాయి 2009 సంవత్సరంలో వచ్చిన అరుంధతి సినిమాలో అరుంధతి చిన్ననాటి క్యారెక్టర్ చేసి అందరినీ మెప్పించింది. ఇక ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తరవాత నేను నాన్న… అనే ఒక తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక అలాగే కన్నడ, మలయాళ చిత్రాల్లో నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

ఇక మరో చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ షామిలి. ఈవిడకి ప్రస్తుతం 32 సంవత్సరాలు. ఈవిడ అతి చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా కేవలం రెండు సంవత్సరాల వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టింది.ఇక ఆ తర్వాత కేవలం తెలుగులో ఐదు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించారు. అయితే ఈవిడ బాలనటిగా ఉన్నప్పుడు ఏకంగా 45 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here