లేడీ కమెడియన్స్…చెప్పడానికి ఎంతో సింపుల్ గా ఉన్న కూడా సినిమాల్లో వీరి ప్రాముఖ్యత ఏంటో ముఖ్యమైనది. ఒక రేలంగి రమాప్రభ, కోవై సరళ బ్రహ్మానందం. ఇలా కామెడి పండించాలంటే లేడీ కమెడియన్స్ పాత్ర ఎంతో మంచి టైమింగ్ డైలాగు డెలివరీ బాడీ లాంగ్వేజ్ ముఖ్యం. అలా టాలీవుడ్ లో నే సూర్యకాంతం నుండి నేటి గీత సింగ్ వరకు పేరు గడించిన కమెడియన్స్ ఉన్నారు. అయితే వీరు కమెడియన్స్ గా మాత్రమే మనకు తెలుసు ..కామెడి పండించే వీరు నవ్వుల వెనక బయట ప్రపంచానికి తెలియని విషాదం దాగి ఉంది. కొంత మంది ఆలా జీవితాన్ని ఎంతో గడిస్తున్న పెళ్లి పిల్లలు సంసారం లాంటివి లేకుండా పడుతున్న కష్టాలేంటో ఒకసారి చూద్దాం.
ఈ లిస్ట్ లో మొదటగా చెప్పుకోవాల్సింది సౌత్ ఇండియాలోనే మంచి కమెడియన్ గా పేరు ఉన్న కోవై సరళ గురించి. బ్రహ్మానందంతో తన కాంబినేషన్ ప్రతిదీ సూపర్ డూపర్ హిట్టే. 1990 సంవత్సరం నుండి బాగా పాపులరైన కోవై సరళ కుటుంబం కోసం పెళ్లి చేసుకోలేదు. తన తోడబుట్టిన వారిని లైఫ్ లో సెటిల్ చేయడం కోసం మొదటి నుండి కష్టపడుతూ అందరికి ఒక దారి చూపించింది. కానీ తాను మాత్రం పెళ్లి చేసుకోకుండా ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది. మొన్నీమధ్య ఆసుపత్రిలో చేరితే చూసే దిక్కు లేకపోవడంతో బోరున విలపించింది.
ఇక మరొక హాస్య నటి శ్రీలక్ష్మి. పేరుకే హీరో అమరనాథ్ కూతురు పూట గడవడం కోసం సినిమాల్లో చేరింది. కాస్త కుదుట పడుతున్న క్రమంలో తండ్రిని తర్వాత ముగ్గురు తోబుట్టువులను ఒక్కొక్కరిగా కోల్పోయినా గుండె నిబ్బరంతో కుటుంబాన్ని సాకింది. సోదరుడు రాజేష్ హీరోగా నిలదిక్కుకుతూ చనిపోతే కన్నీళ్లు బయటపడకుండా షూటింగ్ పూర్తి చేసి ఇంటికి వెళ్లి గుండె పగిలేలా రోదించింది. తానూ మాత్రం అందరి బాధ్యతలని తీర్చి పెళ్లి లేకుండా ఒంటరిగా జీవిస్తుంది.
నేటి కామెడియన్ గీత సింగ్ పరిస్థితి అంతే.. సినిమాల్లోకి వచ్చి కాస్త నిలదొక్కుకుంటున్న సమయంలో తోడబుట్టిన ఒక్కగానొక్క సోదరుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. హాస్యం పండించడం అలవాటయ్యింది కాబట్టి మీడియా ముందు నవ్వుతుంది కానీ తన జీవితంలో ఎంతో ఎదురీత ఉంది. పెళ్లి చేసుకోకుండా సోదరుడి కుటుంబాన్ని అన్ని తానై చూసుకుంటుంది. పిల్లలకు తండ్రి లేని లోటు తీర్చుతుంది. అలాగే మొన్నీ మధ్య ఆమె కస్టపడి చిట్టీలు వేసి దాచుకున్న డబ్బు కూడా కోల్పోయి పోలీస్ స్టేషన్ మెట్లెక్కేంది. పైసా పైసా కూడపెడితే అవి కూడా పోయాయి అంటూ కన్నీళ్లు పెట్టుంది.
ఇక ఈ ముగ్గురు కమెడియన్స్ పెళ్లి చేసుకోకుండా కష్టాలు పడుతుంటే పెళ్లి చేసుకొని విడిపోయి మరికొంత మంది కమెడియన్స్ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. కమెడియన్ రమాప్రభ, జయలలిత, యాంకర్ కం కామెడియన్ ఝాన్సీ, వేధింపులు ఎదుర్కొని, విడాకులు తీసుకొని ఆస్తులు పోగొట్టుకొని కష్టాలు పడుతున్నారు. ఇలా ఒక్కో కమెడియన్ జీవితంలో ఒక్కో విషాదం… వారి నవ్వుల వెనక కనిపించని వారి అంతరంగం ఉంది. ఇవండీ పెళ్లి చేసుకోక మరియు చేసుకున్న కష్టాలు పడుతున్న హాస్య నటీమణుల జీవితం




























