టాలీవుడ్ సినిమాలలో నటించే విలన్లు చాలామంది పర రాష్ట్ర వ్యక్తులే. ముఖ్యంగా బాలీవుడ్ కు చెందిన వ్యక్తులే మన తెలుగు సినిమాలలో ప్రతి కథానాయకునిగా కనిపిస్తారు. నిజంగా కొన్నిసార్లు హీరోకి కూడా రాని క్రేజ్ ప్రతి కథానాయకుడుకి కొన్ని సినిమాల ద్వారా లభించాయి అంటే నమ్మాల్సిందే. అలా చాలా మంది బాలీవుడ్ లో నటించడానికి ముందుగా దక్షిణ సినీ పరిశ్రమలో విలన్ గా పేరు పొంది, ఆ తర్వాత బాలీవుడ్ లో వారి ప్రస్థానాన్ని కొనసాగించే వారు ఎందరో.

ఇకపోతే ఈ లిస్టు లో ప్రముఖ ప్రతి కథానాయకుడు అయిన శరత్ సక్సేనా గురించి ఓ సారి తెలుసుకుందాం. 1950, ఆగస్టు 17 న మధ్య ప్రదేశ్ లోని సత్నా లో జన్మించాడు. భోపాల్ లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్, జబల్పూర్ లోని చర్చి బాయ్స్ సీనియర్ సెకండరీ హైస్కూల్లో చదువుకున్నాడు. ఆ తర్వాత జబల్పూర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో చదువుకున్నాడు. ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించాలనుకున్నాడు. అలా 1972 లో ముంబైకి వచ్చాడు. మొదట్లో చిన్న చిన్న వేషాలతో మొదలుపెట్టి ప్రతినాయక, సహాయ పాత్రల్లోకి అడుగు పెట్టాడు. ఈయన భార్య పేరు శోభ. వీరికి వీర, విశాల్ అనే ఇద్దరు పిల్లలు. వీరిద్దరూ కూడా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఆయన కేవలం హిందీ లో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కొన్ని ప్రతినాయక, సహాయ పాత్రల్లో నటించాడు. కొన్ని టి. వి కార్యక్రమాల్లో కూడా నటించాడు.

ఇక ఈయన మొదటగా బాలీవుడ్ లో 1977 లో ఏజెంట్ వినోద్ సినిమాలో మోడీ సినిమాలో నటించారు. ఇక టాలీవుడ్ లో 1989 లో అశోక చక్రవర్తి సినిమాలో నటించిన ఆయన ఆ తర్వాత నిర్ణయం, ఘరానా మొగుడు, ముఠా మేస్త్రీ, మనీ, బంగారు బుల్లోడు, గండీవం, ఎస్పీ పరశురాం, ముగ్గురు మొనగల్లు, మనీ మనీ, రాజా సింహామ్, ఉగాది, ఓక్కడు చాలు, సింహాద్రి, బన్నీ సినిమాలలో నటించాడు. అలాగే హిణిది టెలివిజన్ లో ప్రసారమయ్యే మహాభారతంలో కిచకా పాత్ర కూడా పోషించారు. కనూన్, సజన్ రే ఫిర్ జూత్ మాట్ బోలో సీరియల్స్ లో కూడా ఆయన నటించారు.

అంతేకాకుండా ఈయన మిస్టర్ ఇండియా , త్రిదేవ్ , ఘయల్ , ఖిలాడి , గులాం , ది హిడెన్ ట్రూత్ , సోల్జర్ , బాగ్బాన్ , ఫనా , క్రిష్ , ఏక్ హి రాస్తా (1993), బజరంగీ భైజాన్ లో నటించాడు. హిందీ చిత్రం మిస్టర్ ఇండియాలో డాగా పాత్రకు గాను ఆయనకు మంచి పేరు లభించింది. 1998 లో గులాం సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ ప్రతినాయిక పురస్కారం కోసం తీసుకున్నారు.ఇక ఈయన ప్రస్తుతం ముంబై శివార్లలోని ఓ ఐలాండ్ లో జీవిస్తున్నారు. తనకు వయసు మీద పడటంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. టాలీవుడ్ నుండి అనేక సినిమా ఆఫర్లు వస్తున్న కానీ ఆయన దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఇక పై ఈయనను మనం వెండితెరపై చూసే అవకాశం లేదు.



























