ఎన్టీఆర్ మాట లెక్కచేయని అలనాటి అందాల హీరోయిన్ వాణిశ్రీ పరిస్థితి ఎలా మారిపాయిందో తెలుసా?

0
415

వాణిశ్రీ గురించి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రేక్షకులకు ఆశలు చెప్పాల్సిన అవసరం లేదు. దానికి కారణం ఆమె నటించిన అనేక గొప్ప చిత్రాలు. వాణిశ్రీ 1948, ఆగష్టు 3 న నెల్లూరు లో జన్మించారు. నెల్లూరు ఉస్మాన్ సాహెబ్ పేట్ బి. వి. ఎస్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి దాకా చదువుకున్నది. తర్వాత ఆమె తల్లి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తన మకాం మద్రాసుకు మార్చింది. 1960, 1970 దశకములలో పేరొందిన తెలుగు సినిమా నటి వాణిశ్రీ. ఈమె అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో కూడా నటించింది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన వాణిశ్రీ సుఖ దుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి పేరుతెచ్చుకున్నది. ఆ తరువాత కథానాయకిగా అనేక సినిమాలో నటించి 1970వ దశకమంతా తెలుగు చిత్రరంగములో అగ్రతారగా నిలచింది.

ముందుగా నటనపై ఆసక్తితో వాణిశ్రీ మొదట నాటకాల్లో ప్రవేశించింది. ఆమె నటనను చూసిన కన్నడ దర్శకుడు హుణనూరు కృష్ణమూర్తి తన చిత్రం వీరసంకల్పలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత ఆమెకు గౌరి ప్రొడక్షన్స్ అధినేత భావ నారాయణ, దర్శకుడు బి.విఠలాచార్య మూడు సినిమాల్లో అవకాశాలిచ్చారు. తమిళ, కన్నడ అగ్రకథానాయకులైన ఎం. జి. ఆర్, శివాజీ గణేశన్, రాజ్ కుమార్ లాంటి వారి సరసన కథానాయికగా నటిస్తూనే తెలుగులో రాజబాబు, బాలకృష్ణ లాంటి హాస్యనటుల సరసన సహాయ పాత్రల్లో నటించింది. అలాగే తెలుగులో అగ్రతారలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వారితో ఎన్నో మరుపురాని చిట్యాలలో నటించింది.

అయితే ఇక వాణిశ్రీ కెరియర్ లో ఎన్టీఆర్ గారి తో నటించిన ఎదురు లేని మనిషి సినిమాలో వాన పాటకు చిత్రీకరణ జరుగుతోంది. ఆ పాటలో ఒక సన్నివేశంలో డాన్స్ కాస్త వల్గర్ గా ఉండడంతో ఆ సీన్ చేయనని వాణిశ్రీ తెగేసి చెప్పింది. ఇదే విషయాన్ని సీనియర్ ఎన్టీఆర్ గారికి చెప్పగా ఆయన కూడా ఇలాంటి చిన్న చిన్నవి చూసి చూడనట్లు వెళ్లి పోతున్నట్లు ఉండాలి అని అనడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ సన్నివేశం అప్పట్లో పెద్ద గొడవకు దారితీసింది. అయితే ఆ తర్వాత కొన్ని బుజ్జగింపుల తర్వాత సన్నివేశం తీసేసి వేరే సన్నివేశాలు పెట్టి పాటను చిత్రీకరించారు. ఇలాంటి చిన్న సంఘటనలు జరుగుతుందండంతో, అలాగే ఇంట్లోని పరిస్థితుల దృష్ట్యా ఆమె చిన్న చిన్నగా సినిమాలు తగ్గిస్తూ వచ్చారు. ఇదే క్రమంలో ఆవిడ డాక్టర్ కరుణాకర్ ని పెళ్లి చేసుకొని కుటుంబ జీవితాన్ని గడిపారు. అయితే ఆ తర్వాత కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో అత్తకి యముడు కూతురికి మొగుడు సినిమా ద్వారా మొదలుపెట్టారు.దీనితో పాటు బొబ్బిలి రాజా, ఖైదీ దాదా, సీతారత్నం గారి అబ్బాయి, ఏమండీ ఆవిడ వచ్చింది, రావు గారి ఇంట్లో రౌడీ, రౌడీ మొగుడు చిత్రాలలో నటించి తన నటనా ప్రావీణ్యాన్ని మరోసారి తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here