టాలీవుడ్ సీనియర్ హీరోస్ కి హీరోయిన్ లతో కష్టాలు వస్తున్నాయి. యంగ్ హీరోలతో సమానంగా సీనియర్ హీరోలు కూడా వాళ్ళ వయస్సు తో సంబంధం లేకుండా మంచి మంచి కథలతో రాణిస్తున్నారు. కానీ సీనియర్ హీరోలకు తగ్గ హీరోయిన్ లు లేకపోవడంతో ఉన్న హీరోయిన్ లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

యంగ్ హీరోస్ కి ఎప్పటికపుడు కొత్త కొత్త భామలు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు.. కానీ సీనియర్ హీరోలకి మాత్రం తగిన హీరోయిన్లు దొరకడం కష్టం అవుతుంది. ఈ సమస్య చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోలకు పెద్ద సమస్యగా తయారైంది.

చిరంజీవి 150వ చిత్రం “ఖైదీ నెం.150” చిత్రంలో ఆ సినిమాకి తగిన హీరోయిన్ లేక అంతా క్రేజ్ లేని కాజల్ అగర్వాల్ ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన “సైరా నరసింహ రెడ్డి” సినిమాలో కూడా నయనతారని ఎంచుకున్నారు.. చిరు కొత్త సినిమా “ఆచార్య” కి కూడా ఫెడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ త్రిషని అనుకున్నారు చిత్ర యూనిట్ కానీ త్రిష ఎవో కారణాలతో ఆ సినిమా నుండి తప్పుకుంది. ఇంకా చేసేదే లేక మళ్లీ కాజల్ నే హీరోయిన్ గా తీసుకోవాలని నిర్ణయించారు.ఈ సమస్య చిరు తదుపరి చిత్రాలపై కూడా ఉండే అవకాశం వుంది.

ఇక మరో సీనియర్ హీరో బాలకృష్ణ విషయానికి వస్తె బాలయ్య కొద్ది కాలంగా నయనతార తోనే సర్దుకుపోవాల్సి వస్తుంది. బాలయ్య సినిమాలకు ఎపుడు హీరోయిన్ల కొరత ఏర్పడం సహజం అయిపోయింది. అందుకే ఆయన ఫెడ్ ఔట్ అయిన హీరోయిన్ లతో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. బాలకృష్ణ తదుపరి చిత్రం బోయపాటి దర్శకత్వంలో వస్తున్న సినిమాకి కూడా హీరోయినే పెద్ద సమస్యగా ఉంది. ఈ సినిమాకి అంజలి లేదా శ్రియనీ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

అదే సమస్య మరో సీనియర్ హీరో మన వెంకటేష్ ని కూడా వెంటాడుతుంది. రీసెంట్ గా వచ్చిన “వెంకీ మామ” లో కూడా ఏ మాత్రం సెట్ అవ్వని పాయల్ రాజ్ పుత్ తో నడిపించాలి వచ్చింది. తమిళ్ లో హిట్ అయిన “అసురన్” తెలుగు రీమేక్ “నారప్పా” చిత్రంలో సినిమాలు లేక టీవీ షోలు చేసుకుంటున్న ఏ మాత్రం క్రేజ్ లేని ప్రియమణి ని కథానాయికగా తీసుకున్నారని సమాచారం.

ఇక మన కింగ్ నాగార్జునకి కూడా హీరోయిన్స్ విషయంలో చిక్కొచ్చి పడింది. సాల్మన్ దర్శకత్వంలో వస్తున్న “వైల్డ్ డాగ్” సినీమా లో హీరోయిన్ అవసరం లేని పాత్రలో హీరో భార్య పాత్రకి ఎప్పుడో ఫెడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ దియ మీర్జాని హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. వరస సినిమాలు చేస్తున్న మన సీనియర్ హీరోస్ కి సరైన హీరోయిన్లు దొరకడం చాలా కష్టమవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.



























