సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు షేర్ చేసే కొన్ని ఫొటోలు చాలా విచిత్రంగా, అందరినీ ఆకర్షించేలా వుంటాయి. తాజాగా ప్రముఖ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో ఆయన కుమారుడు ఆది పినిశెట్టి తన తండ్రికి సంబంధించిన కొన్ని ఫొటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

అయితే ఆది ట్వీట్ చేసిన అన్ని ఫోటోలలో ఒక ఫొటో మాత్రం ఫ్యాన్స్ ను, నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది. ఇంతకీ ఈ ఫోటో ఇంతిలాగ వైరల్ కావడానికి కారణమేమిటంటే.. ఈ ఫొటోలో రవిరాజా తనదైన శైలిలో మాస్ లుక్స్ తో ఇంపోటెడ్ కాస్ట్‌లీ స్కాచ్ విస్కీ బాటిల్స్ ను తన 2 చేతులతో పట్టుకుని రవిరాజా కెమెరాకు ఓ ఫోజిచ్చారు. ఈ ఫోటోలో ఆయన మొహం అమితానందంతో వెలిగి పోతోంది. ఆయన ప్రక్కనే వున్న ఆది తల్లి రాధా రాణి మాత్రం ‘ఇదెక్కడ గోలరా బాబూ.?’ అనుకుంటూ తల పట్టుకున్నారు. లేటెస్ట్ గా షేరైన ఈ ఫొటోకి ట్విట్టర్ లో మంచి మంచి కామెంట్లే వస్తున్నాయి. టాలీవుడ్ లో ఒకప్పడు దుమ్ము దులిపిన టాప్ డైరెక్టర్లలో రవిరాజా పినిశెట్టి ఒకరు. రీమేక్ స్పెషలిస్ట్‌గా ఈయనకు మంచి పేరుంది. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సూపర్ హిట్ అయిన చిత్రాలను తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు పినిశెట్టి.

మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ లెజెండ్ బాలకృష్ణ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాజశేఖర్, విక్టరీ వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ‘యముడికి మొగుడు’, ‘పెదరాయుడు’, ‘బంగారు బుల్లోడు’, ‘చంటి’, ‘బలరామకృష్ణులు’, ‘మా అన్నయ్య’ వంటి గోల్డెన్ హిట్స్ రవిరాజా పినిశెట్టి సక్సెస్ ఖాతాలో భద్రంగా ఉన్నాయి. ఇప్పటివరకూ 40కి పైగా సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సినిమాలకు స్వస్తి చెప్పి విశ్రాంతి తీసుకుంటున్నారు. జూలై 14న రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు కావడంతో తన తండ్రి పుట్టినరోజు వేడుకను హీరో ఆది పినిశెట్టి తనింట్లోనే నిర్వహించారు. కుటుంబ సభ్యుల మధ్య రవిరాజా కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకను జరుపుకున్నారు.
Old enough to know better,
— Aadhi's (@AadhiOfficial) July 14, 2020
Young enough to still do it! #HappyBirthday Daddy….we love you every step of the way ❤️ pic.twitter.com/RSJWVOVykJ



























