మెగా హీరో రామ్ చరణ్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..??

0
151

టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది.. ఇక ఇదిలా ఉంటె ఇండ్రస్టీ లో అందరితో మంచి సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేసే రామ్ చరణ్ మొదటి క్రష్ ఎవరనేది ఇప్పుడు బయటికి వచ్చింది. ఆమె ఎవరో కాదు అతిలోకసుందరిగా పేరు సంపాదించిన శ్రీదేవి.

శ్రీదేవి అంటే రామ్ చరణ్ కి ఎంతో అభిమానం అని తెలిసింది. అయితే రాంచరణ్ తో పాటు మరో నటుడైన జూనియర్ ఎన్‌టిఆర్ కి కూడా శ్రీదేవి అంటే ఎంతో అభిమానం అని ఆమె చూస్తే అన్నీ మర్చిపోతారని తెలిసివచ్చింది. స్నేహితులైన వీరిద్దరు ఒకే హీరోయిన్ అయినా శ్రీదేవిని అభిమానించడం విశేషం. ఇక వీరిద్దరు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఇదే సంవత్సరంలో విడుదల కావలసిన సినిమా కరోనా కారణంగా కొంచం వాయిదా పడేలా కనిపిస్తుంది.

ఇక మిగతా నటుల యొక్క ఫస్ట్ క్రష్ ఎవరో చూస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఐశ్వర్య రాయ్ ఫస్ట్ క్రష్ కాగా, మరో నటుడు ప్రభాస్ కు తాను చిన్నపుడు చదివిన స్కూల్ టీచర్ ఫస్ట్ క్రష్ అని తెలుస్తుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక హాలీవుడ్ నటి తన ఫస్ట్ క్రష్ అని చెప్పుకొచ్చారు. అలాగే టాలీవుడ్ కి చెందిన కొందరు హీరోయిన్స్ తమ ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పడం జరిగింది.

మొదటిగా చూస్తే పూజ హెగ్డే ఈమె తన ఫస్ట్ క్రష్ హృతిక్ రోషన్ అని తెలుపగా, మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రణ్ వీర్ సింగ్ తన మొదటి క్రష్ అని తెలిపింది. అలాగే మరో నటి ప్రణీత కూడా తన స్కూల్ లో చదివిన అబ్బాయే తన మొదటి క్రష్ అని ఒక సందర్భం లో చెప్పుకొచ్చింది..ఇక ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న చెర్రీ.. నెక్స్ట్ శంకర్ డైరెక్షన్ లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here