వన్ మోర్ సూపర్ స్టార్. ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్ష’ – నాని సంచలన వ్యాఖ్యలు

0
217

ఇటీవల విడుదలైన ‘భానుమతి రామకృష్ణ’ ట్రైలర్ సంచలనం సృష్టించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. కొత్తదనంతో తెరకెక్కించిన ఈ రొమాన్స్ డ్రామా, తొలి తెలుగు OTT ఆహాలో వరల్డ్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం టైటిల్‌పై నెలకొన్న వివాదం అందరికీ తెలిసిందే.

‘భానుమతి రామకృష్ణ’ అనే పేరుని మార్చాలంటూ.. లెజండరీ నటి, స్వర్గీయ భానుమతి రామకృష్ణ కొడుకు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అవి కేవలం హీరో, హీరోయిన్ పాత్రల పేర్లే తప్ప సినిమాకు ‘భానుమతి రామకృష్ణ’ అనే పేరుకి ఎలాంటి సంబంధం లేదని చిత్ర బృందం చెప్తున్నారు. ఇదిలావుండగా ఈ చిత్ర ట్రైలర్‌ను నాని విడుదల చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘భానుమతి రామకృష్ణ’ టీమ్‌తో నాని మాట్లాడుతూ నవీన్ చంద్ర, సలోని, మిగిలిన చిత్ర యూనిట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే తాను చూసిన ప్రివ్యూ షో చాలా బాగుందని..

‘థియేటర్‌లో విడుదలయ్యాక హిట్ కొడితే మీరు చరిత్ర సృష్టించినట్లేనని.. ఎందుకంటే లాక్ డౌన్ టైంలో మా సినిమా విడుదలై సూపర్ హిట్ కొట్టిందని మీరు గొప్పగా చెప్పుకోవచ్చు’ అని మూవీ టీంను నాని ప్రోత్సాహించారు. 30 ఏళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య వేర్వేరు మనస్తత్వాలు వున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తే ఆ సంఘర్షణను వాళ్ళిద్దరూ ఎలా ఎదుర్కొన్నారనే విభిన్న కథాంశంతో రూపొందించిన ఈ సినిమాలో భానుమతిగా సలోని లూథ్రా, రామకృష్ణగా నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం ట్రైలర్ ను విడుధల చేసిన సందర్భంగా హీరో నాని యుంగ్ కమెడియన్ హర్షపై చేసిన కామెంట్స్ కి ‘వైవా’ హర్ష ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇంతకీ హర్ష అలా సంతోషపఢటానికి కారణమేమిటంటే.. నేచురల్ స్టార్ నాని.. ‘వన్ మోర్ సూపర్ స్టార్. ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్ష’ అని అనగానే అక్కడున్న ఫ్యాన్స్ ఈలలూ వేస్తూ గోల చేస్తూ సందడి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here