ఈ కళా ఖండానికి తెలుగు చిత్ర రంగంలోనే కాదు భారతీయ చిత్రరంగంలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో అసాధ్యాలను సుసాధ్యం చేయడం తలకు మించిన సాహస కృత్యాలను ఎంచుకొని వాటిని ధైర్యంతో ఎదుర్కోవడం. ఇంతకుముందు సినిమా కథలో వచ్చే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటే అటువైపు కథానాయకుడు కొట్టుకెళ్ళేవాడు. ఈ సినిమాతోనే కథానాయకుడు ప్రతికూల పరిస్థితులకు ఎదురీది తాను అనుకున్నది సాధించేవాడు. ఇలాంటి మాస్ ఇమేజ్ కథలతో ప్రస్తుత దర్శక నిర్మాతలు ముఖ్యంగా హీరోలు పట్టుకొని వేలాడుతున్నారు.

దాదాపు 70 సంవత్సరాల క్రితం అంటే 1951లో విడుదలైన పాతాళభైరవి చిత్రం అనగానే ఆ అత్యద్భుత జానపద కళాఖండం మనందరికీ గుర్తొస్తుంది. నాగిరెడ్డి చక్రపాణి 1949లో వాహిని స్టూడియోను తీసుకున్నారు. అలా వారు విజయ ప్రొడక్షన్ తో నిర్మించిన మొదటి తెలుగు చిత్రం షావుకారు ఇందులో హీరోయిన్ గా జానకి నటించడం వలన ఆమెను ఇప్పటికీ షావుకారు జానకి అనే పిలుస్తారు. షావుకారు చిత్రానికి అయితే పేరు బ్రహ్మాండంగా వచ్చింది. కానీ కాసులు మాత్రం కురవలేదు. ఎంత పేరు తీసుకొచ్చిన చిత్రమైన కాసులు కురవందే కొత్త కథలు రావు కథలు లేనిదే సినిమాలు లేవు. ఈ సందర్భంలో నాగిరెడ్డి, చక్రపాణిలు కాశీ మజిలీ కథలు లేదా అల్లావుద్దీన్ అద్భుతదీపం లాంటి కథలతో ఒక జానపద చిత్రాన్ని రూపొందించాలకున్నారు.

ఈ విజయ ప్రొడక్షన్స్ వారు అంతకుముందే గుణసుందరి కథ చిత్రం హిట్ కావడంతో కే.వి.రెడ్డి గారిని తాము తీయబోయే జానపద చిత్రానికి దర్శకత్వం వహించాల్సిందిగా కోరడం జరిగింది. అప్పుడు విజయ ప్రొడక్షన్స్ వారు ఎన్టీ రామారావును, కె వి రెడ్డి అక్కినేని నాగేశ్వరరావును హీరోగా అనుకోగా విచిత్రంగా అప్పుడే “గండరగండడు” అనే చిత్రంలో నటించిన తుపాకుల రాజా రెడ్డి పైన ట్రాయల్ షూట్ చేశారు. ఆ షూటింగ్ లో తుపాకుల రాజారెడ్డి కొన్ని సంభాషణలు నత్తి పలకడండం తో ఆ అవకాశం కాస్త తృటిలో తప్పిపోయింది.



























