Connect with us

Featured

మొదటి భర్త ని కాదని మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటీమణి లక్ష్మి..!

Published

on

సమంత నటించిన ఓ బేబీ సినిమాలో బేబీ పాత్రలో నటించిన లక్ష్మి( అసలు పేరు యర్రగుడిపాడి వెంకట మహాలక్ష్మి) ఎంత గొప్ప నటిమణో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 67 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోయిన్ సమంత కంటే ఎంతో చురుకుగా, అత్యద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసారు. బాలసుబ్రహ్మణ్యం సరసన మిథునం సినిమాలో ఆమె నటించిన బుచ్చి లక్ష్మి పాత్ర ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచి పోతుందంటే అతిశయోక్తి కాదు. తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, తెలుగు వంటి పలు భాషలలో అద్భుతంగా నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న లక్ష్మి భారతీయ సినీ ప్రపంచంలో ఒక పెద్ద సంచలనం అని చెప్పుకోవచ్చు. ఉత్తమ నటీమణిగా ఏడు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్న ఏకైక నటి లక్ష్మి తన 15 ఏళ్ళ వయసులోనే సినిమా రంగంలో అరంగేట్రం చేశారు. 1991లో శ్రీవల్లి సినిమాలో ఆమె ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. తదనంతరం 1968లో జీవనాంసాం అనే ఓ తమిళ చిత్రం ద్వారా పూర్తి స్థాయిలో నటీమణి అయ్యారు. ఎటువంటి చాలెంజింగ్ పాత్రలలో అయినా నటించేందుకు నటిమణి లక్ష్మి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. తక్కువ పారితోషకం తో సరిపెట్టే ప్రయోగాత్మక చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చినా… ఏనాడు ఆమె తిరస్కరించలేదట. ఒకానొక సినిమాలో వేశ్య పాత్రలో బ్రహ్మాండంగా నటించి తన రక్తంలో అసలైన నటనా ప్రతిభ ఉందని చెప్పకనే చెప్పేశారు.

నిజం ఏమిటంటే ఆమె తండ్రి యర్రగుడిపాటి వరదా రావు( వై.వి. రావు) ప్రముఖ నటుడు దర్శకుడు కాగా… ఆమె తల్లి కుమారి రుక్మిణి ప్రముఖ తమిళ నటిమణి. ఈ విధంగా సినిమా వాతావరణంలో పుట్టి పెరిగిన లక్ష్మి అద్భుతమైన నటీమణిగా ఎదగడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. 1968 లో వచ్చిన బాంధవ్యాలు సినిమా నుండి మొన్న విడుదల అయిన ఓ బేబీ సినిమా వరకు గొప్ప నటీమణిగా కొనసాగిన లక్ష్మీ లో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేంటంటే దర్శకుడు ఒక డైలాగ్ ఇలా చెప్పాలి అని సూచిస్తే… అలా కాదు ఇలా చెప్తే ఇంకా బాగుంటుందేమో అని ఆమె తన పాత్రని చక్కదిద్దుకునే వారట. ఆమెకు ఇచ్చిన పాత్రని కూలంకషంగా పరిశీలించి ఇలాంటి పాత్రలో ఇలా నటిస్తే బాగుంటుంది అని ఎస్.వి.రంగారావు తరహాలో మైండ్ లో ఫిక్స్ అయ్యి నటించేవారట. అందుకే ఆమె ఏ పాత్ర వేసినా అత్యంత సహజంగా చాలా చక్కగా వెండితెరపై పండుతుంది. కేవలం సినిమా జీవితం లో మాత్రమే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

1974లో ఆమె నటించిన డిక్కత్ర పార్వతి సినిమా విడుదల అయి సూపర్ హిట్ గా నిలిచిన సమయంలో లక్ష్మీ తన భర్త భాస్కర్ కి విడాకులు ఇచ్చి పెద్ద సంచలనం సృష్టించారు. తన పదిహేనేళ్ళ వయసులోనే పెద్దలు కుదిర్చిన భాస్కర్ ని పెళ్లి చేసుకున్న లక్ష్మి కేవలం ఐదు సంవత్సరాలు సంసారం చేసి విడాకులు తీసుకున్నారు. 1974 మే 10వ తేదీన విడుదలైన ఛట్ఠకారి అనే మలయాళం సినిమా లో లక్ష్మి జూలీ అనే ఆంగ్లో-ఇండియన్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో జూలీ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగిన శశి( మోహన్ శర్మ)ని ప్రేమిస్తుంది. ఐతే ఈ రొమాంటిక్ మలయాళం సినిమా లో నటించిన లక్ష్మి మోహన్ శర్మ సెట్స్ లో బాగా మాట్లాడుకునేవారు. కాలక్రమేణా వారిద్దరి మధ్య మంచి స్నేహం, ఆపై ప్రేమ, తర్వాత పెళ్లికి దారి తీశాయి. మోహన్ శర్మ కూడా లక్ష్మీ లాగానే విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సినిమాలో నటించేవారు. మలయాళంలో ఇతను చాలా గొప్ప నటుడు. అయితే లక్ష్మీ ఇతడిని 1975 సంవత్సరంలో పెళ్లి చేసుకుని 1980లో వదిలేశారు. అప్పట్లో ఈమె రెండోసారి విడాకులు తీసుకోవడం సినీపరిశ్రమలో పెద్ద దుమారమే రేపింది. ఈమెను చులకనగా చూస్తూ అపహాస్యం చేస్తూ మాట్లాడేవారు బాగా పెరిగిపోయారు. కానీ ఆమె మాత్రం ఎవరి మాటలు పట్టించుకోకుండా తన కిష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో ముందుకు కొనసాగేవారు.

ఏడు సంవత్సరాలు గడిచిన తరువాత ఆమె మళ్ళీ శివచంద్రన్ అనే ఒక ప్రముఖ నటుడి ని వివాహమాడారు. ఆమె మూడో పెళ్లి చేసుకోవడంతో యావత్ సినిమా ప్రపంచంతో పాటు ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా విస్తుపోయారు. అయితే లక్ష్మి మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి గల కారణం ఏమిటి అని అడిగితే… మగాళ్ళు చూపించే గర్వం, అధికార తత్వం అని ఆమె చెబుతారు. నువ్వు తక్కువ,నేను ఎక్కువ అందుకే నువ్వు నా మాటే వినాలి అని భర్త చెబుతుంటే తనకి అస్సలు నచ్చకపోయేదట. అందుకే తన అహంకారి భర్తలకు విడాకులు ఇచ్చేసి తనను సమానంగా చూసుకునే శివచంద్రన్ ని పెళ్లి చేసుకున్నారు. ఏదేమైనా తన సినీ జీవితం, వ్యక్తిగత జీవితం రెండూ కూడా పెద్ద సంచలనాలే అని చెప్పుకోవచ్చు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

AP Politics: కూటమికి మద్దతుగా మెగాస్టార్ .. జగన్ కి ఇది ఊహించని షాక్!

Published

on

AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.

Advertisement

మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే..
ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ సభలో కత్తులు కలకలం.. పోలీసుల అదుపులోకి ఇద్దరు యువకులు?

Published

on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.

ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.

Advertisement

దాడికి ప్రయత్నమా..
ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: గులకరాయికే విలవిలలాడితే గొడ్డలి పోటు సంగతి ఏంటి జగనన్న: షర్మిల

Published

on

AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.

ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.

Advertisement

కంచుకోటకు బీటలు..
ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!