Tollywood Heroins Education : సినిమాలో హీరోయిన్ అనగానే అందంగా గ్లామరస్ గా కనపడాలి అయితే ఒక సినిమాలో హీరోయిన్ అవ్వాలంటే మాత్రం అవకాశాల కోసం కష్టపడాలి అంతే కాదు ఆ వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుని కెరీర్ చక్కబెట్టుకోవాలంటే కూడా తెలివితేటలు లౌక్యం ఉండాలి. ఇక ఇండస్ట్రీ అంటేనే పరిచయాలు కమ్యూనికేషన్ బాగుంటేనే నాలుగు అవకాశాలు వస్తాయాంటారు. అలాంటి ఇండస్ట్రీలో మంచి పేరు పెట్టుకునో అవకాశాలను అందుకోవాలంటే అందుకు ఖచ్చితంగా మంచి చదువుతోనే ఆ జ్ఞానం అబ్బుతుంది. అలా అక్షర జ్ఞానం మాత్రమే కాదు డిగ్రీలు చదివిన అందమైన భామలు మన టాలీవుడ్ లో ఉన్నారు. ఇంతకీ మన ముద్దుగుమ్మల చదువులేంటో తెలుసా…

కాజల్ నుండి నేటి రష్మిక వరకు…
టాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన చందమామ అంటే కుర్రకారుకి ఇప్పటికీ క్రష్, పెళ్లి చేసుకుని బిడ్డకు జన్మనిచ్చినా ఇంకా గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గని మన కాజల్ సినిమాల్లోకి రాక ముందు మాస్ మీడియా లో డిగ్రీ చేసిందట. అమ్మడి మొదటి సినిమా తేజ డైరెక్షన్ లో వచ్చిన లక్ష్మి కళ్యాణం. ఇక మన జేజమ్మ అనుష్క కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేసింది పైగా యోగా టీచర్ కూడా, సూపర్ సినిమా తో సూపర్ ఎంట్రీ ఇచ్చింది స్వీటీ శెట్టి. ఇక మన సామ్ అయితే చదివులో టాపర్. కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసిన అమ్మడు చదువు అయ్యాక మోడలింగ్ తో మొదలు పెట్టి ఆపై హీరోయిన్ అయింది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా ఆర్ట్స్ లో డిగ్రీ చేసింది. ఆపై హిందీ లో మొదలు పెట్టి హ్యాపీ డేస్ తో తెలుగులో మెరిసింది. ఇక నేటి మహానటి కీర్తి సురేష్ ఫ్యాషన్ డిజైనింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. ఇక మన బుట్టబొమ్మ పూజ హెగ్డే ఏకాంగ పోస్ట్ గ్రాడ్యుయేట్ తెలుసా. ఏంకామ్ చేసిన పూజ మూగముడి అనే తమిళ సినిమాతో హీరోయిన్ అయింది.

ఇక సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన తార బ్యాచిల్లర్ డిగ్రీ బీఏ ఇంగ్లీష్ లీటరేచర్ చేసింది. మలయాళం సినిమాలతో మొదలై సౌత్ లో అగ్ర హీరోయిన్ గా ఉంది, ఇటీవలే పెళ్లి చేసుకుని సరోగసీ పద్దతి లో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇక శృతి హాసన్ చిన్నపటి నుండి సినిమాల్లో అడపాదడపా కనిపిస్తున్నా సైన్స్ స్టూడెంట్. బీ ఎస్సి చదువుకుంది అమ్మడు. ఇక మన సాయి పల్లవి డాక్టరమ్మ అని అందరికీ తెలిసిందే. మన నేషనల్ క్రష్ రష్మిక మందన డిగ్రీ లో సైకాలజీ, ఇంగ్లీష్ లీటరేచర్, జర్నలిజం చదివింది. కన్నడ సినిమా కిర్రాక్ పార్టీ తో ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ తెలుగులో ఛలో సినిమాతో పరిచయమైంది.
































