‘Who Is దుర్గారావు” ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ టాపిక్నె అదే.. నెటిజన్లు అందరూ ఎవరీ దుర్గారావు అంటు వెతకడం మొదలు పెట్టేసారు. నిజానికి ఈ దుర్గారావు ఓ టిక్ టాక్ స్టార్. ఈయనది అమలాపురం. తన భార్యతో కలిసి ఎన్నో డైలాగ్స్, మరెన్నో డ్యూయెట్స్ చేసి దాదాపు టిక్ టాక్ లో లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. ఈయనకో డిఫరెంట్ స్టైల్ ఉంది. తన వేసే డ్యాన్స్ ఎవరు చూస్తారులే.. అయినా డ్యాన్స్ వేయడానికి తనేమనా మైఖెల్ జాక్సన్ నా.. ప్రభుదేవానా అనుకోలేదు. ఏ నేనెందుకు డ్యాన్స్ చేయకూడదు అనుకున్నాడు. వెంటనే సెల్ ఫోన్ పెట్టి డ్యాన్స్ చేసి టిక్ టాక్ లో పెట్టాడు.

కొత్త సినిమా ఏది రిలెజైనా అందులో ఒక సాంగ్ తో సాంగ్ డ్యాన్స్ చేయడం టిక్ టాక్ లో పెట్టేయడం ఇదే చేశాడు. అతని చేసిన డ్యాన్స్ చూసి బాబోయ్ అనుకున్నారు కాని ఇప్పుడు అదే బాబోయ్ అనుకున్న అతన్ని టివి షోలో చూసి ఇది కదా లక్ అంటే అంటున్నారు. ఇంతకీ మీరు చదువుతున్నది ఎవరి గురించో తెలుసా.. టిక్ టాక్ స్టార్ దుర్గా రావు గురించి.! నక్కిలీసి గొలుసు సాంగ్ “పలాస” సినిమాకు ఎంత ఉపయోగపడ్డదో ఏమో తెలియదు కాని దుర్గా రావు ఫేమస్ అయ్యేందుకు మాత్రం బాగా యూజ్ అయ్యింది. దుర్గా రావు చేసిన ఈ డ్యాన్స్ చూసి పండు ఇమిటేట్ చేయడం ఆ సాంగ్ సూపర్ హిట్ అవడం.. ఆ తర్వాత దుర్గా రావుని ఆది టీం లో గెస్ట్ అప్పియరెన్స్ ఇప్పించడం.

జబర్దస్త్ లో వచ్చాడు కాబట్టి అతనితోనే జీ తెలుగు అదిరింది షోలో స్కిట్ వేయడం ఇదంతా దుర్గా రావు క్రేజ్ కు నిదర్శనం. ఓ విధంగా నీ ప్రయత్నం అంటూ చేస్తూ వెళ్తే నువ్వు ఊహించిన దాని కన్నా ఎక్కువే వస్తుంది అంటే ఇదేనేమో. దుర్గా రావు చేసే వెకిలి డ్యాన్స్ చూడలేక ముందు వ్యాక్ అనుకున్న వారు వాటితోనే తను ఫేమస్ అయిన విధానం చూసి వావ్ అనేస్తున్నారు. మొత్తానికి దుర్గారావు దంపతులు బాగానే ఫేమస్ అయిపోయారు.

తాజాగా దుర్గారావు దంపతులను ప్రముఖ సింగర్, సంగీత దర్శకుడు రఘు కుంచె స్వయంగా తన ఇంటికి పిలిచి దంపతులిద్దరినీ సన్మానించడమే కాకుండా ఇద్దరినీ ప్రత్యేకంగా ప్రశంసించాడు. ఈమధ్యనే విడుదలైన “పలాస” చిత్రంలోని నక్కిలీసు గొలుసు పాటను పాడటంతో పాటు మ్యూజిక్ డైరక్టర్ గా కూడా తన ప్రతిభను చాటుకున్న రఘు కుంచె ప్రత్యేకంగా దుర్గారావు దంపతులను సన్మానించడంతో దుర్గారావు ఫాన్స్ ఫిదా అవుతున్నారు.



























