1979 మే 25న తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జన్మించిన అమ్మ రాజశేఖర్ కొరియోగ్రాఫర్‌గా తన కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత దర్శకుడిగా మారారు. గోపిచంద్ ‘రణం’, రవితేజ ‘ఖతర్నాక్’, నితిన్’ టక్కరి’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆన్‌స్క్రీన్ మీదే కాకుండా ఒకసారి డ్రంక్ & డ్రైవ్ కేసులో పట్టుబడి, మరోసారి జిమ్ ట్రైనర్ పై చేయి చేసుకుని ఈవిధంగా ఒకటి, రెండు వివాదాలతో ఆఫ్ స్క్రీన్ మీద కూడా పాపులరయ్యారు.

ఇక 16 ఏళ్లుగా సినిమా రంగంలో ఉన్నా సరే అమ్మ రాజశేఖర్ వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదంటే ఆశ్చర్యం కలుగకమానదు. కనీసం ఆయన భార్య, పిల్లలకు సంబంధించిన వివరాలు కూడా ఎవరికీ పెద్దగా తెలియకపోవడంతో సోషల్ మీడియాలో ఈమధ్య అమ్మ రాజశేఖర్ కు సంబంధించిన వివరాల కోసం నెటిజన్లందరూ సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళ కోసమే అమ్మ రాజశేఖర్ కు సంబంధించిన కొన్ని వ్యక్తిగత వివరాలు..

అమ్మ రాజశేఖర్ భార్య పేరు జీవిత. ఆమె ఒక ప్రముఖ మోడల్. ఈ జంటకు ఒక పాప, బాబు కూడా ఉన్నారు. కోలీవుడ్ లో అమ్మ రాజశేఖర్ చాలా సినిమాలకు కొరియోగ్రఫీ చేసి మంచి పేరును సంపాదించుకున్నారు. టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా చాలా సినిమాలకు అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. అంతేకాకుండా కొన్ని రియాలిటీ షోలకు ఈయన జడ్జిగా వ్యవహరించారు. లేటెస్టుగా తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 4 లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మ రాజశేఖర్ కొద్దిరోజులుగా తనకు హిట్లు లేవని అందుకే కొంత గ్యాప్ వచ్చిందన్నారు. ఈ లోటును భర్తీ చెయ్యడానికే బిగ్‌బాస్ షోకు వచ్చానని, ఈ షో ద్వారా మళ్లీ నెంబర్ 1గా నిలవాలనుకుంటున్నానని చెప్పారు.

గత సీజన్‌లో తన శిష్యుడు బాబా భాస్కర్ వచ్చారని, ఇప్పుడు తాను రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసారు. అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి వస్తూనే ఈ సాంగ్ నాగార్జునకు డెడికేట్ చేస్తున్నా అంటూ “కింగ్” చిత్రంలోని ఓ పాటకు స్టెప్పులేశాడు. మరి ఇతని ప్రయాణం బిగ్‌బాస్ హౌస్‌లో ఎలా కొనసాగుతుందో.. బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుని టైటిల్ రేసులో నిలుస్తారేమో చూడాలి.



























