టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత ఆర్.ఆర్.వెంకట్ ఈరోజు కన్నుమూసారు. గతకొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ హైదరాబాద్, గచ్చిబౌలీ ఏఐజీ ఆసుపత్రిలో మరణించారు.

ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ పలు చిత్రాలు నిర్మించారు. సామాన్యుడు, ఆంధ్రావాలా, డమరుకం, కిక్, ఆటోనగర్ సూర్య, మిరపకాయ్, బిజినెస్ మ్యాన్, పైసా వంటి పలు చిత్రాలను అయన నిర్మించారు. అటు వెంకట్ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.



























