ఇండ్రస్ట్రీలో ఏరోజు ఎవరెవరు ఏ సంక నాకుతారో అందరికీ తెలుసు!! (సంచలన వ్యాఖ్యలు చేసిన రఘు కుంచె)

0
312

క్రొత్త సినిమా ఏది విడుదలైనా ఆ సినిమా బాగుందనో.. బాగాలేదనో చకచకా చిత్ర సమీక్షలు రాసేస్తుంటారు. ఆ సమీక్షల ఆధారంగానే చాలామంది ప్రేక్షకులు సినిమాలకు వెళ్తుంటారు. ఇక లేటెస్ట్ మూవీ రివ్యూలను రాసే రైటర్స్ కూడా ఆ సినిమాలను చూసి బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగోలేదని రాస్తారు. కానీ., కొందరు రైటర్స్ మాత్రం డబ్బుకి ఆశపడి.. బాగోలేని సినిమాని కూడా బావుంది అని రాస్తారు. సినిమా హీరోలు, దర్శక నిర్మాతలు మాత్రం మా సినిమా బాగున్నప్పటికీ.. బాగోలేదని సమీక్ష రాయడం వల్లే మా సినిమాకి కలెక్షన్స్ రావడం లేదంటూ రివ్యూలు రాసే రైటర్స్ మీద మండి పడుతుంటారు. సినిమా ఇండ్రస్ట్రీలో ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం సర్వ సాధారణమైన విషయమే.!

ఇక అసలు విషయానికి వస్తే.. తాజాగా ప్రముఖ టాలీవుడ్ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె కూడా తమ సినిమా బాగోలేదని రాశారంటూ రివ్యూ రైటర్స్ మీద ఫైర్ అయ్యాడు. ఎందుకంటే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు.. ఆ సినిమాకి పెట్టుబడి కూడా పెట్టారు. గాయకునిగా, సంగీత దర్శకుడిగా… ఇలా త‌ను ప్ర‌వేశించిన ప్రతీ విభాగం లోనూ మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ర‌ఘు కుంచె తాజాగా సినిమా ఆర్టిస్ట్ గా మారడంతో పాటుగా “47 డేస్” అనే సినిమాకి వన్ ఆఫ్ ద పార్టనర్‌ గా ఉన్నాడు. “47 డేస్” మూవీ లేటెస్ట్ గా నెట్ ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. దురదృష్టం ఏమిటంటే.. నెట్ ఫ్లిక్స్‌లో ఈ చిత్రానికి కనీసం యావరేజ్ టాక్ కూడా రాలేదు.

ఇక ఆ సినిమాకి సమీక్ష రాసిన రైటర్స్ పూర్ రేటింగ్స్ ఇవ్వడంతో ఆగ్రహించిన రఘు కుంచె.. “నెట్ ఫ్లిక్స్ లో ఉన్న 10 రూపాయల సినిమాలతో పోల్చి తన సినిమాను బాగోలేదని రివ్యూ రాయడం చాలా దారుణమని.. మా మూవీ రిలీజైన తర్వాత రివ్యూ ఎఫెక్ట్ కారణంగా మా సినిమా అప్పటికే నష్టాలలో ముంచేసింది” అని రివ్యూ రైటర్స్ పై మండి పడ్డారు. సినిమాను బ్రతకనివ్వండి, మీరు బతకండి. నా సినిమా కళాఖండమని నేనెక్కడా చెప్పలేదు. కానీ మా సినిమా 1,1.5 రేటెడ్ ఫిల్మ్‌గా రేటింగ్ ఇచ్చిన రైటర్ మేధావుల కోసం నేను ఈరోజు మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నాను. ఇండస్ట్రీలో ఏ రోజు ఎవరెవరు ఏ సంక నాకుతున్నారో ఆ లొసుగులన్నీ ఇండస్ట్రీలో ఉన్న ఎవరన్న అందరికీ తెలుసు. సీనియర్ జర్నలిస్ట్‌ లందరికీ ఇదే నా విజ్ణప్తి. నిజాయితీగా సినీ మీడియాలో మీరందరూ ఒక సినిమా మొదలైన దగ్గర నుంచి ఆ సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి, ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్లాలి, బిజినెస్ సోర్స్ ఏంటి ఎలా హైప్ తీసుకురావాలి.? అనే విషయాలను ఎంతో మనసు పెట్టి నిర్మాత గైడ్ చేస్తూ నిజాయితీగా సినిమా కోసం పని చేస్తారన్న విషయాన్ని మీరు గుర్తించాలి” అని ఆవేదన చెందాడు రఘు కుంచె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here