సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి కొంత సమయం మాత్రమే క్రేజ్ ఉంటుంది. హీరోయిన్స్ కొంచెం వయసు పెరిగిన, బరువు పెరిగిన లేక పెళ్లి చేసుకున్నా వారికి సినిమా అవకాశాలు మాత్రం సరిగ్గా రావు. ఇక హీరోయిన్ పాత్ర నుంచి తల్లి, అత్త పాత్రలకు పడిపోతారు. సినిమా సంగతి ఎలా ఉన్న హీరోయిన్లు పెళ్లి అయిన అనంతరం సినిమాలు తీయడం తగ్గించి లేదా పూర్తిగా ఆపివేసి పూర్తి శ్రద్ధ కుటుంబానికే అంకితం ఇవ్వడం మనం గమనిస్తూనే ఉన్నాం.

ఇక మంచి హీరోయిన్లుగా కొనసాగుతూ ఉన్న వారు ఇలా ఒక్కసారిగా వారి కుటుంబానికి లైఫ్ లో అంకితం చేస్తే ఆ వైవాహిక జీవితంలో ఏదైనా సమస్యలు వస్తే వారి పరిస్థితి ఏమిటి…? ఇలా పెళ్లి అయిన అనంతరం వారి భర్తలతో తగాదాలు పడి విడిపోయిన చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.

ఇక వారి వివరాలు చూద్దామా.. ముందుగా చెప్పుకోవాల్సింది రజిని. 1980 – 1990 లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రజిని.. అమెరికా డాక్టర్ అయినా ఎన్నారైని వివాహం చేసుకొని కొంతకాలం వారి జీవితం సాఫీగా కొనసాగింది. కానీ, సొంత ఆస్తి విషయంలో తనకు అన్యాయం జరిగిందని తెలుసుకొని వారి పిల్లలతో సహా ఇండియాకు వచ్చి ఎన్నారైతో విడాకులు తీసుకుంది. ఆ సినిమాలలో మళ్లీ అవకాశం ఇస్తే తన టాలెంట్ నిరూపించుకున్న తాను అన్ని తనకు తెలిసిన వాళ్ల అందరిని కూడా సంప్రదించింది కానీ అవకాశాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇక పిల్లల కోసం భర్త ఇస్తున్న భరణంతో జీవనం కొనసాగించడం రజినీ విషయంలో బాధాకరమైన సంఘటన అనే చెప్పాలి.

ఇక మరో ప్రముఖ హీరోయిన్ ప్రీతి జాంగియాని. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ అయినా పర్వీన్ డబస్ నీ 2008 లో వివాహం చేసుకుంది. కొన్ని రోజులు వీరి వివాహ జీవితం సాఫీగా కొనసాగిన.. కొడుకు పుట్టిన అనంతరం సమస్యలు ఎదుర్కొని చివరకు అది విడాకులకు దారి తీసింది. ప్రీతి పెళ్లి అయిన అనంతరం పూర్తిగా తన లైఫ్ లో కుటుంబానికి అంకితం చేసి.. కొడుకుతో కలిసి బయటకు వచ్చి ఇప్పుడు ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది..

ఇలా భర్తతో విడిపోయి జీవనం కొనసాగిస్తున్నా హీరోయిన్ లిస్టులో మరో నటి భానుప్రియ. ఇక తెలుగు ఇండస్ట్రీలో భానుప్రియ నాట్యం నటన నచ్చని వారు ఎవరు ఉండరు. ఇక భానుప్రియ 2005లో సినిమా లకు పులిస్టాప్ పెట్టి… ఆదర్శ్ ను వివాహం చేసుకొని అమెరికాకు వెళ్లి పోయింది. అనంతరం వీరిద్దరికీ ఒక పాప పుట్టింది. వీరిద్దరి మధ్య ఏమి గొడవలు వచ్చాయో తెలియదు కానీ… భానుప్రియ తన కూతురుతో అన్నీ వదిలేసి అమెరికా నుంచి ఇండియాకు వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటిస్తూ ఉన్న ఈ మధ్య తన భర్త మరణంతో చాలా కుంగిపోయింది. ఆమె మానసిక స్థితి కూడా ఒక్కోసారి ఆమె ఏం చేస్తుందో కూడా అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇటీవల కాలంలో కాస్త కోలుకుంది. ఏమైనా కాని అందాల నటి భానుప్రియ జీవితం మాత్రం చాలా బాధాకరం. ఇటీవల శాంతి ప్రియ కూడా భర్త చనిపోయి, ఈమె కూడా ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది.

ఇక ఈ లిస్టులో కి వచ్చే మరో నటి రమాప్రభ. ఇక వృద్ధ వయసులో ఉన్న ఈమె జీవితం అందరికీ ఒక తెరిచిన పుస్తకమే. ఆమె వయసులో ఉన్నప్పుడు ఎంత సంపాదించి ఉంటుందో ఎవరికీ తెలియదు. భర్త మోసం చేసి ఆమెను వదిలేశాక.. ఆస్తులు పోయి సినిమాలు లేక వయస్సు మెరుగుపడి.. పూరి జగన్నాథ్ ఇచ్చే డబ్బుతోనే చివరి రోజుల జీవితాన్ని కొనసాగిస్తుంది.

ఇక ఇదే లిస్ట్ లో కి వచ్చే మరో హీరోయిన్ కమలహాసన్ భార్య సారిక. ఇద్దరు పిల్లలు పుట్టే అంతవరకు వారి వివాహ జీవితం అంతా బాగా ఉన్నా కూడా.. కమలహాసన్ స్త్రీలోలుడు అని గుర్తించిన తర్వాత వారు ఇద్దరు పిల్లలను అతని దగ్గరే వదిలేసి.. ఒంటరి జీవితాన్ని గడిపేస్తుంది. ఇక ఆమె పిల్లలు సరిగ్గా జీవనం కొనసాగించక పోయినా భర్త కమలహాసన్ గౌతమితో సహజీవనం చేస్తున్న కూడా ఏమీ పట్టించుకోకుండా ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తోంది.

ఇక శారదా, రేవతి వంటి హీరోయిన్లు కూడా పిల్లలు లేకపోయినా భర్త నుంచి విడాకులు తీసుకొని వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీ వారు కాకుండా ఇతర ఇండస్ట్రీలలో అంబికా ప్రియారామన్, మంజు వారియర్, అమలాపాల్, రిజి, హరిత, ప్రేమ, లక్ష్మి కూతురు ఐశ్వర్య, సుకన్య లాంటి హీరోయిన్లు ఒంటరి జీవితాన్ని గడిపేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here