భీమవరంలో ఓ కుర్రాడు చిరంజీవి సినిమా పడింది అంటే చాలు ఉదయం పళ్ళు తోముకుంటు పక్కనే ఉన్న సినిమా థియేటర్ లో టికెట్ తీసుకొని తిరిగి ఇంటికి వచ్చి కాలకృత్యములు తీర్చుకొని మళ్లీ తన అభిమాన నటుడు చిరంజీవి సినిమా మొదటి షో చూసేవాడు. అలా ఆ సినిమా థియేటర్ లో ఆడినన్ని రోజులు చూస్తూనే ఉండేవాడు.

‌‌ చిరంజీవి సినిమాలు చూడడమే కాదు ఆయన పాటలకు బయట డాన్సులు చేస్తూండేవాడు. ఈ కుర్రాడు బళ్లో కంటే థియేటర్లోనే ఎక్కువ రోజులు గడిపేవాడు అంటే అతిశయోక్తి కాదు. ఈ కుర్రాడి అమ్మగారు అబ్బాయి స్కూలుకు వెళ్లక సినిమాలకు వెళుతున్నాడని తెలియడంతో నచ్చచెప్పడానికి ప్రయత్నించేది. ఈ అబ్బాయి ఏమైపోతాడో అనే దిగులు తప్ప ఒక్కోసారి కూడా అబ్బాయిని మందలించిన దాఖలాలు లేవు.

1994 ప్రాంతంలో సినిమాల పైన ఉన్న అభిమానంతో భీమవరం నుండి హైదరాబాదుకు ఈ కుర్రాడు చేరుకున్నాడు.ఎన్నో ఇబ్బందులను అధిగమించి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, స్వయంవరం సినిమాలలో మొట్టమొదటగా నటించడం జరిగింది. ఆ తర్వాత మనసంతా నువ్వే,నువ్వు నేను, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, చిరునవ్వుతో వంటి సినిమాలలో కమెడియన్ గా నటిస్తూండగ..
2006 సంవత్సరంలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా అందాల రాముడు సినిమాతో సునీల్ హీరోగా కొత్త గా ఎంట్రీ ఇచ్చాడు. మర్యాద రామన్న, కె.ఎస్.డి అప్పలరాజు, పూలరంగడు, తడాఖా, మిస్టర్ పెళ్ళికొడుకు, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, జక్కన్న మొదలగు సినిమాలు.. సగం హిట్లు సగం ఫ్లాపులు అన్నట్టుగా హీరోగా సునీల్ కెరీర్ సాగింది. ఆ తర్వాత హీరోగా కొత్త అవకాశాలు రాలేదు.

ఈ తరుణంలో సునీల్ సినీ కెరీర్ డౌన్ ఫాల్ కావడానికి.. కారణాలు 1. స్టార్ డమ్ అనే చట్రంలో ఇరుక్కుపోవడం 2. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయకపోవడం 3. హీరో పాత్రలు చేస్తూనే సమాంతరంగా కామెడీ పాత్రలు వేయకపోవడం లాంటి ప్రతికూల అంశాలను సునీల్ తన స్నేహితుడు త్రివిక్రమ్ సపోర్టు ఉన్న కూడా అధిగమించలేక పోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here