ఒక‌ప్ప‌ట్లో తెలుగు సినిమా అంటే.. అచ్చ తెలుగుద‌నాల ఆడ‌ప‌డుచులా క‌ళ‌క‌ళ‌లాడుతూ క‌నిపించేది. అప్ప‌ట్లో ఎన్టీఆర్ – ఏఎన్నార్ – కృష్ణ‌ – శోభ‌న్ బాబుతో పాటు సావిత్రి – భానుమ‌తి – జుమున‌లాంటి హీరోయిన్లు తెలుగుద‌నానికే ప్ర‌తీక‌ల్లా నిలిచేవాళ్లు. అస‌లు భానుమ‌తి అయితే స్వ‌త‌హాగా క‌వ‌యిత్రి – సంగీత‌జ్ఞురాలు. ఆమె త‌నే పాట రాసి త‌నే సంగీతం స‌మ‌కూర్చి త‌నే పాడి ప్రేక్ష‌క జ‌నుల‌ను అల‌రించేది. ఇక ఎన్టీఆర్ సంగ‌తి స‌రే స‌రి. తెలుగుద‌నానికే నిలువెత్తు రూపం. త‌నే రాసి.. త‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌మే కాదు త‌నే అందులో బ‌హు పాత్ర‌ల‌ను అవ‌లీల‌గా పోషించేవారు. అలాంటి తెలుగు ద‌నాల పుట్టినిల్ల‌యిన తెలుగు సినిమాను ప్ర‌స్తుతం క‌థానాయిక‌లు ఏకంగా ఇత‌ర భాషా ప్రాంతాల వాళ్లు. వీళ్ల‌కు తెలుగు రాక పోవ‌డాన్ని ఎలాగోలా స‌ర్దుకుపోవ‌చ్చు. అదే మ‌న ప్రాంతానికి చెందిన హీరోలు.. తెలుగులో పండితులు కాదు స‌రిక‌దా.. ప‌ర‌మ శుంఠ‌లుగా త‌యార‌య్యారు.

వీళ్ల‌లో ఫ‌స్ట్ ప్లేస్ మ‌న సూపర్ స్టార్ మ‌హేష్ బాబుదే. తెలుగు సినిమా తీసుకున్న ఎన్నో మ‌లుపుల్లో మ‌హేష్ తండ్రి కృష్ణ మూల పురుషుడిలా క‌నిపిస్తారా? అదే మ‌న మ‌హేష్ బాబు.. తెలుగు లో అక్ష‌రం ముక్క రాదు. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ వాట్ టుడూ వాట్ నాట్ టుడూ అంటూ ఇంత పెద్ద డైలాగులు తెర మీద చెబుతాడే కానీ.. అదంతా ఇంగ్లీష్ లో రాసుకుని తెలుగులో బ‌య‌ట‌కు వ‌ద‌ల‌టమే. ఈయ‌న స‌తీమ‌ణి న‌మ్ర‌త అంటే ఏదో పొరుగు రాష్ట్రంలో పుట్టిన అమ్మాయి కాబ‌ట్టి. తెలుగు భాష రాలేదంటే స‌రిపెట్టుకోవ‌చ్చు. ఇత‌డికేమైందీ.. తెలుగు సినిమాకే గ‌ర్వ‌కార‌ణంగా నిలిచే తండ్రి క‌డుపున పుట్టిన త‌న‌యుడన్న పేరు. యాభైకి పైగా తెలుగక్ష‌రాలు నేర్చేసుకుంటే ఏం పోతుందీ? అంటే సమాధాన‌ముండ‌దు. అస‌లు మ‌హేష్ బాబు శ్రీమంతుడిలా మారి గ్రామాలు ద‌త్త‌త తీసుకోవ‌డం అటుంచితే.. బ‌డిపంతుల్లా మారి మ‌న‌లో ఎవ‌రైనా ఇత‌డి భాషా అజ్ఞానాన్ని ద‌త్త‌త తీసుకోవాలి. తెలుగు పూర్తిగా నేర్పించాలి. పైపెచ్చు ఈ హీరోగారు ఓ సినిమాలో చెప్పిస్తారూ.. పెద్ద పెద్ద డైలాగులుంటే లాగై పోతాయ‌ని అనిపిస్తారు. అద‌స‌లు లాగ్ ప్రాబ్లం కాదు.. లాంగ్వేజ్ ప్రాబ్లం. పెద్ద పెద్ద‌ డైలాగులుంటే వాటిని గుర్తు పెట్టుకోవ‌డం సాధ్యం కాక‌.. అలా క‌వ‌రింగ్ ఇచ్చాడ‌న్న‌మాట‌.

