టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు 2వ పెళ్ళి చేసుకొన్న విషయం తెలిసిందే. మొదటి భార్య అకాల మరణంతో మనోవేదన పడుతున్న దిల్ రాజు కుటుంబ సభ్యులు ఒత్తడి చేయడంతో 2020 మే 10 వ తేదీన నిజామాబాద్ లో బాగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో 2వ పెళ్లి చేసుకున్నారు. కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో దిల్ రాజు పెళ్ళికి కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు.

దిల్ రాజు 2వ భార్య వైఘారెడ్డి పేరును కాస్తా తేజస్వినిగా మార్చేశారు. జ్యోతిష్కుల సూచనల ప్రకారం పెళ్లికి ముందే తేజస్విని అనే పేరును ఆమెకు పెట్టారు. దిల్ రాజు కుటుంబ సభ్యులు తేజస్వినిని సగౌరవంగా ఆహ్వానించారు. పెళ్లికి హాజరు కాలేకపోయిన ప్రముఖులందరూ దిల్ రాజు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా వుండగా.. దిల్ రాజు తన 2వ భార్యతో కలిసి దిగిన తొలి సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ సెల్ఫీ ఇంతిలాగ వైరలవడానికి కారణాలేమిటో తెలుసుకోవాలంటే.. వివరాల్లోకి వెళ్ళాల్సిందే.! టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో హిట్ సినిమాలను అందించారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ లు లేకపోవటంతో సినీ ప్రముఖులంతా వారి వారి ఇళ్లకే పరిమితమయ్యారు.

ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు ఇంటి పని చేసుకుంటుంటే.. మరికొందరు తారలు వంట పని చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. కానీ 2వ పెళ్లి జరిగిన తరువాత దిల్ రాజు తన బాడీ ఫిట్నెస్ పైన దృష్టి పెట్టారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన వెయిట్ తగ్గడమే కాకుండా బాడీ షేప్ కూడా మార్చే పనిలో పడి ప్రస్తుతం తన లుక్ నే చేంజ్ చేసేశారు. రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తుండటంతో పాటు తన భార్యతో కలిసి బ్యాడ్మింటన్ కూడా ఆడుతున్నారు. స్లిమ్ గా మారిన దిల్ రాజు లేటెస్ట్ గా తన 2వ భార్య తేజస్వినితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దిల్ రాజు క్రొత్త లుక్ ను చూసిన నెటిజన్లందరూ షాకయ్యారు.



























