హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు డైలాగ్ కింగ్ సాయి కుమార్. అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఈయన టాలీవుడ్ హీరోలైన సుమన్, రాజశేఖర్ వంటి ఎంతో మంది స్టార్ లకు లైఫ్ ఇచ్చారని చెప్పవచ్చు. తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ కు ‘పెదరాయుడు’ ‘బాషా’ చిత్రాలలో డబ్బింగ్ చెప్పింది సాయి కుమారే అన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇక హీరోగా ఈయన నటించిన ‘పోలీస్ స్టోరీ’ చిత్రం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించి సాయి కుమార్ ఇమేజ్ ను రెట్టింపు చేసిందన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సాయి కుమార్ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించిన సినిమాలన్నీ ఆయ‌న‌ ఇమేజ్‌ను భారీగా పెంచేశాయి. ‘క‌నిపించే 3 సింహాలు చ‌ట్టానికి, న్యాయానికి, ధ‌ర్మానికి ప్ర‌తిరూపాలైతే.. క‌నిపించ‌ని ఆ నాలుగో సింహమేరా పోలీస్’ అంటూ సాయి కుమార్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆల్ టైమ్ ఫేవ‌రేట్ డైలాగ్.

అయితే యాక్ష‌న్ జోన‌ర్ లో సాయి కుమార్ న‌టించిన ‘ఈశ్వ‌ర్ అల్లా’ చిత్రం మాత్రం త‌న‌కు భారీగా న‌ష్టాలను తెచ్చి పెట్టిందనే విషయాన్ని ఈమధ్య ఓ ఇంట‌ర్వ్యూలో సాయి కుమార్ చెప్పుకొచ్చారు. అయ్య‌ప్ప శ‌ర్మ దర్శకత్వంలో సాయి కుమార్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని 1998 లో రూ.2 కోట్ల బ‌డ్జెట్ తో తీశారు. 2 కోట్లు అంటే అప్ప‌ట్లో భారీ బడ్జెట్ అన్న‌మాట‌. అయితే ఆ చిత్రం డిస్ట్రిబ్యూట‌ర్లు ముందుకు రాక‌పోవ‌డంతో బాక్సాపీస్ బోల్తా పడింది. దీంతో మన డైలాగ్ కింగ్ సాయి కుమార్ కు రూ. 2 కోట్లు అప్పు మిగిలింది. ఆ తర్వాత ‘ఈశ్వరల్లా’ వ‌ల్ల వచ్చిన న‌ష్టాన్ని భర్తీ చేయడానికి సాయి కుమార్ వరుసగా 15 చిత్రాలలో నటించాల్సి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here