కలియుగ పాండవులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్.. ఆ తర్వాత వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. ఆయన నటనతో ఫ్యామిలీ హీరోగా రాణిస్తూనే.. మరోవైపు మాస్ హీరోగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆయన నటనకు మెచ్చిన అభిమానులందరూ వెంకటేష్ కి విక్టరీ పేరుతో సంబోదించుకుంటారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నటిస్తున్న దృశ్యం సీక్వెల్ దృశ్యం -2, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో F3 సినిమాలో నటిస్తున్నారు.

ఇక విక్టరీ వెంకటేష్ కుటుంబం సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ రంగంతో ఈ కుటుంబానికి దశాబ్ధాల చరిత్ర ఉంది. ఆయన తండ్రి దగ్గుబాటి రామానాయుడు ప్రముఖ సినీ నిర్మాత. ఆయన ఎన్నో చిత్రాలను తెరక్కించి అనేక అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఇక వెంకటేష్ అన్న సురేష్ బాబు కూడా తండ్రి బాటలోనే తెరవెనకాల స్టార్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా ఓ రేంజ్ సక్సెస్ అందుకున్నారు.

ఇక విక్టరీ వెంకటేష్ ఆస్తుల గురించి ఒక లుక్కేసేద్దాం.. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చే కోట్లాది రూపాయిలతో పాటుగా కొన్ని స్థిరచరాస్తులు ఉన్నాయి. వాటితో పాటూ వెంకటేష్ కూడా సినిమాల్లో హీరోగా అగ్రస్థానంలో ఉండటంతో భారీగానే వెనకేశాడు. అంతే కాకుండా పలు వ్యాపారాలు చేస్తున్న అయన ఆస్తుల విలువ సుమారు రెండు వేల కోట్ల పైమాటేనట. మరోవైపు తన తండ్రి రామానాయుడు సంపాదనతో చెన్నై, హైదరాబాదులో అనేక ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ కోట్లలోనే ఉంటుందని అంచనా.. అయితే ఈ ఆస్తులను అన్నదమ్ములు సురేష్ బాబు, వెంకటేష్ ఇంకా పంచుకోలేదని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here