సీతయ్య, కిక్, పున్నమినాగు వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న నటీమణి నళిని సిక్కిం రాష్ట్రంలో జన్మించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషా చిత్రాల్లో నటించిన నళిని సినిమా జీవితం గురించి అందరికీ తెలిసే ఉండొచ్చు కానీ ఆమె వ్యక్తిగత జీవితం ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఆమె ఎక్కువగా ఇంటర్వ్యూలలో కూడా పాల్గొనరు. అయితే సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన నళిని తన కుటుంబ విషయాలన్నింటినీ వెల్లడించారు. ముఖ్యంగా తన భర్త గురించి కొన్ని విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. ఆ వాస్తవాలు ఏమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

తాను రాహుకాలంలో పెళ్లి చేసుకున్నానని… అందుకే భర్తతో విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త వాస్తు శాస్త్రాన్ని, దేవుళ్లను బాగా నమ్ముతారని.. తాను భరించలేనంతగా తన భర్త నమ్మకాలు ఉంటాయని… అందుకే తన భర్తతో కలిసి ఉండలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా తన తరపు న్యాయవాది ఏంటమ్మా మీ భర్తతో ఇంత మంచి గా మాట్లాడుతున్నారు. విడాకులు తీసుకోవడం అనవసరం కదా? అని ప్రశ్నించారట. బదులుగా ఆమె తప్పదని… కచ్చితంగా విడాకులు తీసుకోవాల్సిందేనని చెప్పారట.

1987వ సంవత్సరంలో రామరాజన్ ని పెళ్లి చేసుకున్న నళిని 2000వ సంవత్సరంలో అతని నుండి విడాకులు తీసుకున్నారు. 1988వ సంవత్సరంలో వీళ్ళిద్దరికీ అరుణ్ జన్మించగా మరో సంవత్సరం తర్వాత అరుణ అనే ఓ పండంటి బిడ్డ పుట్టింది. అయితే పిల్లలు చదువుకోవడం తన భర్త కి ఇష్టం లేదని… చదువుకోకపోయినా డబ్బులు సంపాదించవచ్చు అని పిల్లలకు తరచూ చెప్పేవాడట. అయితే ఎప్పుడైతే తన భర్తకు విడాకులు ఇచ్చారో ఆ క్షణం నుండి తన పిల్లలను తానే పెద్ద చదువులు చదివించారట. ఏది ఏమైనా రాహుకాలంలో పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశానంటున్నారు నళిని.



























