తరుణ్ భాస్కర్… పెళ్లి చూపుల సినిమాతో ఒక్కసారిగా యూత్ ని బాగానే ఆకట్టుకున్నాడు ఈ దర్శకుడు. అయితే చేసినవి కేవలం రెండు సినిమాలే అయినా తరుణ్ భాస్కర్ కు మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. అయితే తరుణ్ భాస్కర్ మాత్రం తనకు స్టార్ హీరోలకు పడదని.. తెలుగు సినిమాలో అద్దం పద్దం లేని సినిమాలు తీస్తున్నారంటూ ఇదివరకే చాలా సార్లు నిర్మొహమాటంగానే బయటకు చెప్పేవాడు.

ఈ నేపథ్యంలో తరుణ్ భాస్కర్ మరోసారి అటువంటి సంచలన వ్యాఖ్యలు చేసాడు. తన వ్యాఖ్యలతో ఒక్కసారిగా స్టార్ హీరోల అభిమానులకు విలన్ అయిపోయాడు. అసలు విషయానికి వస్తే… ఈ మధ్యే ‘కప్పేలా’ అనే మలయాళ సినిమా చూసిన తరుణ్ భాస్కర్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.. అంతటితో ఆగకుండా “ఈ చిత్రంలో అరవడాలు లేవు.. తొడ గొట్టడాలు లేవు.. మాస్ అప్పీల్ లేదు.. అనవసరపు హంగామా సన్నివేశాలు లేవు..” అంటూ కాస్త గట్టిగానే రాసుకొచ్చాడు. ఇప్పుడు దీనిపై కొందరు స్టార్ హీరోల అభిమానులు సీరియస్ అవుతున్నారు.. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు తరుణ్ భాస్కర్‌ పై ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు. మిగతా వారు కేసుల గట్టిగానే ఏసుకుంటున్నారు.

దీనితో ఈ విషయంపై తరుణ్ భాస్కర్ పోలీసు లకు పిర్యాదు చేసాడు. సోషల్ మీడియాలో తనను తిడుతున్న వాళ్లకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించాడు. తనను కావాలనే కొందరు హీరోల అభిమానులు వేధిస్తున్నారని.. వాళ్ల ఫోన్ నెంబర్స్‌, ఐడీలు సైబర్ క్రైమ్ పోలీసులకి అందించాడు. గచ్చిబౌలి పోలీసులు తన ఫిర్యాదుని స్వీకరించినట్టు తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియాలో తెలిపాడు కూడా. ప్రస్తుతం ఈ పోస్ట్ బాగానే వైరల్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here