ఇక జూస్కోండి తెలుగు భాషా అజ్ఞాని పార్ట్ టూ కు వ‌ద్దాం. ఈమెకు స‌హ‌జ న‌టి అన్న పేరుంది. అలనాటి తెలుగు క‌థానాయిక‌ల్లోనే అగ్ర‌తార‌క‌. కానీ తెలుగు అక్ష‌రం ముక్క రాదు. ఎస్ మీరు ఊహించింది క‌రెక్టే.. జ‌య‌సుధ‌కు తెలుగు రానే రాదు. త‌న కెరీర్ తొలినాళ్ల‌లో జ్ఞాప‌క‌శ‌క్తి బాగా ఉండ‌టం చేత చెప్పిన డైలాగ్ విని కంఠ‌తా ప‌ట్టి చెప్పేసేది. ఇప్పుడు వ‌య‌సు మీద ప‌డ్డ కార‌ణంగా జ్ఞాప‌క‌శ‌క్తి అంతంత మాత్రంగా త‌యారైంది. దీంతో పదే ప‌దే ప్రాంప్టింగ్ అడుగుతున్నార‌ట‌.

ఇకపోతే.. మంచు ల‌క్ష్మి. తెలుగులో మంచు వారింటి అమ్మాయిగారిది ఓ ప్ర‌త్యేక భాష‌గా త‌యారైంది. తెలుగును టెంగ్లీష్ గా క‌న్వ‌ర్ట్ చేసిన ఘ‌న‌త ఈ అమ్మ‌డిదే. తెలుగు ఫాంట్స్ కంటూ కొన్ని పేర్లుంటాయి. అలా తెలుగు లాంగ్వేజ్ లో మంచు ల‌క్ష్మి లాంగ్వేజ్ అంటూ ఒక‌టి ఫాం అయ్యిందంటే అది ఈ అమ్మ‌డి చ‌ల‌వే. తండ్రేమో ఐదు వంద‌ల చిత్రాల్లో న‌టించిన దిగ్గ‌జ న‌టుడు. తెలుగు డైలాగ్ చెప్ప‌డంలో ఉద్ధండ పిండం. డైలాగ్ కింగ్ గా పేరున్న వాడు. అలాంటి తండ్రి క‌డుపున పుట్టిన ల‌క్ష్మి… తండ్రి పేరే కాదు తెలుగు భాష‌ను ఖూనీ చేసేస్తోంది. ఆశ‌లేమో ఆస్కార్ రేంజ్ లో ఉండే ల‌క్ష్మికి.. తెలుగు భాష‌లోని ఆ కొన్ని అక్ష‌రాలు నేర్చుకోడానికి బ‌ద్ధ‌కం. మ‌రి ఈ పెర్ఫామెన్స్ లెవ‌ల్స్ తో భాస్క‌ర్ రేంజ్ అయినా అందుకోలేక పోతోందీ మంచు మ‌హాల‌క్ష్మి. అక్క చేసిన పొర‌బాట్లు త‌మ్ముళ్ల‌యినా స‌రి దిద్దుతార్లే అని ఆశిస్తే అక్క‌డా త‌ప్పులో కాలే. మంచు విష్ణు అయితే త‌న పేరు తాను తెలుగులో రాసుకోలేడు స‌రి క‌దా? క‌నీసం రోల్ కాకుండా ప‌ల‌క‌లేడు. ఎందుకంటే అస‌ల‌త‌డికి నోరే తిర‌గ‌దు. ఇత‌డు మాట్లాడింది వింటే.. అంత‌టి మ‌హాన‌టుడి క‌డుపున ఇలాంటి కుక్క‌మూతి పిందెలా? అనిపిస్తుంది. ఇక మంచు మ‌రో త‌మ్ముడు మ‌నోజ్ కూడా తండ్రిలోని క‌నీస ల‌క్ష‌ణాలు పుణికి పుచ్చుకోలేదు స‌రిక‌దా? తెలుగు భాష‌ను కొంత కూడా నేర్చుకోలేదు. ఒకే తాను ముక్క‌లుగా ఏం చేద్దాం.. అని ఈ ముగ్గుర్నీ స‌రిపెట్టుకోవ‌ల్సి వ‌స్తోంది తెలుగు ప్రేక్ష‌కులు.

