నెల్లూరు నుండి వచ్చిన ధనుంజయ రెడ్డి తిరుపతి రెడ్డిలు కోదండరామిరెడ్డి తో కలిసి ఖైదీ సినిమా నిర్మించారు.

ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. కలెక్షన్ల కాసుల వర్షంతో నిర్మాతల జేబుల నిండి పోయాయి. అదే దూకుడు మీద ఉన్న నిర్మాతలు మరో బ్లాక్ బస్టర్ సినిమా చిరంజీవితో నిర్మించాలని చూశారు. ఆ క్రమంలో ….

1) వేట: 1986 లో ఖైదీ నిర్మాతల కోరిక మేరకు చిరంజీవి, పరుచూరి బ్రదర్స్ , కోదండరామిరెడ్డి కలిసి స్టొరీ డిస్కషన్ లో పాల్గొన్నారు. పరుచూరి బ్రదర్స్ చెప్పిన కథ బాగున్నప్పటికీ కథలో చివరికి హీరోయిన్ విలన్ ని పెళ్లి చేసుకుని కొడుకుని కన్నా కూడా హీరో హీరోయిన్ వెంబడి తిరగడం లాంటివి కోదండరామ్ రెడ్డికి నచ్చలేదు. అయినా నిర్మాతలు పట్టుపట్టడంతో కోదండరామిరెడ్డి వేట చిత్రం ఎలాగో అలాగా పూర్తి చేశారు. సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

2) తిరగబడ్డ తెలుగు బిడ్డ; 1988 లో పెద్దాయన ఎన్టీఆర్ ఇంటి నుండి పిలుపు రావడంతో కోదండరామిరెడ్డి పరుచూరి బ్రదర్స్ ఉదయం 4.30 నిమిషాలకు అన్నగారి దగ్గరికి వెళ్లారు‌. అక్కడ పరుచూరి బ్రదర్స్ చెప్పిన స్టోరీ కోదండరామిరెడ్డి కి నచ్చలేదని ఎన్టీఆర్ ముందే చెప్పేశారు. మీకు మాత్రం నచ్చనప్పుడు ఏం చేస్తాం బ్రదర్.. తరువాత కలుద్దామని పెద్దాయన అనడంతో అక్కడి నుండి పరుచూరి బ్రదర్స్ కోదండరామిరెడ్డి వెళ్ళిపోయారు. కట్ చేస్తే……

ఎక్కడో సినిమా షూటింగ్ లో పాల్గొన్న కోదండరామ్ రెడ్డి కి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు నుండి ఫోన్ రావడం జరిగింది. ఏం బ్రదర్ ఆ రోజు మనం విన్న కథ నాకు ఎందుకో బాగా నచ్చింది. దానిని మనం కలిసి చేద్దాం అనడంతో కోదండరామిరెడ్డికి ఏం చేయాలో అర్థం కాలేదు. పెద్దాయన చెప్పడంతో చేసేది ఏమీ లేక బాలకృష్ణ హీరోగా తిరగబడ్డ తెలుగు బిడ్డ సినిమాని కోదండరామిరెడ్డి పూర్తి చేశారు. సినిమా విడుదలైన తర్వాత చూస్తే బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది…. కథ చెప్పినప్పుడే విజువలైజేషన్ చేసుకునే కోదండరామి రెడ్డికి ప్రేక్షకుడి నాడి ఏమిటో ముందే తెలిసిపోతుంది అనడంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here