పరిచయమైన తొలి చిత్రంతోనే స్టార్ డమ్, ఫేమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం అనేది మామూలుగా అందరు హీరోయిన్లకు దక్కే అదృష్టం కాదు. అలాంటిది ఒకే ఒక్క సినిమాతోనే యావత్ సౌత్ ఇండియన్ ఆడియన్స్ హృదయాల్లో తన నటనతో, అందంతో చెరగని సంతకం చేసింది రష్మిక మందన. దక్షిణాది సినీ పరిశ్రమంలో ఓ వెలుగు వెలుగుతున్న ప్రముఖ అగ్ర కథానాయిక, కన్నడ అందాల భామ రష్మిక మందన్న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నాగశౌర్య హీరోగా వచ్చిన ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ కన్నడ బ్యూటి.. గీత గోవిందం సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఇక తాజాగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ సక్సెస్ లతో రష్మిక మందన్నా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపొయింది.

తెలుగులో ఇప్పటివరకు చేసింది 6 సినిమాలే అయినా బ్యాక్ టు బ్యాక్ అవన్నీ సూపర్ హిట్స్‌ సాధించడంతో అగ్ర స్థానంలో నిలిచింది. టాలివుడ్‌లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్‌లలోనూ ఈ లక్కీ బ్యూటీ కూడా ఒకరంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తాజాగా టాలివుడ్‌లో ఓ టాక్ నడుస్తోంది. అదేంటంటే రష్మిక మందన్న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఒక లగ్జరీ ఫ్లాట్ కొన్నది అని. ఈ వార్తని రష్మిక ఇంకా ధృవీకరించనప్పటికీ, ఇదే నిజమని ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ కన్నడ బ్యూటీకి టాలీవుడ్‌లోనే ఎక్కువ అవకాశాలు వస్తుండటంతో మాటిమాటికి బెంగళూరు టూ హైదరాబాద్ ఎందుకని ఇక్కడే మకాం మార్చేసింది ఈ కన్నడ బ్యూటీ. అలాగే ఇక్కడే కొన్ని ప్రాపర్టీపై ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిందనేది తాజా సమాచారం. మొత్తానికి ఈమధ్యనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రష్మిక కూడా ఇల్లు కొనేసిందనే విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా క్రేజ్ ఉన్నపుడే ఆస్తులు కూడబెట్టుకుంటుంది ఈ కన్నడ బ్యూటీ. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌తో సుకుమార్‌ “పుష్ప” చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను న‌టిస్తోంది. అయితే ఈ సినిమాలో రష్మిక పాత్ర అదిరిపోయేలా డిజైన్ చేశాడట సుకుమార్‌. అంతేకాదు, ఇందులో బన్నీకి ఆమెకు మధ్య బాలీవుడ్‌ రేంజ్‌లో చూపించే రొమాన్స్‌ ఉంటుందని సమాచారం. ప్రస్తుతానికి లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ చిత్రానికి కూడా రష్మిక భారీ రెమ్యునరేషన్ తీసుకుంది అని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here