చాలామంది హీరోయిన్లు ఒకానొక సమయంలో సినీ పరిశ్రమలో టాప్ పొజిషన్ లో ఉండి ఆ తర్వాత ఎవరికీ కనబడకుండా మాయమైపోయిన వారు ఎందరో ఉన్నారు. సినిమాలు రాక సినీ ప్రపంచం బోర్ కొట్టేసిందో లేక దాంపత్యజీవితాన్ని మొదలుపెట్టాలనో పూర్తిగా సినీ పరిశ్రమను వదిలి పోయిన వారు చాలామంది ఉన్నారు. సినీ పరిశ్రమలో కొన్ని హిట్లు వచ్చిన తర్వాత కూడా వారు మాత్రం సినీ పరిశ్రమను వదిలి వెళ్లారు.

అయితే వారు ఇప్పుడు నిజజీవితంలో ఎలా ఉన్నారు. ఏం చేస్తున్నారు…? అన్న విషయాల గురించి ఆలోచిస్తేనే ఇలానే ఉంటుంది. అయితే అలా వెళ్ళి పోయిన వారిలో ప్రముఖంగా ఉన్న వారి గురించి తెలుసుకుందామా…

ఇక ఈ లిస్టులో మొదటగా వినిపించే పేరు అపర్ణ. 1990లో సుందరాకాండ సినిమా ద్వారా ఆమెను వెండితెరకు పరిచయం అయింది. కేవలం ఆ ఒక్క సినిమాతోనే ఆవిడ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఆ సినిమాలో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను ఇట్టే కట్టి పడేసింది. ఇక ఈ సినిమా తర్వాత ఆవిడ “అక్క పెత్తనం చెల్లెలి కాపురం” అనే ఒక్క సినిమా మాత్రం చేసి ఆ తర్వాత సినీ పరిశ్రమ నుంచి కనుమరుగైపోయింది. అయితే టాలీవుడ్ లో నుంచి వెళ్లిపోయాక బాలీవుడ్ లో నాకౌట్ అనే సినిమా లో నటించింది. ఆ తర్వాత 2002 సంవత్సరంలో తాను వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడింది. ఇప్పుడు ఆవిడకు ఇద్దరు పిల్లలు భర్త తో హ్యాపీగా జీవి చేస్తోంది.

ఇక ఈ లిస్ట్ లో మరో హీరోయిన్ అందాల నటి గిరిజ. ఈమె కుటుంబం విషయానికి వస్తే… తన తండ్రి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వైద్యుడు. తల్లి ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యాపారవేత్త. ఈవిడ తన యుక్తవయసులో భరతనాట్యం నేర్చుకోవడానికి, అలాగే భారత దేశం పై ఉన్న మమకారంతో ఆవిడ భారత్ కు వచ్చింది. అయితే 1989 సంవత్సరంలో ఆమె డాన్స్ ను చూసిన మణిరత్నం తనని గీతాంజలి సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేశాడు. ఆ సినిమాలో తన నటన కి తెలుగు సినీ అభిమానులు బ్రహ్మరథం పట్టారు.అయితే ఆ తర్వాత ఆమె తెలుగులో హృదయాంజలి అలాగే మలయాళంలో మరో సినిమాను మాత్రమే చేసింది.అయితే ఆవిడ ఎందుకు సినిమాలో నుంచి తప్పుకొని తిరిగి ఇంగ్లాండ్ కి వెళ్ళిపోయింది. అయితే ప్రస్తుతం ఆమె అక్కడ రచయితగా స్థిరపడింది. అయితే ఇప్పటికీ తాను సినిమా పై ఉండే ఇష్టంతో ఇప్పటికీ సినిమా పై అధ్యయనం చేస్తూనే ఉంది. సినీ పరిశ్రమలోని కొంతమంది దర్శకులు నిర్మాతలతో కలిసి పని చేస్తూనే ఉంది.

ఇక ఈ లిస్టులో మరో హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. బాలీవుడ్ లో పెయింటర్ బాబు అనే హిందీ సినిమా ద్వారా ఆవిడ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఈవిడ కూడా అతి తక్కువ టైమ్ లోనే బాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రముఖ బాలీవుడ్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించారు. ఇక ఆ తర్వాత ఈమె తెలుగులో కూడా నటించింది. టాలీవుడ్ లో ఈమె నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత జీవన పోరాటం అనే సినిమాలో కూడా నటించింది. ఆపై చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు సినిమాలో కూడా హీరోయిన్గా నటించి అందరినీ మెప్పించింది. అయితే టాలీవుడ్ లో తక్కువ సినిమాలే చేసినా, ఆవిడ బాలీవుడ్ లో మాత్రం అనేక సినిమాలను చేసింది. అలా సినిమాలు చేస్తూనే తాను సినీ జీవితానికి కాస్త దూరం అవుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం ఆవిడ అమెరికాలో స్థిరపడింది. అక్కడ ఓ డాన్స్ స్కూల్ నడుపుతూ బిజీగా జీవితాన్ని గడిపేస్తోంది. ఆవిడకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఇక ఈ లిస్ట్ లో మరో హీరోయిన్ కేరళ కుట్టి సింధు మీనన్. రష్మీ అనే తన సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనా జీవితాన్ని మొదలుపెట్టిన సింధు మీనన్… ఆ తర్వాత మలయాళంలో అనేక సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సింధు తినేత్రం, శ్రీరామచంద్రులు, ఆడంతే అదో టైపు, ఇన్స్పెక్టర్, భద్రాచలం సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన చందమామ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. టాలీవుడ్ లో ఆమె చివరి సినిమా సుభద్ర. అయితే ఆ తర్వాత 2010 సంవత్సరంలో ప్రముఖ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో హ్యాపీ గా తన సంసార జీవితాన్ని గడిపేస్తోంది. ఇప్పుడు ఆమెకు ఒక కూతురు కూడా ఉంది.



























