డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని సినీ పరిశ్రమలో చెప్పడం మనం చూస్తూ ఉంటాం. కానీ నిజంగా రాజశేఖర్ డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాడు. చెన్నైలో ఎంబీబీఎస్ పూర్తి చేసి తరువాత సినిమా హీరో అయ్యాడు. రెండు తమిళ సినిమాలో నటించగానే తెలుగులో అవకాశాలు రావడం జరిగింది. ఆ క్రమంలో మొదటగా ఆయన 1985 లో వందేమాతరం అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత ప్రతిఘటన, ఆహుతి, తలంబ్రాలు, రేపటి పౌరులు, శృతిలయలు, ఆరాధన, అంకుశం, అల్లరి ప్రియుడు, ఆవేశం, ఆయుధం, ఎవడైతే నాకేంటి, గరుడవేగ లాంటి చిత్రాల్లో నటించి తెలుగు సినీ అభిమానుల మనసును దోచుకున్నారు. ఆయనతో నటించిన జీవితను పెళ్లి చేసుకుని శివానీ శివాత్మిక లకు జన్మనిచ్చారు.

అయితే రాజశేఖర్ తమ్ముడు సెల్వ కూడా 1991నుండి తమిళ సినిమాలలో నటించడం జరిగింది. ఈయన దర్శకుడు, కథా రచయితగా కూడా కొన్ని సినిమాలకు పని చేశారు. 1994 లో సుబ్బిరామిరెడ్డి నిర్మాణ సారథ్యంలో బి.గోపాల్ దర్శకత్వం వహించిన గ్యాంగ్ మాస్టర్ సినిమాలో రాజశేఖర్, నగ్మా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇందులో రాజశేఖర్ తమ్ముడు సెల్వ నటించడం జరిగింది. గ్యాంగ్ మాస్టర్ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత 1998లో విడుదలైన గోల్మాల్ హిందీ చిత్రాన్ని తమిళంలో నిర్మించడం జరిగింది ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది.
1999లో బాలా దర్శకత్వంలో సేతు సినిమా ప్రారంభమైంది దానిలో హీరో గా ఎంపికైన సెల్వ అనివార్య కారణాల వలన తప్పుకోగా విక్రమ్ హీరోగా నటించడం జరిగింది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో విక్రమ్ కు మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత తమిళ సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తూ తన అన్న రాజశేఖర్ చిత్రాలకు కథా, మాటల రచయితగా 12 సంవత్సరాల పాటు పని చేయడం జరిగింది. తర్వాత 2011లో ఓ తమిళ దర్శకుడి కోరిక మేరకు యుద్ధంసై అనే తమిళ చిత్రంలో తిరిగి నటించడం జరిగింది.అలా తమిళ చిత్రాల్లో నటిస్తూ సెల్వ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.



























