Tollywood heroien pranitha subhash reveals about her pregnency : ప్రణీత సుభాష్ తెలుగు సినిమాకు పరిచయం అక్కర్లేని పేరు. బావ సినిమాతో పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ అత్తారింటికి దారేది సినిమాతో బాగా ఫేమస్ అయింది. అందులో బాపూగారి బొమ్మ సాంగ్ తో బాగా పాపులర్.ఇక ఎన్టీఆర్ రభస లో కూడా నటించింది. ఇక ఈ కన్నడ కస్తూరి కన్నడ తో మొదలుపెట్టి, తెలుగు, తమిళంలో కూడా మంచి సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. రామ్ తో హలో గురు ప్రేమకోసమే లో నటించినా ఈ చిన్నది సూపర్ స్టార్ మహేష్ సరసన బ్రహ్మోత్సవం లో కూడా నటించింది. ఇక తమిళ లో సూర్య వాళ్ళ తమ్ముడు కార్తీ తో నటించి పేరు తెచ్చుకుంది.

వ్యాపారవేత్త తో పెళ్లి…..
ఇక అవకాశాలు సన్నగిల్లడంతో 2021 సంవత్సరం బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజు ను పెళ్లిచేసుకుంది.ఆ తర్వాత సోషల్ మీడియాలో అభిమానులకు బాగా అందుబాటులో ఉంటోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ జీవితంలో ఏం జరిగినా కూడా సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకుంటుంటారు. ప్రణీత కూడా తన జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది.
తాను తల్లి కాబోతున్న విషయాన్నీ ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక తన భర్త పుట్టినరోజున ఈ విషయం అందరికి తెలియజేయడం సంతోషంగా ఉందని చెప్పింది.హెచ్‌సీజీ హోమ్ టెస్టింగ్ రిజల్ట్ తోపాటు, స్కానింగ్ కాపీని కూడా చూపిస్తూ తన భర్తను హత్తుకుని ఉన్న ఫొటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి.. తన భర్త పుట్టినరోజు నాడే ఈ విషయం తనకు ఈ శుభవార్త చెప్పడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఆమె పోస్ట్ చేసింది.ఇక ప్రణీత చివరగా హిందీ భుజ్ లో కనిపించింది.
For the husband’s 34th birthday I think we have a present from the angels above .. ???? pic.twitter.com/dbmATPDm3D
— Pranitha Subhash (@pranitasubhash) April 11, 2022



























