టాలీవుడ్ డైలాగ్ కింగ్ సాయి కుమార్. ‘కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్’ అని కళ్లెర్రజేసి గర్జిస్తూ అగ్ని.. అంటూ అందరిని ఆకట్టుకున్న సాయి కుమార్ ఇప్పుడు మళ్లీ తన ప్రేక్షకుల కోసం వచ్చేశాడు. అయితే ఈసారి వెండితెరతో పాటు బుల్లితెరపై అదర గొట్టేస్తున్నాడు. ఇంతకీ సాయి కుమార్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేస్తున్న షో ఈTv లో ప్లసారమౌతున్న షో ‘వావ్’ సీజన్ త్రీ. ఇప్పటికే 2 సీజన్స్ తో ప్రేక్షకులను అలరించిన సాయి కుమార్ ఇప్పుడు మళ్లీ ఓ అద్భుతమైన సీజన్ తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

నలుగురు సెలబ్రిటీస్.. 4 రౌండ్లు.. 10 లక్షల క్యాష్.. ఐ యామ్ బ్యాక్ విత్ వావ్ త్రీ అంటూ బుల్లితెరపై అదిరిపోయే ప్రోమోతో ఎంట్రీ ఇచ్చాడు సాయి కుమార్. కరోనా లాక్ డౌన్ కు ముందు సాయి కుమార్ వావ్ షోతో బుల్లితెరపై సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే చాలా గ్యాప్ తర్వాత సాయి కుమార్ వావ్ సీజన్ 3 షో త్వరలోనే ఈటీవీలో ప్రసారం కానుంది. జ్ఞాపిక ఎంటర్ టైన్మెంట్స్‌లో ప్రసారమౌతున్న ఈ షో ఇప్పటికే 2 సీజన్లు హిట్ అయ్యాయి. మరి ఈ సీజన్ 3 షో ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి. ఇక అసలు విషయానికి వస్తే.. హైపర్ ఆది ఈ మధ్య కాలంలో ఏ పంచ్ వేసినా అవి వివాదాస్సదంగా మారిపోతున్నాయి. లేటెస్ట్ గా ఈTVలో సాయికుమార్ హోస్ట్ గా ప్రారంభమైన ‘వావ్ మాంచి కిక్ ఇచ్చే గేమ్ షో’ సీజన్ 2 షోలో ‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షోలోని సెలబ్రిటీలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇప్పటికే తొలి ఎపిసోడ్ లో అనసూయ హైలైట్ కాగా, 2వ ఎపిసోడ్ లో హైపర్ ఆది, అదిరే అభి హైలైట్ గా నిలిచారు.

2వ ఎపిసోడ్ ప్రారంభం నుండి చివరి వరకూ సరదా సరదాగా సాగిపోయింది. అయితే ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ కూడా పార్టిసిపేట్ చేయడం విశేషం. అలాగే ఈ షోలో ఎప్పట్లాగే హైపర్ ఆది పంచులతో చెలరేగి పోయాడు. ఈ షోలో భాగంగా హైపర్ ఆది తనకూ హిమజతో ఉన్న చనువుతో ‘మొగుడు పక్కనుండగా, ఏంటి.?’ అంటూ ఆది హిమజను ఆటపట్టించే ప్రయత్నం చెయ్యబోతే.. హిమజ మాత్రం కాస్త సీరియస్ అయ్యింది. ‘ఎవడు మొగుడు ఏంటా కథ.?’ అంటూ రెచ్చి పోయింది. ఊహించని ఈ పరిణామంతో హైపర్ ఆది షాకయ్యాడు. ఎప్పుడు ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉండే హైపర్ ఆదికి ఈ ఊహించని సంఘటన ఓ చేదు జ్ణాపకమనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here