ఇక పోతే తెలుగు చిత్ర‌సీమ‌కే మెగా స్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తేజ్. మ‌న‌దీ సేమ్ సీనే. తెలుగు అన్నోన్ స్టారే. తెలుగు తెలీదు. ఇప్పుడిప్పుడే కాసిన్ని తెలుగు అక్ష‌రాల‌ను గుర్తు ప‌ట్టే స్టేజ్ కు వ‌చ్చాడు. ముంబై హీరోయిన్ల‌కంటే కాస్త బెట‌ర‌ట మ‌న వాడి తెలుగు. అ-ఆ-ఇ-ఈ ల‌ను బాగానే గుర్తు ప‌డుతున్నాడ‌ట‌. ఇత‌డు కం- కః వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి కెరీర్ ఎండై పోయినా ఆశ్చ‌ర్యం లేదు. అంతగా తెలుగు రాని హీరోల్లో ఒక‌డిగా నిలుస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్ సైతం.

అక్కినేని అఖిల్. తాత నాగేశ్వ‌ర‌రావు.. తెలుగు సినిమా రెండుక‌ళ్ల‌లో ఒక‌ర‌న్న పేరు. తండ్రి నాగార్జున తెలుగు అగ్ర హీరోల్లో ఒక‌ర‌న్న ఖ్యాతి. ఇవేవీ ఇత‌డిపై ప‌ని చేయ‌వు. తెలుగు రాష్ట్రంలో ఉన్నాడు కాబ‌ట్టి.. ఇంటా బ‌య‌టా వాళ్లూ వీళ్లూ తెలుగు మాట్లాడుతుంటారు కాబ‌ట్టి.. ఎలాగోలా నేర్చేసుకున్నాడు. లేకుంటే అదీ లేదు. పొట్ట‌పొడిస్తే తెలుగు అక్ష‌రం ముక్క రాదు. ఎంత డైలాగైనా స‌రే ఇంగ్లీష్ లో రాసుకుని చెప్పాల్సిందే.

ఇలా ఒక‌రిద్ద‌రుంటే మ‌నం వాళ్ల గురించి మాట్లాడుకోగ‌లం. తెలుగు తెర నిండా ప‌రాయి భాషా హీరోయిన్లే కాదు.. మ‌న భాష తెలియ‌ని హీరోలే. తెలుగు స్ప‌ష్టంగా తెలిసిన వాళ్లు వేళ్ల మీద లెక్క పెట్ట ద‌గినంత‌ మాత్ర‌మే ఉన్నారు. రానా, నాగ‌చైత‌న్య‌, శార్వానంద్, వ‌రుణ్ సందేశ్, త‌రుణ్, ఆదిపినిశెట్టి, నిహారిక‌, వ‌రుణ్ తేజ్, హీరో శ్రీకాంత్ కొడుకు రోష‌న్, సుమంత్, సుశాంత్.. వీళ్ల‌లో ఒక్క‌రంటే ఒక్క‌రికి తెలుగు తెలిస్తే ఒట్టు. ఒక‌ర‌కంగా ప్ర‌కాష్ రాజ్ ను చూసి వీళ్లు బుద్ధి తెచ్చుకోవాలి. కార‌ణం ప్ర‌కాష్ రాజ్ క‌ర్ణాట‌క‌లో పుట్టినా.. తెలుగు భాష‌ను ప‌ట్టుబ‌ట్టి నేర్చుకోవ‌డ‌మే కాదు.. మొన్న ఒక పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో త‌న క‌వితా సంపుటి విడుద‌ల చేశాడు. ప‌రాయి భాష‌కు చెందిన వాడైనా తెలుగు నేర్చుకోవ‌డంలో ఇత‌డు చూపిన క‌నీస శ్ర‌ద్ధ మ‌న తెలుగు ద‌నానికే బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌యిన హీరోల‌ బిడ్డ‌ల‌కు లేక పోయిందే అన్న తెలుగు ప్రేక్ష‌కుల బాధ ఎప్ప‌టికి తీరేనో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here