గులాబీ సినిమా గుర్తు వస్తే ముందుగా గుర్తు వచ్చేది హీరోయిన్ మహేశ్వరి. ఆవిడ అందం, అభినయం, హస్కీ వాయిస్, నవ్వు, ఆవిడ చేసే అల్లరి అన్ని అంశాలు ఆకట్టుకునే మహేశ్వరి ఆ సమయంలో కుర్రకారుకి డ్రీం గర్ల్ గా మారింది. మహేశ్వరి గులాబీ సినిమా నటించిన తర్వాత ఆవిడ పెద్దగా సినిమాలు హిట్ అవ్వలేదు. అయితే మాస్ మహారాజా రవితేజతో కలిసి నటించిన నీకోసం సినిమాలో ఆవిడకు నంది అవార్డును తెచ్చిపెట్టింది. ఆవిడ కేవలం సినీ పరిశ్రమ మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మహేశ్వరి హీరోయిన్ గా జె.డి. చక్రవర్తి హీరోగా కలిసి మూడు సినిమాలు చేశారు. అప్పట్లో వారిద్దరూ ప్రేమలో ఉన్నారని సినిమా వర్గాల్లో చర్చించుకున్నారు. ఆ సమయంలో జెడి చక్రవర్తి మహేశ్వరిని పెళ్లి కూడా చేసుకుందాం అని అడిగారు. కాకపోతే, అది బెడిసి కొట్టి చివరకు మహేశ్వరి జై కృష్ణ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెట్ అయిపోయింది.

ఈవిడ తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా టాప్ హీరోలందరితో నటించింది. సినిమాల కన్నా కూడా హీరో చక్రవతితో ఎఫైర్ తో ఎక్కువగా పాపులర్ అయ్యింది మహేశ్వరి. ఇక సినిమా ఆఫర్స్ తగ్గుముఖం పట్టే సమయంలో సీరియల్స్, టీవీ షోస్ లలో కూడా నటించింది చివరికి 2008 లో తిరుపతిలో జయకృష్ణ అనే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని వివాహం చేసుకొని పూర్తిగా సినిమాలను చేయడం మానేసింది. ప్రస్తుతం మహేశ్వరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈవిడ హైదరాబాద్ నగరంలోని ఓ ఫ్యాషన్ డిజైనర్ గా సొంత బ్రాండ్ ను క్రియేట్ చేసి ఓ బొటిక్ ను ఓపెన్ చేసింది. మహేశ్వరి అయ్యప్పన్ అనే బ్రాండ్ తో పెద్ద ఎత్తున ఫ్యాషన్ డిజైన్ దుస్తులను అమ్మకాలు చేపడుతుంది. ఈ బొటిక్ ఆమె పిన్ని, అతిలోక సుందరి శ్రీదేవి చేత ఓపెనింగ్ చేయబడింది. అప్పట్లో ఈ విషయం పెద్ద సెన్సేషనల్ గా మారింది. ఒక పక్క బిజినెస్ నడిపిస్తూ మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న మహేశ్వరీ తన పిన్ని శ్రీదేవి తదనంతరం ఆమె కూతుళ్లయినా ఖుషి మరియు ఝాన్వి కి తనవంతుగా సపోర్ట్ గా నిలబడింది.

శ్రీదేవి ఇంట్లో ఏ కార్యక్రమం అయినా మహేశ్వరీ ముందు ఉంది చేయడమే కాదు ఆమె పిలల్ల పుట్టినరోజు వేడుకలకు క్రమం తప్పకుండ హాజరవుతూ శ్రీదేవి లేని లోటు తీరుస్తుంది. ఇకపోతే మహేశ్వరి మాత్రమే కాకుండా మహేశ్వరి తమ్ముడు కూడా సినీ ఇండస్ట్రీలో పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన పేరు అవిశేక్ కార్తీక్. ఈయన కూడా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నటించాడు. ఈయన నటించిన ఓ తమిళ సినిమా ద్వారా ఈయన తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితమే. తమిళ్ లో రిలీజ్ అయిన ఖాతాడి అనే సినిమా తెలుగులో డబ్ రిలీజ్ అయింది. ఇక సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో హీరో సూర్య స్నేహితుడిగా ఆయన నటించాడు. దీంతో ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయినట్లు అయింది. ఈయన ఎక్కువగా తమిళ్ ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమాలు చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here