‘ఖైదీ నె.150’ విలన్ కీ, ‘ప్రేమించుకుందాం రా’ .. హీరోయిన్ కు వున్న సంబంధం ఏమిటో తెలిస్తే షాకవుతారు.?!

0
944

ఈమధ్య కాలంలో విడుదలైన చిరంజీవి 150 వ చిత్రం ” ఖైదీ నంబర్ 150″ ద్వారా టాలీవుడ్‌ కు పరిచయమైన స్టైలిష్ విలన్ తరుణ్ అరోరా పైకి స్టైలిష్ గా కనిపిస్తూనే క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ.. తన స్టైల్‌తో, లుక్స్‌తో దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నారు. 

ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవల్సిన ట్విస్ట్ ఏమిటంటే.. ఈ స్టైలిష్ విలన్ ఓ ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ కు స్వయానా భర్త. ఆమె మరెవరో కాదు. గతంలో ‘ప్రేమించుకుందాం రా’ ‘రావోయి చందమామ” వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అందాల తార అంజలా జవేరి. ఏంటి.. అవాక్కయ్యారా.?! నిజమేనండి. తనకు సినీ అవకాశాలు రావడానికి కారణం తన భార్యేనని, కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో తన భార్య అంజలా జవేరికి ఉన్న పరిచయాల మూలం గానే తనకు సినిమా ఛాన్స్ లు వస్తున్నాయని స్వయంగా తరుణ్ అరోరాయే మీడియా ముందు చెప్పడం విశేషం.

ఈమధ్య ఇతను మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “అర్జున్ సురవరం’ చిత్రంలో చాలా మంచి పాత్రలో నటించాను. త‌మిళ చిత్రం ‘కణిత‌న్‌’ కి రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాతృక‌లో కూడా నేనే న‌టించా. అక్కడ క‌థ ప్రధానంగా హీరో, విల‌న్‌ల మ‌ధ్యే సాగుతుంది. తెలుగులో మాత్రం ఇత‌ర పాత్రల‌కి కూడా ప్రాధాన్యం ద‌క్కింది. సెంటిమెంట్ కూడా తోడైంది. అది సినిమాకి మరింత మేలు చేసింది. చూసిన‌వాళ్లంతా చాలా బాగుంది అంటున్నారు. అదే టైంలో బాలీవుడ్‌ లో నేను నటించిన సినిమాలు చూసి కోలీవుడ్‌లో నాకు ఛాన్స్ ఇచ్చారు. మొదటి సినిమాలోనే నా నటన నచ్చడంతో వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇక టాలీవుడ్‌లో అయితే నా కోలీవుడ్‌ సినిమాలు విడుదలైన తర్వాతే చిరంజీవి గారి సినిమాలో నటించే ఛాన్స్‌ వచ్చింది” అని తెలిపారు.

ఈ ఇంటర్వ్యూలోనే అంజలా జవేరి ప్రస్తావన తీసుకు రావడంతో.. “మేమిద్దరం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం. మాది 20 ఏళ్ల ప్రేమ‌ బంధం. ఆరేళ్ల కింద‌ట మా కుటుంబ స‌భ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాం. ముందుగా నేనే తనకు నా ప్రేమ‌ సంగతి చెప్పాను. అప్పుడు త‌ను ద‌క్షిణాదిలో సినిమాలు చేస్తుంది. నేనేమో మోడ‌ల్‌ గా ఉన్నా. ఒక ఈవెంట్‌ లో క‌లుసుకున్న‌ప్పుడు ఇద్ద‌రికీ ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత కొన్నాళ్లు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నాం. త‌ర్వాత ప్రేమ‌, పెళ్లి. మాకింతవరకూ పిల్ల‌లు లేరు. మేమే ఒక‌రికొక‌రు పిల్ల‌ల్లాగా ఉంటాం. పెద్ద‌లు కుదిర్చిన బంధంలో పెళ్లి త‌ర్వాత భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య మ‌రింత ప్రేమ పుట్టేందుకు పిల్ల‌లొస్తుంటారు. కానీ మేం మాత్రం ముందు నుంచే ప్రేమ‌లో ఉన్నాం. నేనైనా, అంజ‌లా జ‌వేరి అయినా మా ఇద్దరిదీ ఒకటే ఫీలింగ్.. మ‌నసుల్లో ప్రేమ ఉండాలి. అలాంటి బంధం ఎప్ప‌టికీ ధృడంగా ఉంటుంది.” అని తెలియజేశారు తరుణ్ అరోరా. “ఆ మధ్య “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చిత్రంలో చివరిసారిగా నటించిన అంజ‌లా జ‌వేరి ఆ తర్వాత తెలుగులో న‌టించ‌లేదు. మరి అంజలా జవేరి తెలుగులో మ‌ళ్లీ న‌టించేందుకు ప్ర‌య‌త్నాలేమైనా చేస్తున్నారా?” అనడిగిన ప్రశ్నకు తరుణ్ బదులిస్తూ.. “మంచి క‌థ కోసం ఎదురు చూస్తోంది. గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌డానికి ప్ర‌స్తుతం చాలా మంది యువ క‌థానాయిక‌లు ఉన్నారు. ఈ ద‌శ‌లో అంజలా తనకు తగిన క‌థ, పాత్ర దొరికితే నటించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది.” అని చెప్పి ఇంటర్వ్యూను ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here