బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డిప్రెషన్ కారణంగా మరణించిన నేపథ్యంలో అనేక మంది సెలెబ్రెటీస్ వారియొక్క అనుభవాలను పంచుకుంటున్నారు. అదే విషయం గత కొద్దిరోజులుగా పూనం కౌర్ తన జీవితంలో కూడా టాలీవుడ్ లోని గురూజీ (ఒక స్టార్ డైరెక్టర్) వలన చాలా ఇబ్బందులకు లోనయ్యానని.. ఒకానోక సమయంలో తీవ్రమైన మనోవేదన అనుభవించానని, ఆ డైరెక్టర్ తన జీవితాన్ని నాశనం చేసాడని చెప్పుకొచ్చింది.

అంతేకాదు తన స్నేహితుడి జీవితం కూడా పాడు చేశాడంటూ మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతా ఆయన్ని గురూజీ అంటారు కానీ ఆయన గురూజి కాడంటూ ట్విట్టర్ లో ట్వీట్ ల మోత మ్రోగించింది పూనమ్. దీనిపై నెటిజన్లు బాగానే స్పందించారు.. అందులో భాగంగా ఒక అభిమాని అంత జరిగినప్పుడు మీరు లీగల్‌గా ఎందుకు వెళ్ళలేదు.. కొంచెం పోరాడాలి కదా అంటూ సలహా ఇచ్చాడు. దీనికి పూనమ్ కూడా గట్టిగానే రిప్లై ఇచ్చింది.

“నీకు ఈ విషయం మీ అన్నయ్య చెప్పాడా.. ఆయన ఓడిపోతే నీకు హాపీ గా ఉంటుందా ? ఆయన అవమానిస్తుంటే మీకు ఆనందమా.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని అవమానిస్తుంటే మీకు హాయిగా ఉంటుందా అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఆయన జీవితంతో పాటు తన జీవితం కూడా ఆ డైరెక్టర్ నాశనం చేసాడని.. కేవలం ఒక సన్నాసి వల్ల మీ అన్నయ్య జీవితం కూడా పాడైపోతుంది..నమస్తే అంటూ ట్వీట్ చేసింది.
Mi Anna Cheppara …..aaina odipoindi meeku happy ga unda ? Aaina insult aindi happy ga unda ? Cheppandi …. mudu pellilu ani insult chestu untey happy ga unda ? ee Sannasi wall mee Anna jeevitam pad ayindi ani telyali ….namaste
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 18, 2020



























